అమరావతి: రాష్ట్ర అభివృద్ధి ఏవిధంగా ఉండాలి.. రాజధాని ఎలా ఉండాలనే అంశాలపై తమ కమిటీ అధ్యయనం చేసిందని విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు తెలిపారు. రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై సీఎం జగన్‌కు తుది నివేదిక సమర్పించిన అనంతరం కమిటీ సభ్యులు సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎన్ రావు మాట్లాడుతూ 'అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా సూచనలు చేయాలని ప్రభుత్వం తమకు సూచించిందని చెప్పారు. పరిపాలన పరంగా నాలుగు ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని తాము ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో సూచించామని తెలిపారు. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయాలని తెలిపామన్నారు.
0 Comments:
Post a Comment