Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Wednesday, 23 October 2019

The Kartarpur Corridor -కర్తార్‌పూర్‌ కారిడార్‌.. దశాబ్దాల స్వప్నం.. కర్తార్‌పూర్‌ కారిడార్ బాటలు పడ్డాయిలా

The Kartarpur Corridor is an under-construction border corridor between the neighbouring nations of India and Pakistan, connecting the Sikh shrines of Dera Baba Nanak Sahib (located in Punjab, India) and Gurdwara Darbar Sahib Kartarpur (in Punjab, Pakistan). Currently under planning, the corridor is intended to allow religious devotees from India to visit the Gurdwara in Kartarpur, 4.7 kilometres (2.9 miles) from the Pakistan-India border, without a visa.

The Kartarpur Corridor was first proposed in early 1999 by the prime ministers of India and Pakistan, Atal Bihari Vajpayee and Nawaz Sharif, respectively, as part of the Delhi–Lahore Bus diplomacy.

On 26 November 2018, the foundation stone for the Kartarpur corridor was laid down on the Indian side. Two days later, the foundation stone was laid down on the Pakistani side. The corridor will reportedly be completed before the 550th birth anniversary of Guru Nanak Dev in November 2019.

The prime minister of Pakistan, Imran Khan, compared the decision to go ahead with the corridor by the two countries to the fall of the Berlin Wall, saying that the project may help in easing tensions between the two countries.However, Indian Army chief Bipin Rawat said on 28 November 2018 that Kartarpur should be viewed in "isolation" and not linked to anything else, adding that it was a unilateral decision.

Currently pilgrims from India have to take a bus to Lahore to get to Kartarpur, which is a 125 km journey although people on the Indian side of the border can physically see Gurdwara Darbar Sahib Kartarpur on the Pakistani side. An elevated platform has also been constructed for the same on the Indian side, where people use binoculars to get a good view.కర్తార్‌పూర్‌ కారిడార్‌.. దశాబ్దాల స్వప్నం..
కర్తార్‌పూర్‌ కారిడార్ బాటలు పడ్డాయిలా

సిక్కు మత స్థాపకులు గురునానక్‌ 550వ జయంతి సమీపిస్తున్న వేళ కర్తార్‌పూర్‌ యాత్ర కోసం పాక్‌ వెళ్లేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సిక్కుల చిరకాల స్వప్నం కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం ప్రాధాన్యత సంచరించుకుంది. ఎందుకంటే ఓ వైపు భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్తత పరిణామాలు కొనసాగుతుండగా, మరోవైపు ఈ రెండు దేశాలే కలిసి ఈ ప్రాజెక్టును సంయుక్తంగా నిర్మించడం విశేషం. రెండు దేశాల మధ్య వారధిగా ఉండబోయే ఈ కారిడార్‌ ప్రారంభోత్సవం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ కర్తార్‌పూర్‌ మందిరం ప్రత్యేకత ఏమిటి, అది పాక్‌లో ఎందుకు ఉంది, ఆ నడవా నిర్మాణం విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్తార్‌పూర్‌ మందిరం విశిష్టత
రావి నది ఒడ్డున ఉన్న ఈ కర్తార్‌పూర్‌ మందిరాన్ని సిక్కులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఎందుకంటే 1469లో జన్మించిన సిక్కుమత స్థాపకుడైన గురునానక్‌ దేవ్‌ తన జీవితంలో చివరి 18 సంవత్సరాలు ఇక్కడే జీవితం గడిపారని  మత గ్రంథాల ద్వారా తెలుస్తోంది.  కానీ భారత్‌ను రెండుగా విభజించినపుడు ఈ ప్రాంతం పాకిస్థాన్‌ భూభాగంలోకి వెళ్లిపోయింది. దీంతో సిక్కులు తమ పవిత్ర క్షేత్రంగా భావించే ఈ మందిరం దర్శనం కోసం పాక్‌కు వెళ్లడానికి అవస్థలు పడాల్సి వస్తోంది. గురుదాస్‌పూర్‌ జిల్లా సరిహద్దు నుంచి పాక్‌లోని ఈ మందిరం కనిపిస్తుంది. అయితే వెళ్లాలంటే లాహోర్‌కు వెళ్లి అక్కడ నుంచి తిరిగి కర్తార్‌పూర్‌కు రావాల్సిఉంది.  దీంతో ఈ నడవాను నిర్మించాలని సిక్కులు అనేక సంవత్సరాలుగా కోరుతున్నారు.  ఈ కారిడార్‌ పాక్‌లోని దర్బార్‌ సాహిబ్‌ ఆలయం నుంచి పంజాబ్‌లోని డేరాబాబా నానక్‌ మందిరాన్ని కలుపుతుంది.

వాజ్‌పేయి నుంచి మోదీ వరకు 
1999లో అప్పటి భారత ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి  లాహోర్‌ సందర్శనకు వెళ్లినపుడు ఈ కారిడార్‌ నిర్మాణానికి సూచనలు చేశారు. కానీ అది అప్పుడు అమలుకు నోచుకోలేదు. అప్పటి నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడా అని ఈ ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం చివరి దశలో దీనికి అనూహ్యంగా పచ్చజెండా ఊపి వారి కలకు బాటలు పరిచింది. గతేడాది పంజాబ్‌ మంత్రి నవజోత్‌సింగ్‌ సిద్దూ పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ ప్రమాణస్వీకారానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన పాక్‌ ఆర్మీ చీఫ్‌ జావెద్ బజ్వాను హత్తుకున్నారు. దీనిపై భారత్‌లో పెద్ద వివాదం రాజుకుంది. దీంతో సిద్దూ దానికి వివరణ ఇస్తూ పాకిస్థాన్‌ కర్తార్‌పూర్‌ కారిడార్‌ నిర్మాణానికి మద్దతు పలికినట్లు ఆయన చెప్పారు అందుకే సంతోషంతో కౌగిలించుకున్నా అని చెప్పడంతో కారిడార్‌ విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ ఈ కారిడార్‌కు గత సంవత్సరం నవంబర్‌ 22న అంగీకారం తెలిపింది. గురునానక్‌ జయంతికి సిక్కులకు ఈ కారిడార్‌ను కానుకగా ఇవ్వాలని కోరుతూ భారత్‌ పాక్‌ను కోరగా సానుకూలంగా స్పందించింది. అంతేకాకుండా వెంటనే నిర్మాణానికి కూడా చర్యలు వేగవంతం చేసి శంకుస్థాపన చేశారు. అలా రెండు దేశాల మధ్య సంయుక్తంగా ప్రారంభమైన ఆ ప్రాజెక్టు ఇప్పుడు తుది దశకు చేరుకుంది. దీని నిర్మాణంతో దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న సిక్కుల కల నెరవేరబోతోంది.
ప్రారంభోత్సవం ఎలా
భారత్‌లో ఈ కారిడార్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నట్లు సమాచారం. పాకిస్థాన్‌ కూడా దీని ప్రారంభోత్సవానికి ఇప్పటికే మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించింది. అనంతరం ఆ దేశ విదేశాంగ మంత్రి ఖురేషీ తమ ఆహ్వానాన్ని మన్మోహన్‌ సింగ్‌ అంగీకరించినట్లు  చెప్పారు. అయితే  పాక్‌ ఆహ్వానాన్ని మన్మోహన్‌ అంగీకరించలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి. మన్మోహన్‌ తొలి విడత భక్తులతో కలిసి నవంబర్‌ 9న సాధారణ భక్తుడిలాగే కర్తార్‌పూర్‌కు వెళ్తారని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.
అదే రోజు తిరుగు ప్రయాణం
సిక్కుల  దర్బార్‌ సాహిబ్‌ యాత్రకు భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మరిన్ని భద్రతా పరమైన చర్యలను తీసుకుంటోంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. వెళ్లాలనుకునే భక్తులు నెల ముందే ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. కర్తార్‌పూర్‌ దర్శనానికి వెళ్లే భక్తులు దర్శనం అనంతరం అదే రోజు తిరిగి రావల్సి ఉంటుందని పేర్కొంది. బృందాల వారీగా దర్శనానికి అనుమతి ఇస్తూ ప్రతి బృందానికి అధికారుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. ప్రయాణంలో ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ల్యాండ్‌పోర్ట్‌ అథారిటీ ఛైర్మన్‌ గోవింద్‌ తెలిపారు.

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top