కమిటీలంటే మోసమే
సీపీఎస్ ఉద్యోగుల నిరసన గళం
కమిటీలంటే మోసమే
విజయనగరం, న్యూస్‌టుడే: సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు గళమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రిబ్యూటరీ పింఛను పథకం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పలుచోట్ల మనోవేదన పేరుతో ఆదివారం సభలు, ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఇప్పుడు మూడు కమిటీలు వేయడమంటే ఉద్యోగులను మోసం చేయడమేనని సంఘనాయకులు తెలిపారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
* విజయనగరంలో నిర్వహించిన ర్యాలీకి ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విజయనగరంతోపాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలివచ్చారు. ర్యాలీ అనంతరం గురజాడ కళాక్షేత్రంలో బహిరంగ సభ నిర్వహించారు.
* అనంతపురం కలెక్టరేట్ ముందు ఉద్యోగులు మనోవేదన సభ నిర్వహించి సీపీఎస్ రద్దుపై నినదించారు. కార్యక్రమంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయ యాదవ్ మాట్లాడుతూ.. నూతన పింఛను విధానంతో అందరూ నష్టపోవాల్సి వస్తోందని, దీన్ని రద్దు చేయకుండా ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
0 Comments:
Post a Comment