Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Sunday, 8 September 2019

Ram Jethmalani -ప్రముఖ న్యాయవాది రామ్‌ జఠ్మలానీ కన్నుమూత

Ram Jethmalani, eminent lawyer and former Union law minister, passes away


NEW DELHI: Eminent lawyer and former Union law minister Ram Jethmalani passed away early on Sunday morning. He was 95.
Jethmalani had been on round the clock medical help Ram Jethmalani: In black and white for last two weeks. He is survived by his son, noted lawyer Mahesh Jethmalani, and a US-based daughter. His other daughter Rani Jethmalani had pre-deceased him.
Born in Sikharpur of Sindh province on September 14, 1923, Ram Boolchand Jethmalani signed his name in bold letters in the legal field by arguing numerous landmark cases in Supreme Court, HCs and trial courts.

న్యూదిల్లీ: ప్రముఖ న్యాయవాది రామ్‌ జెఠ్మలానీ(95) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం దిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన గతంలో కేంద్ర మంత్రిగా, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా పనిచేశారు.ఎన్నో కీలక కేసులను ఈయన డీల్ చేశారు. అరుణ్‌ జైట్లీ-కేజ్రీవాల్‌ పరువు నష్టం కేసులో కేజ్రీవాల్‌ తరఫున వాదించారు. సుప్రీంలో ఎన్నో వివాదాస్పద కేసులనూ ఈయన వాదించారు. వాజ్‌పేయీ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. దేశంలో పేరెన్నిక గల న్యాయవాదుల్లో ఒకరైన జెఠ్మలానీ.. 1923 సెప్టెంబరు 14న ముంబయిలో జన్మించారు. ఈయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడు దశాబ్దాల పాటు ఆయన న్యాయవాద వృత్తిలో కొనసాగారు.

ప్రస్తుత పాకిస్థాన్‌లోని సింధు ప్రావిన్సుల్లోని సిఖార్‌పూర్‌లో 1923 సెప్టెంబరు 14న రామ్ జెఠ్మలానీ జన్మించారు. ఆయన అసలు పేరు రామ్ బూల్‌చంద్ జెఠ్మలానీ. ఆయన కుమారుడు మహేశ్ జఠ్మలానీ కూడా ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. కాగా, సుప్రీంకోర్టు, పలు రాష్ట్రాల హైకోర్టులు, దిగువ కోర్టుల్లోని కీలకమైన కేసులను విజయవంతంగా వాదించారు. ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన తొలి కేసు 1959 నాటి కేఎం నానావతి Vs మహారాష్ట్ర ప్రభుత్వం కేసు.
ఈ కేసుతో రామ్ జెఠ్మలానీ పేరు మారుమోగిపోయింది. అప్పటి నుంచి ఆయన విజయాల పరంపర కొనసాగింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడి తరఫున 2011లో మద్రాసు హైకోర్టులో వాదనలు వినిపించారు. స్టాక్ మార్కెట్ కుంభకోణం కేసులో హర్షద్ మెహతా, కేతన్ ఫరేఖ్‌‌ల తరఫున, పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడు ఆఫ్జల్ గురు మరశిక్ష కేసు, జెస్సికా లాల్ హత్యకేసులో మను శర్మ ప్రతినిధిగా వాదించారు. అరుణ్‌ జైట్లీ-కేజ్రీవాల్‌ పరువు నష్టం కేసులో కేజ్రీవాల్‌ తరఫున వాదించారు. 2010లో సుప్రీంకోర్టు బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయయారు.
అటు రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు. తొలిసారిగా ముంబై పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ తరఫున 6వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. రెండోసారి ఇక్కడ నుంచే 1980 ఎన్నికల్లో విజయం సాధించారు. అలాగే వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర న్యాయశాఖ, పట్టాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత బీజేపీతో విబేధించి పార్టీ వీడి, 2004 ఎన్నికల్లో లక్నో పార్లమెంటు స్థానం నుంచి వాజ్‌పేయి ప్రత్యర్థిగా పోటీచేశారు. తిరిగి 2010లో బీజేపీలో చేరిన ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017 నవంబరులో న్యాయవాది వృత్తి నుంచి తప్పుకున్నారు.

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top