ఏపీ కేబినెట్ భేటీకి ముందస్తు చర్యలు
అమరావతి: ఈనెల 27న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మంత్రిమండలి భేటీ జరిగే రోజు ..మంత్రులు సచివాలయానికి వెళ్లే దారిలో నిరసనలకు అనుమతి నిరాకరించారు. మందడం నుంచి సచివాలయానికి వెళ్లే రహదారి పక్కనున్న ఇళ్ల యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 27వ తేదీ రైతుల నివాసాల్లో కొత్త వ్యక్తులు ఉండకూడదని, గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు తెలియజేయాలని నోటీసులో పేర్కొన్నారు.
మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత పరిధిలోని 29 గ్రామాల రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నా్రు. మందడం నుంచి సచివాలయానికి వెళ్లే రహదారిని రైతులు పెద్ద ఎత్తున మహాధర్నాతో దిగ్బంధించడంతో రాకపోకలు స్తంభించాయి. ఈనేపథ్యంలో ఎల్లుండి మంత్రివర్గ భేటీ సందర్భంగా ఎలాంటి ఘటనలు జరిగినా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరుగుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మంత్రివర్గ సమావేశం వెలగపూడిలోనే జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతుండగా... మరో వైపు విశాఖలో జరుగుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. రాజధాని, రాష్ట్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రిమండలి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈనేపథ్యంలో రాజధాని రైతులు ఆందోళనను మరింత ఉద్ధృతం చేసేఅవకాశముందని భావిస్తున్న పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.

0 Comments:
Post a Comment