ఏపీలో 2020 జనవరి 1వ తేదీన ప్రారంభం కావాల్సిన గ్రామ సచివాలయ పాలన వాయిదా పడింది. ఈ మేరకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 26వ తేదీ వరకు వాయిదా వేసింది. మౌలిక సదుపాయాల కొరత కారణంగా సచివాలయ పాలన ప్రారంభాన్ని ప్రభుత్వం వాయిదా వేసిందని అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం 2020 జనవరి 1వ తేదీ నుంచి గ్రామ సచివాలయ పాలన ప్రారంభం కావాల్సి ఉంది. ప్రభుత్వం కూడా అలానే చేయాలని అనుకుంది. ఇందుకు ఏర్పాట్లు కూడా చేశారు. జనవరి 1 నుంచి సచివాలయాల ద్వారా 500 రకాల సేవలు అందించాలని ప్రభుత్వం అనుకుంది. అయితే అనుకున్న స్థాయిలో మౌలిక సదుపాయాలు పూర్తి కాలేదు. ఇప్పుటే స్టార్ట్ చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన అధికారులు.సచివాలయ పాలనను వాయిదా వేసుకున్నారు.
మీ సేవ కేంద్రాల ద్వారా అందిస్తున్న వివిధ సేవలను ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలోకి తీసుకొచ్చింది. మీ-సేవా కేంద్రాల్లో నగదు చెల్లించి పొందుతున్న ప్రభుత్వ సేవలన్నీ ఇక మీదట సచివాలయాల్లో ఉచితంగా పొందవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఈ బాధ్యతలను డిజిటల్ అసిస్టెంట్లకు అప్పగించింది.
కిందిస్థాయిలో పరిపాలన వికేంద్రీకణకు వార్డు/ సచివాలయ వ్యవస్థను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక్కడ కంప్యూటర్లు, ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటివరకు మీ-సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలన్నీ గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉచితంగా అందుబాటులోకి వస్తాయి. దాదాపు ప్రతి పంచాయతీలో గ్రామ సచివాలయాలు ఉండడం, ఆన్‌లైన్ సేవలు ఉచితంగా అందుబాటులోకి రానుండడంతో ప్రజలు అటు వైపే మొగ్గుచూపుతారు. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా 500లకు పైగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్‌లైన్‌లోనే సేవలను నిర్ణీత గడువులోగా అందించనున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందించే సేవలను మూడు రకాలుగా విభజించారు. కొన్ని సేవలను దరఖాస్తు చేయగానే స్పాట్ లోనే అందిస్తారు. ఇంకొన్ని సేవలను 72 గంటల్లోగా, మరికొన్ని సేవలను 72 గంటలు దాటిన తర్వాత అందిస్తారు. ఉదాహరణకు.. రైతు తన పొలానికి సంబంధించి అడంగల్ కోసం గ్రామ సచివాలయానికి వస్తే అక్కడికక్కడే ప్రింట్ తీసి ఇచ్చేస్తారు. ఇదంతా పావు గంటలోనే పూర్తవుతుంది. ఇప్పటివరకు వివిధ శాఖలకు చెందిన 47 రకాల సేవలను అప్పటికప్పుడే పావు గంటలో అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా 72 గంటల్లోగా 148 రకాల సేవలను, 72 గంటల తర్వాత 311 రకాల సేవలను అందిస్తారు. ఈ 311 రకాల సేవలను 72 గంటల కంటే ఇంకా తక్కువ వ్యవధిలోనే అందించేందుకు గల అవకాశాలపై అధ్యయనం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాయాల కోసం ప్రత్యేక పోర్టల్ రూపొందిస్తున్నారు. ఈ పోర్టల్‌ను సీఎం డ్యాష్ బోర్డుతో పాటు సంబంధిత శాఖలతో అనుసంధానిస్తారు. ప్రజలకు అందించాల్సిన సేవలపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇకపై నిత్యం స్పందన కార్యక్రమం నిర్వహించనున్నారు.

0 Comments:
Post a Comment