Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Saturday, 26 October 2019

Tamilnadu- Theni District తమిళనాడులోని పశ్చిమ కనుమల్లో ఉన్న జిల్లా తేని. విహారయాత్రకు అనువైన ప్రదేశం...సురులి జలపాతం..మేఘమలై హిల్స్..బొడిమెట్టు..కుచానూర్

Theni District is a district of Tamil Nadu state in South India.Theni district is Located beside Madurai. The town of Theni is the district headquarters. The district is divided into two natural divisions: The hilly areas are constituted by parts of the Five taluk's Theni, Periyakulam, Uthamapalayam, Usilampatti and Andipatti with thick vegetation and perennial streams from the hills on the western side and Cumbum valley which lies in Uthamapalayam taluk. As of 2011, Theni district had a population of 1,245,899 with a sex-ratio of 980 females for every 1,000 males.

తమిళనాడులోని పశ్చిమ కనుమల్లో ఉన్న జిల్లా తేని. కుటుంబ సమేతంగా విహారయాత్రకు ప్రణాళిక వేసుకునేవారికి ఇది అనువైన ప్రదేశం. ఈ జిల్లాలో పెరియకులం, ఉతమపలయం, అప్పిపత్తి లాంటి ప్రదేశాలు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అప్పిపత్తి ప్రాంతం హస్త కళా వస్తువులకు, చేనేతలకు ప్రసిద్ధి చెందింది. చక్కని సిల్క్‌ కాటన్‌, సుగంధాల యాలకులు, తాజా కాఫీ గింజలు, గ్రీన్‌ టీ కోరుకునేవారు ఈ ప్రదేశాన్ని సందర్శించాల్సిందే! అలాగే నిండుకుండలను తలపించే రిజర్వాయర్లు, పురాతన ఆలయాలు, పరవళ్లు తొక్కే జలపాతాలు ఎన్నో ఉన్నాయి.
సురులి జలపాతం 
తేనికి 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న సురలి జలపాతాలు రెండు పాయలుగా ప్రవహిస్తాయి.
40 అడుగుల ఎత్తు నుంచి కిందకు జాలువారుతాయి. ఆ నీరు ఒక మడుగులో పడి, అక్కడ నుంచి తిరిగి 110 అడుగులు కిందకు ప్రవహిస్తుంది. సురులి ఫాల్స్‌ మేఘమాలిలో పుడతాయి. ఇక్కడి రాతి గుహలు సందర్శకులను ఆకర్షిస్తాయి. ఇవి 18వ శతాబ్దానికి చెందినవి. తమిళ కవి ఇలంగో అడిగాల్‌ ఓ గ్రంథంలో ఇక్కడి జలపాతాల గురించి అందంగా వర్ణించాడు. ఈ జలపాతాల వద్ద అనేక ఔషధ వన మూలికలు దొరుకుతాయి. వాటర్‌ఫాల్స్‌ నుంచి ఐదువందల మీటర్ల దూరంలో సురులి వేలప్పర్‌ ఆలయం ఉంటుంది. ఏటా ఇక్కడ వేసవి ఫెస్టివల్‌ జరుగుతుంది. దీనిని తమిళనాడు టూరిజం శాఖ నిర్వహిస్తోంది. వర్షాకాలంలో ఈ జలపాతాలు పర్యాటకులతో ఆహ్లాదంగా మారిపోతుంది. ఇక్కడ స్నానపు గదుల సౌకర్యాలు కూడా ఉంది.
కుచానూర్‌
కుచానూర్‌లో వాడగురు ఆలయం ఉత్తరం వైపు తిరిగి ఉంటుంది. ఇది చాలా పురాతనమైనది. ఇక్కడే హనుమాన్‌, పంచముఖ గణపతి ఆలయాలూ ఉన్నాయి. సురభి నదీ పాయ కుచనుర్‌ గ్రామంలో నుంచి ప్రవహించడం ఇక్కడి విశేషం. సాని దేవాలయం ఈ నది ఒడ్డునే ఉంది. తేేనికి కుచానూర్‌ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.
బోడిమెట్టు
తేని జిల్లాలో బోడిమెట్టు ఓ చక్కని హిల్‌ స్టేషన్‌. సముద్ర మట్టానికి 4,500 అడుగుల ఎత్తులో ఉంది. విశ్రాంతి కోసం పర్యాటకులు ఈ హిల్‌ స్టేషన్‌కు వస్తుంటారు. ఇక్కడ జంతు, వృక్ష సంపద ఎంతగానో ఆహ్లాదపరుస్తుంది. అలాగే, అరుదైన పక్షులనూ చూడొచ్చు. ఈ ప్రదేశం తేనికి 43 కిలోమీటర్ల దూరంలో బోదినాయక నూర్‌ వెళ్ళే మార్గంలో ఉంది. తేని జిల్లాలోని అప్పిపత్తి, వేల్లయమపురం, పుసరి కౌన్దన్‌ పట్టి, ఓడయపత్తి, సేపలకొట్టాయి, సుక్కంగల్‌ పట్టి ప్రదేశాలు ఇక్కడి డ్యాం నీటితో లబ్ది పొందుతున్న ప్రదేశాలు. డ్యాం నుంచి కిలోమీటరు దూరంలో శంముగా టెంపుల్‌ ఉంది. దీనిలో మురుగా రాతి విగ్రహం ఉంటుంది.
మేఘమలై హిల్స్‌ 
పడమటి కనుమల్లో తేనికి 70 కిలోమీటర్ల దూరంలో మేఘమలై హిల్స్‌ ఉన్నాయి. సముద్ర మట్టానికి ఇవి 500 అడుగుల ఎత్తులో ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ ప్రదేశంలోనూ సహజ వృక్ష, జంతు సంపద మనసును కట్టిపడేస్తాయి. సుమారు వంద రకాల పక్షులు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడి జీవ వైవిధ్యం పరిరక్షించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఓ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురి ఏర్పాటు చేస్తోంది. మేఘమలై హిల్స్‌ అనేక జంతువులకు, సరీసృపాలకు, పక్షులకు నిలయం. ఇక్కడ చిరుతలు, పులులు, అడవి ఎలుగులు, నీలగిరి తార, ముండ్ల పంది, ఉడుతలు, లేళ్లు, జింకలు వంటివి ఎన్నో చూడొచ్చు. లవంగాలు, మిరియాలు ఇక్కడ సాగు చేస్తారు. ఈ ప్రదేశంలోనే మేఘమాలి ఫాల్స్‌, సురులి ఫాల్స్‌ పుడతాయి. తేనిలో సంవత్సరంలో ఎప్పుడైనా పర్యటించవచ్చు. ఈ ప్రాంతానికి రైలు, రోడ్డు మార్గాల ద్వారా తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల నుంచి చేరవచ్చు. మధురైలో సమీప విమానాశ్రయం ఉంది.

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top