దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్
హైదరాబాద్: శంషాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలు ‘దిశ’ హత్యోదంతానికి పోలీసులు ముగింపు పలికారు. కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్న కేశవులను శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ చేశారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఎన్‌కౌంటర్‌కు గల కారణాలు పోలీసులు గోప్యంగా ఉంచారు. గత నెల 27న దిశను నిందితులు అత్యాచారం చేసి ఆ తర్వాత కాల్చి చంపారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని, లేదా బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు దిశను కాల్చిన చోటే నిందితులను ఎన్‌కౌంటర్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ‘దిశ’ హత్యాచారం జరిగిన చోట సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారని, ఈ క్రమంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారని పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది.

0 Comments:
Post a Comment