రాజధానిపై చర్చ జరగాలి: బొత్స
అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించడంపై ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సందిగ్ధంలో పడేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజధానిపై ఇంకా చర్చ జరగాల్సి ఉందని, కమిటీ నిర్ణయం వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. శాసనమండలిలో కేవలం సభ్యుల ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పానని బొత్స వివరణ ఇచ్చారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎక్స్‌పర్ట్ కమిటీ 13 జిల్లాల్లో పర్యటిస్తుందని, త్వరలోనే నివేదిక అందజేస్తుందని తెలిపారు.
మండలిలో బొత్స ఏమన్నారంటే?
శుక్రవారం శాసనమండలిలో తెదేపా సభ్యులు రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తూ మూడు ప్రశ్నలు వేశారు. అమరావతి నుంచి రాజధానిని మార్చే ప్రతిపాదన ఉందా? అమరావతి అభివృద్ధికి ఇప్పటివరకు ఖర్చు చేసిన వివరాలు? రాజధాని మార్చితే రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎలా ఉండబోతోంది? అని ప్రశ్నించారు. రాజధానిని మార్చే ప్రతిపాదన లేదని, అందువల్ల మిగతా రెండు ప్రశ్నలూ ఉత్పన్నం కావని మంత్రి బొత్స లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాజధానిపై ఇవాళ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో గందరగోళం మళ్లీ మొదటికొచ్చింది.
0 Comments:
Post a Comment