11న మంత్రివర్గ సమావేశం పలు కీలక బిల్లులకు ఆమోదం
ఈ నెల 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై సత్వర నిర్ణయం తీసుకునే విధంగా ప్రతి నెలా రెండు, నాలుగో బుధవారాల్లో కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు. సోమవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది.
ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయడం, ప్రైవేటు వాహన చార్జీల నియంత్రణ,
మహిళల భద్రత, లైంగిక వేధిపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు,
దేవాలయ కమిటీ సభ్యుల సంఖ్య పెంపు వంటి అంశాలపై రూపొందించిన బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. వాటితో పాటు మరికొన్ని టేబుల్ ఐటంలకూ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభిస్తుందని అధికారులు చెప్తున్నారు.
0 Comments:
Post a Comment