Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Monday, 7 October 2019

Zaheer Khan ( October 7,1978) Birthday: Former India Pacer -భారత పేస్‌ విభాగానికి అతడో దళపతి టీమిండియాకు వన్నె తెచ్చిన బౌలర్‌Zaheer Khan is an Indian former cricketer who played all forms of the game for the Indian national team from 2000 till 2014. He was the second-most successful Indian pace bowler in Test cricket, behind Kapil Dev. Khan started his domestic career by playing for Baroda.

భారత పేస్‌ విభాగానికి అతడో దళపతి
టీమిండియాకు వన్నె తెచ్చిన బౌలర్‌
ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌ని గడగడలాడించిన ఘనత‌ అతడిది. టీమిండియా పేస్‌ విభాగానికి దళపతి. ధోనీసేన 2011లో విశ్వవిజేతగా నిలిచినా, 2003లో గంగూలీ జట్టు ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరినా అతడి బౌలింగే కీలకం. నిప్పులు చెరిగే బంతులతో పర్‌ఫెక్ట్‌ యార్కర్లు సంధించే ఈ బౌలర్‌ ప్రపంచ క్రికెట్‌కు నకుల్‌ బాల్‌ వైవిధ్యం పరిచయం చేశాడు. టీమిండియా ఫాస్ట్‌ బౌలింగ్‌కే వన్నె తెచ్చిన లెఫ్ట్‌ఆర్మ్‌ సీమర్‌ భారత జట్టుకు 14 ఏళ్ల పాటు విశేషమైన సేవలు అందించాడు‌. గంగూలీ సారథ్యంలో టీమిండియా జెర్సీ ధరించి.. ధోనీ నాయకత్వం వరకూ కొనసాగాడు. నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన అతడే జహీర్‌ఖాన్‌. నేడు జహీర్‌ 41వ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం.
జహీర్‌ ప్రదర్శనతో 43 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ
1978 అక్టోబర్‌ 7న మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా శ్రీరామ్‌పూర్‌లో జన్మించిన జహీర్‌ఖాన్‌.. జాకియా, బక్తియార్‌ ఖాన్‌లకు రెండో కుమారుడు. అతడి బాల్యమంతా అక్కడే గడవగా స్థానిక రెవెన్యూ కాలనీ క్రికెట్‌ క్లబ్‌లో చిన్నప్పుడే క్రికెట్‌ ఆడటం నేర్చుకున్నాడు. అనంతరం పుణెలో శిక్షణ పొంది 1996లో ముంబయి జట్టు తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అక్కడ కంగా క్రికెట్‌ లీగ్‌, కామ్రేడ్‌ షీల్డ్‌, పురుషోత్తమ్‌ షీల్డ్‌ లాంటి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేయడంతో 1997లో చెన్నైలోని ఎంఆర్‌ఎఫ్‌ పేస్‌ ఫౌండేషన్‌కు చేరుకున్నాడు. అక్కడ బౌలింగ్‌ కోచ్‌ శేఖర్‌.. జహీర్‌ బౌలింగ్‌ సామర్థ్యాన్ని గ్రహించి బరోడా జట్టుకు పంపించాడు. అలా 2000-2001 సీజన్‌లో రంజీట్రోఫీ ఆడిన పేసర్‌ ఫైనల్లో చెలరేగి 145/8 ప్రదర్శనతో రైల్వేస్‌ జట్టుపై అద్భుత బౌలింగ్‌ చేశాడు. జహీర్‌ ప్రదర్శనతోనే బరోడా జట్టు 43 ఏళ్ల తర్వాత రంజీ కప్పు గెలిచింది.
టీమిండియాకు ప్రధాన బౌలర్‌గా..
జహీర్‌ 2000 సంవత్సరంలో బెంగళూరు జాతీయ క్రికెట్‌ అకాడమీకి ఎంపికవ్వగా అదే ఏడాది బంగ్లాదేశ్‌ జట్టుపై టెస్టు అరంగేట్రం చేశాడు. అనంతరం ఛాంపియన్స్‌ ట్రోఫీలో కెన్యాపై వన్డే అరంగేట్రం చేసి ఆ టోర్నీలో ఏడు వికెట్లు తీసి టీమిండియా ఫైనల్‌ చేరడానికి కృషిచేశాడు. ఆ టోర్నీ నుంచే పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడం జహీర్‌కు అలవాటుగా మారింది. అలా తన ఫాస్ట్‌ బౌలింగ్‌తో వన్డేల్లో మేటి బౌలర్‌గా పేరు తెచ్చుకొని వరుస టోర్నీల్లో రాణించాడు. అలాగే 2003 ప్రపంచకప్‌కు ఎంపికై భారత జట్టు ఫైనల్‌ చేరడంలో కీలకంగా మారాడు. ఆ టోర్నీలో మేటి బ్యాట్స్‌మెన్‌ని ఔట్‌ చేసి మొత్తం 18 వికెట్లు సాధించాడు. కొద్ది కాలం తర్వాత ఫామ్‌ కోల్పోయినా ముంబయి జట్టు తరఫున రంజీల్లో రాణించి తిరిగి 2007 ప్రపంచకప్‌కి ఎంపికయ్యాడు. అక్కడ భారత జట్టు విఫలమైన సంగతి తెలిసిందే. అనంతరం టీమిండియాకు ప్రధాన బౌలర్‌గా మారిన జహీర్‌ కెరీర్‌ నాలుగేళ్లపాటు సాఫీగా సాగింది. 2011 ప్రపంచకప్‌లో 21 వికెట్లు తీసి ధోనీసేనను ఫైనల్లో విజేతగా నిలిపాడు. జహీర్‌ మొత్తం 200 వన్డేల్లో 282 వికెట్లు తీయగా 92 టెస్టుల్లో 311 వికెట్లు పడగొట్టాడు.
నకుల్‌ బాల్‌ ప్రత్యేకత
అంతర్జాతీయ క్రికెట్‌లో నకుల్‌ బాల్‌ బౌలింగ్‌ ప్రవేశపెట్టింది జహీర్‌ఖానే. ఈ బౌలింగ్‌తోనే 2011 ప్రపంచకప్‌లో రాణించాడు. ఈ ప్రత్యేకమైన శైలిలో సంధించినప్పుడు బంతి గాల్లో అనూహ్యంగా కదిలి బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తుంది. ఈ విషయంపై జహీర్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2011 ప్రపంచకప్‌కు ఏడాది ముందు నుంచే ఈ బౌలింగ్‌ను ప్రాక్టీస్‌ చేశానని, ఆ పద్ధతిని ఎక్కడా వాడకుండా నేరుగా ప్రపంచకప్‌లో ఉపయోగించానని జహీర్‌ వివరించాడు. అది తనకు ఎంతో ఉపయోగపడిందని చెప్పాడు.
కెరీర్‌ ఆఖరి అంకం
2011 ప్రపంచకప్‌ తర్వాత జులైలో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన అతడు అక్కడ గాయం కారణంగా మధ్యలోనే తిరిగొచ్చాడు. ఆపై డిసెంబర్‌లో ఆసీస్‌పై ఆడిన టెస్టుల్లో ఫర్వాలేదనిపించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తర్వాత 2013లో దక్షిణాఫ్రికా పర్యటన, 2014లో న్యూజిలాండ్‌లో పర్యటనల్లోనూ జహీర్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే 2015 అక్టోబర్‌ 15న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అనంతరం 2017లో భారత క్రికెట్‌ జట్టుకు బౌలింగ్‌ మెంటార్‌గా నియమితుడయ్యాడు. 

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top