స్పెక్ర్టమ్ చెల్లింపులు, లైసెన్స్ ఫీజుల బకాయిల విషయంలో కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోతే... దేశంలో మూడో పెద్ద మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ వొడాఫోన్-ఐడియా మూతపడుతుందని కంపెనీ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. కంపెనీ చెల్లించాల్సిన రూ 53,058 కోట్ల అప్పులపై కేంద్రం వెసులుబాటు కల్పించాలని ఆయన కొంతకాలంగా కోరుతున్నారు. అలా వెసులుబాట్లు కల్పించడం సరికాదన్న వాదన మరోవైపు నుంచీ వినిపిస్తోంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఎంటరయ్యాక... దాని పోటీని తట్టుకోలేక... 2018లో ఐడియా సెల్యులార్, బ్రిటన్ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఒకే కంపెనీగా విలీనమయ్యాయి. ఆ తర్వాత అప్పులు లెక్కలేస్తేమొత్తం కేంద్రానికి చెల్లించాల్సింది రూ 1.17 లక్షల కోట్లుగా తేలింది. భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, ఇతర టెలికం కంపెనీలు కలిసి టెలికాం లైసెన్స్ ఫీజు, స్పెక్ర్టమ్ యూసేజ్ చార్జీలు కలిపి 14 ఏళ్లుగా కేంద్రానికి రూ 1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ అప్పులపై చెల్లించాల్సిన వడ్డీ, ఇతర ఫైన్లను రద్దు చెయ్యాలని భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కోరుతున్నాయి. ఇలా కోరడం రూల్స్‌కి విరుద్ధమనే వాదన పోటీ కంపెనీల నుంచీ వినిపిస్తోంది.
కొన్నేళ్లుగా ఇండియాలో చాలా సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలు మూతపడ్డాయి. యూనినార్, ఎయిర్‌సెల్, డోకోమో, వీడియోకాన్, స్పైస్, వర్జిన్, రిలయన్స్ టెలికం, MTS ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడీ లిస్టులో వొడాఫోన్-ఐడియా కూడా చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ప్రభుత్వ రంగ సంస్థ BSNL/ MTNL, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మాత్రమే సర్వీసులు అందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 5జీ వస్తున్న సమయంలో... ఇండియాలో 5జీ తెచ్చేందుకు టెలికం సర్వీస్ ప్రొవైడర్లు సాహసం చెయ్యలేకపోతన్నారు. కారణం సర్వీసుల ధరలు, సరిపడా స్పెక్ట్రమ్ లేకపోవడం, కొత్త బ్యాండ్లు లేకపోవడం వంటి సమస్యలున్నాయి.

0 Comments:
Post a Comment