ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్దం చేస్తున్నామన్నారు. విశాఖలో పర్యటిస్తున్న మంత్రి బొత్స మున్సిపల్ ఎన్నికల పై క్లారిటినిచ్చారు. అదే విధంగా రెండు విడతల్లో విశాఖ మెట్రో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలనే దాని పై కమిటి వేశామని, కమిటి నివేదిక తర్వాత రాజధాని పై స్పష్టత వస్తుందన్నారు. రాజధాని పై అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజధాని రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
0 Comments:
Post a Comment