నడక లో వేగం తోనే లాభం....వివరాలు
అసలే నడవకుండా ఎవరుంటారు? ఏదో ఒక అవసరానికి అటో ఇటో, ఎంతో కొంత నడుస్తూనే ఉంటారు. కాకపోతే, వేగంగా నడవడానికీ, నిదానంగా నడవడానికీ మధ్య చాలా తేడా ఉందంటున్నారు పరిశోధకులు. నిదానంగా ఏదో విహారంగా నడిస్తే, మనసుకు కాస్త ఉల్లాసంగానైతే ఉంటుంది గానీ, దాని ప్రభావం శరీర అంతర్భాగాల పైన పడే అవకాశం చాలా తక్కువ. సాధారణంగా శ్వాస వేగాన్ని పెంచే స్థాయి వ్యాయామాలే గుండెను గానీ, ఇతర అవయవాలను గానీ, ఉత్తేజపరుస్తాయి. మయో క్లినిక్ ప్రొసీడింగ్స్ పేరిట బ్రిటిష్ అధ్యయనకారులు ఇటీవల ప్రచురించిన పరిశోధనా పత్రాలు ఈ విషయాన్నే వెల్లడించాయి.
More Health tips... మరింత ఆరోగ్య సమాచారం కోసం...New
సహజంగానే శరీరం చలనశీలమైనది. తాము చేఏ ఉద్యోగ వ్యాపారాల తత్వం వల్ల గానీ, కదలకుండా కూర్చునే పనుల్లోనే సుఖం ఉందని అనుకోవడం వల్ల గానీ, కొందరు చాలా నిశ్చలంగా జీవితాలను గడిపేస్తుంటారు. ఒకవేళ కాళ్లు మరీ బరువెక్కినట్లు అనిపిస్తే, ఆ మూలనుంచి ఈ మూలకు అలా నాలుగు అడుగులు వేస్తారు. అయితే, ఇలా చాలా త క్కువగా, అతి తక్కువ వేగంతో నడిచే వారి ఆయుష్షు బాగా తగ్గిపోతున్నట్లు వారి పరిశోధనలో వెల్లడయింది. ముఖ్యంగా, ఈ తరహా స్లో వాకర్స్ జీవిత కాలం 72 ఏళ్లకు మించడం లేదని, అయితే ఫాస్ట్ వాకర్స్ జీవితకాలం మాత్రం 87ఏళ్ల దాకా ఉంటోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకు కారణం, ఫాస్ట్ వాకింగ్‌లో గుండె, శ్వాసకోస వ్యవస్థ బలంగానూ, ఆరోగ్యవంతంగా మారడమేనని వారు స్పష్టం చేస్తున్నారు. జిమ్‌కు వెళ్లడం, యోగా, ప్రాణాయామాలు చేయడం సాధ్యం కాకపోతే, క్రమం తప్పక తక్కువ దూరాలు కాస్త వేగంగా నడిస్తే సరిపోతుంది.
More Health tips... మరింత ఆరోగ్య సమాచారం కోసం...New
Also... Read.....
0 Comments:
Post a Comment