Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Friday, 1 November 2019

Vvs lakshman (1st Nov 1974 ) birth day special story - స్ట్రోక్‌ ప్లేలో కింగ్‌ మేకర్‌ , ఆసీస్‌ బౌలర్లకు చండశాసనుడు

Vangipurapu Venkata Sai Laxman born 1 November 1974), commonly known as VVS Laxman, is a former Indian cricketer and currently a cricket commentator. Laxman was a right-hand batsman known for his elegant strokeplay who played mostly in the middle order. He is known for his numerous match-winning and match-saving innings, and his special ability to consolidate unprecedented support from non-specialist tail-end batsmen to do this has accorded him a unique status among cricketing legends. Laxman performed outstandingly well against the best team of his time, Australia, and his knock of 281 against them in Eden Gardens in 2001 is often considered as the greatest ever test-innings. In 2011, Laxman was awarded the Padma Shri award, India's fourth highest civilian award.

భారత క్రికెట్‌ ప్రస్థానంలో సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తనకంటూ కొన్ని పేజీలను సువర్ణక్షరాలతో లిఖించుకున్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియాను తన స్ట్రోక్‌ ప్లేతో ఓటమి రుచిని చూపించాడు. ఓటమి కోరల్లో చిక్కుకున్న టీమ్‌ఇండియాను ఎన్నో సార్లు అద్భుతంగా పోరాడి విజయ తీరాలకు చేర్చాడు. ఇతర బ్యాట్స్‌మెన్‌ అంతా ఆసీస్‌ బౌలర్ల ముందు తడబడుతుంటే లక్ష్మణ్‌ మాత్రం సులువుగా వారిపై ఆధిపత్యం చెలాయించేవాడు. అందుకే వంగిపురపు వెంకటసాయి (వీవీఎస్‌) లక్ష్మణ్‌ను క్రికెట్‌ ప్రపంచమంతా వెరీ వెరీ స్పెషల్‌ లక్ష్మణ్‌గా పిలుచుకుంటుంది. అద్వితీయ పోరాటంతో భారత జట్టుకు ఎన్నో మధుర విజయాలు అందించిన ఈ హైదరాబాదీ బ్యాట్స్‌మన్‌ జన్మదినం నేడే. ఈ సందర్భంగా అతడు ఆడిన కొన్ని స్పెషల్‌ ఇన్నింగ్స్‌..
అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు!
వరుసగా 15 టెస్టుల్లో విజయం సాధించి ఎదురులేని జట్టుగా భారత పర్యటనకు ఆస్ట్రేలియా వచ్చింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ముంబయిలో జరిగిన తొలి టెస్టులో గెలిచి కోల్‌కతా టెస్టుకు సిద్ధమైంది. ఈడెన్‌గార్డెన్స్‌లో విజయం సాధించి సిరీస్‌ రేసులో నిలబడాలని గంగూలీసేన పట్టుదలతో రెండో టెస్టులో బరిలోకి దిగింది. స్టీవ్‌ వా (110), హెడెన్‌ (97) రాణించడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బరిలోకి దిగిన టీమ్ఇండియాను ఆసీస్‌ బౌలర్లు బెంబేలెత్తించారు. లక్ష్మణ్‌ (59) మినహా ఎవరూ రాణించకపోవడంతో భారత్‌ 171 పరుగులకే కుప్పకూలింది. ఐదో స్థానంలో బరిలోకి దిగిన లక్ష్మణ్‌ ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన ఆసీస్‌ గంగూలీ సేనను ఫాలోఆన్‌ ఆడించింది.

రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌ ఆదిలోనే తొలి వికెట్‌ కోల్పోయింది. ఇంకా రెండు రోజులకు పైగా ఆట ఉండటంతో.. ఆసీస్‌ బౌలర్లును నివారించి మ్యాచ్‌ను కాపాడుకోవాల్సిన పరిస్థితి భారత్‌కు తలెత్తింది. దీంతో జట్టు యాజమాన్యం ద్రవిడ్‌కు బదులుగా వన్‌డౌన్‌లో లక్ష్మణ్‌ను పంపించాలని నిర్ణయించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆఖరి వికెట్‌గా వెనుదిరిగినా లక్ష్మణ్‌ కనీసం కాళ్లకు ప్యాడ్‌ కూడా విప్పలేదు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. ఆసీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. దాస్ (39), సచిన్ (10) వెనుదిరిగినా గంగూలీ (48)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. దాదా ఔటైన తర్వాత ద్రవిడ్‌ (180)తో కలిసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆసీస్‌ బౌలర్లపై విజృంభించి ద్విశతకాన్ని బాదాడు. స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తూ ట్రిపుల్‌ శతకాన్ని అందుకునే దిశగా పయనించాడు. కానీ, మెక్‌గ్రాత్‌ బౌలింగ్‌లో ఔటవ్వడంతో 281 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. ద్రవిడ్‌, లక్ష్మణ్‌ అసాధారణమైన పోరాటంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను 629/7 భారీ స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం భారత్‌ బౌలర్లు చెలరేగడంతో ఆసీస్‌ 212 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమ్‌ఇండియా 171 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అప్పట్లో ఈ మ్యాచ్‌ సంచలనంగా మారింది. ఫాలోఆన్‌కు దిగిన గంగూలీ సేన బలమైన ఆసీస్‌పై గెలవడం సాధారణం విషయం కాదు. భారత్‌ సాధించిన అపూరమైన విజయానికి కారణం లక్ష్మణే. ఆఖరి టెస్టులోనూ టీమ్ఇండియా గెలిచి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
2010లో ఆస్ట్రేలియా మరోసారి భారత్ పర్యటనకు వచ్చింది. మొహాలి వేదికగా జరిగిన టెస్టులో ఆసీస్‌కు నిరాశే మిగిలింది. విజయం అందినట్లే అంది కంగారూలకు దూరమైంది. లక్ష్మణ్ మరోసారి అద్బుతంగా పోరాడటంతో ధోనీసేన వికెట్‌ తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 428 పరుగులు చేయగా, భారత్ 405 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా బౌలర్లు అదరగొట్టడంతో ఆసీస్‌ 192 పరుగులకే కుప్పకూలింది. లక్ష్యం 215 పరుగులే ఉండటంతో భారత్‌కు విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారంతా. కానీ, ఆసీస్‌ బౌలర్ల ధాటికి భారత వికెట్లు టపటప నేలకూలాయి. 124 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి ధోనీసేన పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక ఆసీస్‌కు విజయం ఖాయమని భావించారంతా. కానీ, ఇషాంత్‌ శర్మ (31)తో కలిసి లక్ష్మణ్ (73*) అద్వితీయంగా పోరాడాడు. తన స్ట్రోక్‌ ప్లేతో ఆసీస్‌ బౌలర్లను నిస్సహాయులను చేశాడు. సహచరులంతా పెవిలియన్‌కు చేరుతున్నా తన అనుభవంతో జట్టుకు విజయాన్ని అందించాడు.
సుదీర్ఘ ఫార్మాట్‌లో టీమ్‌ఇండియాకు ఎన్నో గొప్ప విజయాలు అందించిన లక్ష్మణ్‌ పరిమిత ఓవర్లలోనూ తన మార్క్‌ను చూపించాడు. 2004లో పాక్‌ పర్యటనకు వెళ్లిన గంగూలీ సేనను విజేతగా నిలిపాడు. నిర్ణయాత్మక పోరులో శతకం సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్-పాక్‌ చెరో రెండు మ్యాచులను గెలిచి 2-2తో సమంగా నిలిచాయి. ఆఖరి వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో లాహోర్‌ పోరుకు బరిలోకి దిగాయి. ఈ నిర్ణయాత్మక పోరులో లక్ష్మణ్‌ ముచ్చటైన షాట్లతో అలరిస్తూ మూడంకెల స్కోరుని అందుకున్నాడు. సహచరులంతా వెనుదిరుగుతున్నా స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 293 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు  253 పరుగులకే కుప్పకూలింది. లక్ష్మణ్‌ విలువైన శతకంతో పాక్‌ గడ్డపై భారత్ సిరీస్‌ను సొంతం చేసుకుంది.

16 ఏళ్ల తన క్రికెట్‌ కెరీర్‌లో లక్ష్మణ్ భారత్‌ తరఫున 134 టెస్టులు, 86 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 45.5 సగటుతో 8,781 పరుగులు చేశాడు. దీనిలో రెండు ద్వితకాలు, 17 శతకాలు, 56 అర్ధశతకాలు ఉన్నాయి. వన్డేల్లో 30.76 సగటుతో 2,338 పరుగులు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో రారాజు పేరుపొందిన ఈ స్టైలిష్‌ బ్యాట్స్‌మన్ భారత్ తరఫున ప్రపంచకప్‌కు ప్రాతినిధ్యం వహించలేకపోయాడు. అయినా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. సంచలన ఇన్నింగ్స్‌లు ఆడుతూ విదేశీ గడ్డపై భారత్‌ను ఎన్నోసార్లు విజేతగా నిలిపాడు. 2008 పెర్త్‌ టెస్టు, 2009 నేపియర్ టెస్టుల్లో అతడు గొప్పగా పోరాడాడు. సగటు భారత అభిమాని గర్వించగలిగేలా పోరాడిన లక్ష్మణ్‌  2012 ఆగస్టులో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top