ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముషారఫ్‌ను ఉరి తీయాలంటూ పాకిస్తాన్‌లోని లాహోర్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ ఆయనపై గతంలో దేశద్రోహం కేసు నమోదయిన విషయం తెలిసిందే. ముషారఫ్‌పై నమోదైన కేసులను సుదీర్ఘంగా విచారించిన ముగ్గురు న్యాయమూర్తలు ధర్మాసనం మంగళవారం ఆయన్ని దోషిగా తేల్చుతూ.. తీర్పును వెలువరించింది. కాగా దేశ అధ్యక్షుడిగా ఉరిశిక్షను విధించడం పాకిస్తాన్ దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
ముషారఫ్ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే రాజ్యాంగాన్నికి వ్యతిరేంగా 2007నవంబర్3న దేశంలో ఎమర్జెనీ విధించినందుకు ఆయనపై 2013లో దేశద్రోహం కేసు నమోదైంది. గత నాలుగేళ్లుగా దుబాయ్‌లో తలదాచుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ముషారఫ్‌ను పాక్‌కు తీసుకువచ్చి ఉరి తీయడం అనేది ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. మరోవైపు లాహోర్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.
0 Comments:
Post a Comment