Million Tons Of Gold Treasure Is Hidden In Sonbhandar Caves
ఆ గుహల్లో వేలాది టన్నుల బంగారం!!
దేశంలోని అనేక ప్రాంతాల్లో అంతుచిక్కని వందలాది రహస్యాలు ఉన్నాయి. వాటిలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన హర్యంక వంశస్థుడు బింబిసారుడు విలువైన సంపదలను రహస్యంగా భద్రపరిచాడు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో అంతుచిక్కని వందలాది రహస్యాలు ఉన్నాయి. వీటిలో బీహార్ రాష్ట్రం రాజ్‌గిరి నగరంలోని సోన్ భండార్ గుహల్లో దాచిన నిధి రహస్యం కూడా ఒకటి. ఈ గుహల్లోని సంపద కేరళ అనంతపద్మనాభ ఆలయంలోని బయటపడ్డ నిధి కన్నా అనేక రెట్లు అధికం. విలువైన నిధి నిక్షేపాలు గురించి ఆ గుహలోని శాసనాలు తెలియజేస్తున్నాయి. ఈ సంపదను సొంతం చేసుకోవాలని కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎంతో మంది చక్రవర్తులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. బ్రిటీష్ పాలకులు సైతం ఈ నిధిని దోచుకోడానికి సర్వశక్తులా ప్రయత్నంచారు. వారి ప్రయత్నం కూడా బూడిదలో పోసిన పన్నీరు అయింది.
దాదాపు 100 ఏళ్లుగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయన చేస్తున్నారు. నేటి ప్రభుత్వాలు, కొంతమంది ఔత్సాహికులు తమ వంతు కృషి చేస్తున్నారు. అయితే ఫలితం మాత్రం శూన్యం. అంతుచిక్కని రహస్య నిధి ఈ గుహలోకి ఎలా వచ్చింది? ఈ నిధి రహస్యాన్ని చేధించే మార్గం ఏంటి?
బింబిసారుడికి వయసు పైబడటంతో మగధ సింహాసనం కోసం అతడి కుమారుల మధ్య పోరు మొదలవుతుంది. వీరిలో అజాతశత్రువు తన తండ్రి బింబిసారుని సోన్ భండార్ గుహల్లో బంధించి సింహాసనాన్ని అధిష్ఠించాడు. అజాతశత్రువు ఇలాంటి దురాగతాలకు పాల్పడతాడని ముందే ఊహించిన బింబిసారుడు తన విలువైన సంపాదలను ఈ గుహలో దాచిపెట్టాడు. అయితే లోనికి ప్రవేశించే మార్గం చెప్పమంటూ తల్లిదండ్రులకు కనీసం వారికి ఆహారం కూడా పెట్టకుండా చిత్రహింసలకు గురిచేస్తారు. ఆ నిధి రహస్యాన్ని ఛేదించాలని అజాతశత్రువు శత విధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
కొన్నాళ్లకు బింబిసారుడు మరణించడంతో అజాతశత్రువుకు పిచ్చివాడిగా మారితే బౌద్ధ గురువులు అతడి పిచ్చిని నయం చేశారు. బౌద్ధమత బోధనల ప్రభావంతో అహింస మార్గంలో పయనించిన అజాతశత్రువు ఆ నిధి గురించి పట్టించుకోవటం మానేశాడు. అయితే బింబిసారుడు మరణించే ముందు ఈ గుహ రహస్యాన్ని అర్థం కాని లిపిలో ఇందులోనే చెక్కించాడు. ఆ లిపిని అర్థంచేసుకుని నిధి చేజిక్కించుకోడానికి 2500 ఏళ్ల నుంచి ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఫలితం మాత్రం శూన్యం.
బ్రిటీష్ అధికారులు సైతం ఫిరంగుల ద్వారా ఆ గుహ ద్వారాలను పగులగొట్టడానికి ప్రయత్నించినట్లు గుర్తులు నేటికీ సాక్ష్యంగా ఉన్నాయి. ఒక పెద్ద రాతి బండలో తొలచిన ఈ గుహలోకి ప్రవేశించగానే 10.4మీ పొడవు, 5.2మీ ల వెడల్పుతో,1.5మీ ల ఎత్తు గల ఒక గది కనిపిస్తుంది. ఈ గదిలో ఖజానాను రక్షించే సైనికులు కోసం నిర్మించారు.ఈ గది వెనుక వైపు నుంచి ఖజానాకు దారి ఉంది. దీన్ని పెద్ద రాతి బండతో తయారు చేసిన తలుపుతో మూసివేశారు. వీటిని నేటికీ ఎవ్వరూ తెరవలేకపోయారు. గదిలో ఒక గోడ మీద అర్థంకాని లిపిలో కొన్ని పదాలు రాశారు. వాటిని చదివి అవగాహన చేసుకుంటే వేల కోట్ల విలువైన సంపద సొంతమవుతుంది.
YOU TUBE VIDEO.....
Also Read.....
0 Comments:
Post a Comment