అలాంటి దేశమే లేదు
నిత్యానందకు మావద్ద భూభాగం అమ్మలేదు
ఆశ్రయమూ తిరస్కృతి.. హైతీలో ఉండే చాన్సు
నిత్యానంద వెబ్‌సైట్లో కావాలనే ‘దేశ’ప్రచారం
మీడియాకదే ఆధారం.. ఈక్వెడార్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ, డిసెంబరు 6: వివాదాస్పద మతగురువు నిత్యానంద తనకంటూ ప్రత్యేక దేశం, ప్రభుత్వం, జెం డాను ఏర్పాటు చేసుకున్నారన్న వార్తలు విని, అంతా ‘ఔరా’ అన్నారు. ‘కైలాస్’ అనే పేరుపెట్టిన ఈ దేశానికి గుర్తింపు కోసం ఐక్యరాజ్యసమితిలో ప్రయత్నాలూ సాగుతున్నాయన్న కథనాలు చదివి విస్తుపోయారు. అయితే, ఈ కథనాలేవీ వాస్తవం కాదని ఈక్వెడార్ స్ప ష్టం చేసింది. ‘కైలా్‌స’ను తమ నుంచి కొనుగోలు చేసిన భూభాగంలో నిత్యానంద ఏర్పాటు చేశారన్న వార్తలను కొట్టేసింది. అత్యాచారం కేసులో ఆయన అభియోగాలను ఎదుర్కొంటున్నారు. అరెస్టు భయం తో దేశం దాటిపోయిన నిత్యానందకు తమ దేశం ఆశ్రయం ఇచ్చిందనేది వాస్త వం కాదని ఈక్వెడార్ పేర్కొంది. ‘‘నిత్యానంద మమ్మల్ని ఆశ్రయం కోరినమాట నిజమే. శరణార్థిలా మా దేశంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన దరఖాస్తు చేసుకొన్నారు. దాన్ని మేం తిరస్కరిం చాం.
దీంతో ఆయన కరేబియన్ దీవుల్లో ఒకటైన హైతీ కి తరలిపోయినట్టు తెలుస్తోంది’’అని భారత్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది. ఉత్తర అమెరికాలో భాగమైన ఈక్వెడార్ నుంచి ఒక ద్వీపాన్ని నిత్యానంద కొని, అక్కడ హిందూదేశం నిర్మించుకొన్నట్టు తొలుత వార్తలొచ్చాయి. అధికార మతంగా సనాతన హైందవాన్ని ప్రకటించుకొన్న ఈ దేశంలో పాస్‌పోర్టు నుంచి పౌరసత్వందాకా ప్రతీది ప్రత్యేకమేనని కథనాలు వెలువడ్డాయి. అయితే, డిజిటల్ మీడియా, కొన్ని పత్రికల్లో కనిపించిన ఈ కథనాలన్నింటికీ నిత్యానంద సొంత వెబ్‌సైట్ ‘కైలా్‌స.ఆర్గ్’ వండివార్చిన సమాచారమే ఆధారమని ఈక్వెడార్ పేర్కొంది. కాగా, నిత్యానంద పాస్‌పోర్టును రద్దుచేసినట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. పిల్లల అక్రమ నిర్బంధం, ఇద్దరు మహిళల అదృశ్యం, అపహరణ కేసుల్లో నిత్యానంద కోసం గాలిస్తున్న గుజరాత్ పోలీసులు తాజా కథనాలతో అప్రమత్తం అయ్యారు. ఆయనపై బ్లూ కార్నర్ నోటీసు జారీచేసేలా ఇంటర్‌పోల్‌ను సంప్రదించేందుకు సహకరించాలని సీఐడీకి శుక్రవారం లేఖ రాశారు.

0 Comments:
Post a Comment