Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Saturday, 16 November 2019

Amma odi -అమ్మ ఒడి పూర్తి సమాచారం....

75% హాజరుంటేనే ‘అమ్మఒడి’*
పథకం కార్యాచరణ ప్రణాళిక వెల్లడి
తగ్గితే సహేతుక కారణం తప్పనిసరి..
ప్రధానోపాధ్యాయుల నిర్ణయమే ఫైనల్‌
ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లించేవారి పిల్లలకు కూడా అమ్మఒడి లేదు
పెన్షనర్ల పిల్లలకు పథకం వర్తించదు..
ప్రతి జిల్లాలోనూ 24 గంటల హెల్ప్‌లైన్లు
డిసెంబరు 24 నాటికి ప్రక్రియ పూర్తి.. పథకం కార్యాచరణ ప్రణాళిక వెల్లడి 


 రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్న ‘అమ్మఒడి’ పథకానికి సంబంధించి సోమవారం కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసింది. ఈ నెలాఖరు(నవంబరు) నాటికి విద్యార్థులకు 75% హాజరు ఉంటేనే ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని తెలిపింది. ఒకవేళ అంతకంటే తక్కువ హాజరు ఉంటే.. ప్రధానోపాధ్యాయులు నిశిత పరిశీలన చేసి, హాజరు తగ్గడానికి విద్యార్థి లోపం లేదని, పరిగణనలోనికి తీసుకోవచ్చని సిఫారసు చేస్తే పథకం వర్తింప జేస్తామని స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి పింఛను తీసుకుంటున్న మాజీ ఉద్యోగుల పిల్లలకు ‘అమ్మఒడి’ ఉండదని మార్గదర్శకాల్లో పేర్కొంది. రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, పెన్షనర్లు(పీఎ్‌స యూ, కేంద్రంతో సహా), ఆదాయపు పన్ను చెల్లింపుదారుల పిల్లలు ఈ పథకం కింద అర్హులు కాదని తెలిపింది. దారిద్య్ర రేఖకు దిగువ ఉండి(బీపీఎల్‌), తెల్లరేషన్‌ కార్డు, ఆధార్‌ కలిగిన వారు అమ్మఒడికి పూర్తి అర్హులని ప్ర భుత్వం వివరించింది. ఈ కార్యక్రమం కోసం డీఈవో కార్యాలయంలో 24 గంటల సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ ఆదేశించారు. కాగా, ‘అమ్మఒడి’ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 13 జిల్లాలకూ పర్యవేక్షకులను నియమించారు.


అమ్మ ఒడి కి సంబంధించిన అన్ని అప్డేట్స్.....కోసం..*అందరు ప్రధానోపాధ్యాయులకు ఒక అత్యవసర సూచన*

*రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న అమ్మ ఒడి పథకం అమలు పరచుటకు కావలసిన students సమాచారము చైల్డ్ ఇన్ఫో డేటా ను ప్రామాణికంగా  తీసుకొను చున్నారు కావున అందరూ HM లు ఈ విషయమై తగు జాగ్రత్త వహించి చైల్డ్ ఇన్ఫో లో ఉన్న స్టూడెంట్ వివరములను మరియొక సారి సరి చూసుకుని తేదీ 18-11-2019 సోమవారం సాయంత్రానికి చైల్డ్ ఇన్ఫో లో తేడాలు ఏమైనా ఉన్న ఎడల సరి చేయవలసిందిగా  కోరడమైనది ఒకవేళ ఎవరైనా విద్యార్థి School రోల్స్ ఉండి చైల్డ్ ఇన్ఫో లో లేని ఎడల వారికి అమ్మ ఒడి వర్తించదు కావున  HM లు మరియు MEO లు ఈ విషయమై తగు జాగ్రత్త వహించి సత్వరమే చైల్డ్ ఇన్ఫో డేటాను ప్రస్తుతం స్టూడెంట్ డేటాతో  సరిపోల్చ వలసిందిగా  గౌరవ ఎస్ పి డి, సమగ్ర శిక్ష వారు ఆదేశించారు. ఈ ఆదేశములు పాటించని HM ల పై క్రమశిక్షణ చర్యలు తీసుకొనబడును

SPD & CSE, AP

All primary ,upper primary and high school headmasters(all types of state govt ,central govt ,mpp,zip,mpl pvt aided pvt unaided tribal welfare social Welfare KGBV ap residential schools)are instructed to follow the guidelines strictly
*ఈరోజు జరిగిన వీడియో కాన్ఫెరెన్సులో తెలిపిన విషయాలు*

1.అమ్మ ఒడి పథకం జనవరి 9,2020 న మన CM గారు ప్రారంభించెదరు.అదే రోజు తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ అగును.
2.ఇందుకు కావాల్సిన పత్రాలు
తల్లి ఆధారకార్డు
బ్యాంక్ ఖాతా
IFSC code

3. పిల్లలు చేరినదగ్గరనుండి 31.12.2019 నాటికి హాజరు 75%ఉండాలి.(CSWN వారికి ఇది వర్తించదు)

4.ఒకవేళ 75% హాజరులేనిచో ఆ పిల్లల తల్లిదండ్రులకు,PMC సభ్యులకు సమాచారం ఇవ్వాలి.అలా హాజరు లేనిచో డబ్బులు రావని తెలపాలి*

5.ఏపిల్లవానికైనా రేషన్ కార్డులేకపోతే 6 steps proform పూర్తి చేసి HM కు ఇచ్చినచో దాన్ని గ్రామ వాలంటీర్ సర్వే చేసి BPL కుటుంబమని నిర్ధారణ చేస్తారు.

6 💐 పాఠశాలల్లో భౌతికంగా లేకుండా child info లో పేరు ఉంటే వెంటనే వారి పేర్లను drop box లో చేర్చాలి.💐

7. 💐 బడికి వస్తూ ఇంకా చైల్డ్ info లో పేర్లు లేకపోతే నవంబర్ 17,18,19,తేదీ లోపల update చేయించాలి.19 వతేది సాయంత్రం site మూసివేయబడును.💐

8.  💐 20 వ తేదీనుండి ap Cfms site కు పిల్లల data మొత్తం బదిలీ అవుతుంది.💐

9. consolidated data site నుండి సేకరించి 25 నుండి 30 మధ్యలో గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తారు.💐

10. డిసెంబర్ 1 న provisional list తయారుచేసి,దాని ప్రకారమే అమ్మ ఒడి డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడతాయి.💐

పైన తెలిపిన యావత్తు కార్యక్రమం HMsపర్యవేక్షణలోPMC సభ్యులు,గ్రామవాలంటీర్ లతో కలసి నిర్వహించాలి. అర్హతలు కలిగిన పిల్లలు ఎవరూ అమ్మ ఒడి పథకం కోల్పోకూడదు

💐💐 ఇది CM గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం.
కాబట్టి అందరూ HMs, ఉపాధ్యాయులు సమిష్టిగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడమైనది.

DEO office


Download..... Rc.252 ,Guidelines and profarmas on Amma odi.

అమ్మ ఒడి PPT by CSEAP.. డౌన్లోడ్

అమ్మ ఒడి - HM ధ్రువీకరణ పత్రం...

Proforma -1 Application

Proforma-2 Application

Proforma -3 Application

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top