ప్రతి స్కూల్ లో ఇంగ్లీష్ మీడియం.... తెలుగు, ఉర్దూ బాషల సబ్జెక్టులు తప్పనిసరి - సీఎం జగన్...
➡ ప్రతి పేదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదివించాల్సిన అవసరం ఉందన్నారు.
➡దేశమంతటా నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటామని చెప్పారు. 2008లో దివంగత నేత వైఎస్ఆర్ మైనారిటీ వెల్ఫేర్ గా ప్రకటించి జాతీయవిద్యా దినోత్సవ ఉత్సవాలు, మైనారిటీ ఉత్సవాలను ఒకే రోజు జరుపుకుంటామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
➡2011 జనభా లెక్కల ప్రకారం ఏపీలో చదువురాని వారి సంఖ్య 33%, దేశంలో చూస్తే 27%గా ఉందని సీఎం తెలిపారు. అందరూ కూడ చదువుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు.
➡ప్రపంచంలో పోటీతత్వం బాగా పెరిగిందన్నారు. పేద పిల్లలు ప్రపంచంతో పోటీపడాలంటే ఇంగ్లీషు తప్పనిసరిగా వచ్చుండాల్సిన అవసరం ఉందని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.
➡ఇంగ్లీషు రాకపోతే మన పిల్లలు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పారు. ఏపీలో 45 వేల స్లూళ్లు ఉన్నాయి. 15 వేల స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా మార్లు తీసుకొస్తాం, తర్వాత మిగిలిన స్కూళ్లో కూడా అమలు చేస్తామన్నారు.
➡ప్రతి స్కూల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టి తెలుగు, ఉర్దూ భాషలో తప్పని సరిగా చదివే సబ్జెక్టులు ఉంచుతామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. 1వ తరగతి నుండి 6వ తరగత వరకు ఇంగ్లీషు తప్పనిసరిగా ప్రవేశపెడతామని జగన్ స్పష్టం చేశారు. ఆ తర్వాత 7వ తరగతి నుంచి ఇంగ్లీషు ఉంటుందన్నారు.
➡త్వరలో డిగ్రీ స్థాయిలో అప్రెంటీస్ విధానాన్ని కూడ ను కూడా ప్రవేశపెడతామని జగన్ తేల్చి చెప్పారు. ఈ ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ఫీజ్ రీయంబర్స్ మెంట్ ప్రవేశపెడతామని సీఎం జగన్ తేల్చి చెప్పారు.
➡మన పిల్లలు గొప్పగా ఎదగాలని తాము అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. మదర్శాలకు మంచి జరిగేటట్లుగా మదర్శాబోర్డు ఏర్పాటుకు ఆదేశాలిస్తున్నట్టుగా వైఎస్ జగన్ ప్రకటించారు.
➡అమ్మ ఒడి పథకాన్ని మార్గదర్శకాలను అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి లో వైఎస్ఆర్ పెళ్లి కానుక అమలు చేస్తామన్నారు.
0 comments:
Post a comment