ఇంటర్నెట్ డెస్క్: మా వస్తువులను మేమే డెలివరీ చేసుకుంటాం అంటూ ప్రకటించిన ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. భారత్‌లో స్వయం ప్రతిపత్తి సాధించేందుకు 'ఐ హ్యావ్ స్పేస్' (ఐహెచ్‌ఎస్) అనే డెలివరీ ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. ఇందులో భాగంగా స్థానికంగా ఉండే చిన్న వ్యాపారులను తమ వస్తువులను సరఫరా చేయటంలో భాగస్వాములుగా చేసుకుంటోంది. జనరల్‌స్టోర్ యజమానులు, కియోస్క్‌లు, మొబైల్ సర్వీసింగ్, రీఛార్జి సెంటర్లు, కిరాణా దుకాణ యజమానులు, కూరగాయల వ్యాపారులు ఇలా అందరినీ తన వ్యాపారంలో కలుపుకుంటూ పోతోంది.
ఐహెచ్‌ఎస్‌లో చేరటానికి ఏ విధమైన పెట్టుబడులు పెట్టనవసరం లేదని అమెజాన్ వివరించింది. ఇందులో స్థానిక దుకాణదారులు తమ దుకాణానికి రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్న అమెజాన్ వినియోగదారులకు ఉత్పత్తులను అందించాల్సి ఉంటుంది. ఇందుకుగాను ప్రతి డెలివరీకి నియమిత మొత్తాన్ని సంస్థ అందజేస్తుంది. సరాసరిన రోజుకు 20 నుంచి 30 ప్యాకేజీలను అందించటం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చని అమెజాన్ వివరించింది. అంతేకాకుండా వారి దుకాణాలను తమ పికప్ పాయింట్లుగా మార్చటం ద్వారా వారికి రెండింతల ప్రతిఫలం లభిస్తుందని అమెజాన్ అంటోంది.
ప్రస్తుతానికి మహానగరాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా వరంగల్, గుంటూరు, తిరుపూర్, బెలగామ్, రాయ్‌పూర్, అమృత్‌సర్, నాసిక్, డెహ్రాడూన్ వంటి 180 చిన్న పట్టణాలలో కూడా తమ ఐహెచ్‌ఎస్ భాగస్వాములున్నారని అమెజాన్ ప్రకటించింది. ఈ విధంగా తాము, వారు కూడా లాభపడే ఐహెచ్‌ఎస్ సరఫరా విధానాన్ని త్వరలో పల్లెలకు కూడా విస్తరించనున్నట్టు అమెజాన్ తెలిపింది.

0 Comments:
Post a Comment