టీమిండియా అద్భుత విజయం
విండీస్‌పై వరుసగా పదో సిరీస్ గెలుపు
కటక్: వెస్టిండీస్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. దీంతో ఆ జట్టుపై వరుసగా పది సిరీస్‌లు గెలిచి చరిత్ర సృష్టించింది. 316 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 48.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ(85; 81 బంతుల్లో 9x4) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా కేఎల్ రాహుల్(77; 89 బంతుల్లో 8x4, 1x6), రోహిత్‌శర్మ(63; 63 బంతుల్లో 8x4, 1x6) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో జడేజా (39; 31 బంతుల్లో 4x4), శార్ధుల్ ఠాకుర్ (17; 6 బంతుల్లో 2x4, 1x6) ధాటిగా ఆడడంతో భారత్ అద్భుత విజయం సాధించింది. దీంతో 2-1తేడాతో విండీస్‌పై సిరీస్ గెలుపొందింది.

0 Comments:
Post a Comment