అవును మీరు వింటున్నది నిజమే. భూత్ విద్యతో సర్టిఫికేట్ కోర్సు త్వరలో ప్రారంభం కానుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో BHU (బనాసర్ హిందూ యూనివర్సిటీ) ఈ కోర్సును ప్రవేశ పెడుతోంది. ఆరు నెలల పాటు ఈ కోర్సు ఉండనుంది. 2020 సంవత్సరం జనవరి నెల నుంచి ప్రారంభం కానుంది. కోర్సు సమయంలో మానసిక రుగ్మతలు, మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారికి అందించే చికిత్స గురించి వైద్యులు వివరించనున్నారు. ఈ కోర్సును ఆయుర్వేద అధ్యాపకులు నిర్వహిస్తారు.
BAMS (బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసన్ అండ్ సర్జరీ), MBBS (బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ) కోర్సు నేర్చుకోవడానికి పేర్లు నమోదు చేసుకోవచ్చు.
దేశంలోనే భూత్ విద్యను ప్రవేశ పెట్టిన యూనివర్సిటీ ఇదే. ఆయుర్వేద ఫాకల్టీ డీన్ గా యామిని భూషన్ త్రిపాఠి వ్యవహరించే అవకాశం ఉంది.
దైవా, దైత్య, గాంధర్వ, యక్ష, రక్ష, పితార్, పిసాష్, నాగ్ మొదలైన వాటి వల్ల కలిగే వ్యాధులు, శాంతిపథ్, బలిప్రదాన్, హవన్..మొదలైన వాటిని భూత విద్యలో భాగమంటున్నారు.
మరి ఈ కోర్సులో ఎంత మంది చేరుతారు ? తదితర వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
0 Comments:
Post a Comment