పంచాయతీ రిజర్వేషన్లపై 3 రోజుల్లో స్పష్టత
మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయం?
పంచాయతీ ఎన్నికల్లో అమలు చేయాల్సిన రిజర్వేషన్లపై ఈనెల 27న మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో నిర్వహించిన ఎన్నికల ప్రకారం 60.52 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారా? సుప్రీంకోర్టు ఆదేశాలపై 50 శాతానికి రిజర్వేషన్లు పరిమితం చేస్తారా? అనే దానిపై శుక్రవారంనాటి సమావేశంలో స్పష్టత రానుంది. 2018 ఆగస్టు 1తో పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసినా సకాలంలో తిరిగి ఎన్నికలు నిర్వహించకపోవడంపై ఒక కేసులో హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పుపట్టిన విషయం తెలిసిందే. దీనిపై వచ్చే నెల 3లోగా రిజర్వేషన్లు ఖరారు చేసి హైకోర్టుకు సమర్పిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో ప్రమాణపత్రాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితోనూ అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. సీఎం కార్యాలయంతోనూ చర్చించాక మంత్రిమండలి సమావేశ అజెండాలో చేర్చేలా ప్రకటన తయారుచేయాలని అధికారులు యోచిస్తున్నారు. మంత్రిమండలిలో నిర్ణయం తరువాత హైకోర్టుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదిక అందజేస్తారు.

0 Comments:
Post a Comment