ఏప్రిల్, మే నెలల్లో బ్రిడ్జి కోర్సులు
ఆంగ్ల మాధ్యమం తీసుకురానున్న నేపథ్యంలో నిర్ణయం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-6 తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేస్తున్నందున విద్యార్థులకు బ్రిడ్జికోర్సు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. బ్రిడ్జి కోర్సుకు అవసరమైన పుస్తకాలను రూపొందిస్తోంది. ఈ కోర్సు కాలంలో ఆంగ్ల భాషకు సంబంధించిన వీడియోలను విద్యార్థులకు చూపించనున్నారు. ప్రస్తుతం ఐదో తరగతి తెలుగు మాధ్యమంలో చదువుతున్న వారిపై ప్రధానంగా దృష్టిసారించారు. వీరు వచ్చే ఏడాది ఆంగ్లంలో చదవాల్సి వస్తుంది. వీరిని సన్నద్ధం చేసేందుకు ఏప్రిల్, మే నెలల్లో బ్రిడ్జి కోర్సు నిర్వహించనున్నారు. 1-4 తరగతులకు జూన్, జులైలో ఐదారు వారాలపాటు నిర్వహించనున్నారు. ఆంగ్ల ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్న పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు సొంతంగా ఆంగ్లంలో ప్రావీణ్యం సాధించేందుకు సినిమాలు, వీడియో, ఆడియో, మొబైల్ యాప్స్‌ను అందుబాటులో ఉంచనున్నారు.
0 Comments:
Post a Comment