Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Friday, 27 September 2019

మహాలయ పక్షం అంటే ఏమిటి? మహాలయ అమావాస్య ఎప్పుడొస్తుంది?..పితృదేవతల ప్రీతి మహాలయ అమావాస్య.... 2019 సంవత్సరంలో మహాలయ అమావాస్య సెప్టెంబరు 28 శనివారం నాడు వచ్చింది.

Mahalaya Amavasya -Time for Honoring Ancestors
మహాలయ పక్షం అంటే ఏమిటి? మహాలయ అమావాస్య ఎప్పుడొస్తుంది?..పితృదేవతల ప్రీతి మహాలయ అమావాస్య....
2019 సంవత్సరంలో మహాలయ అమావాస్య సెప్టెంబరు 28 శనివారం నాడు వచ్చింది.


ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి, మీ పితృదేవతలను స్మరించి, వారికి నమస్కారము చేస్తూ, ” నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి, మీ దీవెనలు అందచేయండి’ అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు.

భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో, బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.

తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య  నైనా చేసి తీరాలి.

దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.

ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.

స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.

కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.

ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

పితృదేవతల ప్రీతి మహాలయ అమావాస్య

మహాలయ పక్షం ప్రారంభమయ్యాక 15వ రోజున వచ్చే బాద్రపద బహుళ (లేక కృష్ణ) అమావాస్యే మహాలయ అమావాస్య. శుద్ధ పూర్ణిమనుండి వరుసగా పదిహేను రోజులు పితృపక్షం అంటారు. ఈరోజు నుండీ వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలకు పూజ చేయాలని పెద్దల మాట. పితృ దోషం అంటే ఒక శాపంగా భావిస్తాం. ఏ వ్యక్తికైనా అనారోగ్యమో లేదా మరే తీరని కష్టాలో కలగడం జరిగితే దానికి కారణం అతడి పూర్వీకులు అంటే ఆ వ్యక్తియొక్క తల్లిదండ్రులు లేదా వారి తల్లిదండ్రులో తాతముత్తాతలో తెలిసోతెలీకో చేసిన దోషాలు, తప్పులు కారణం కావచ్చు అంటారు. ఇది దూరం చేసుకోవ డానికి శ్రాద్ద కర్మలు చేయడం ఒక పద్ధతి.
గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం,సంతానం కలక్కపోవడం, పుట్టినవారూ బ్రతక్కపోవడం, ఉన్న బిడ్డలూ సరైన తీరులో జీవించకపోడం, వక్రమార్గం పట్టడం వంటివన్నీ కూడా పితృశాపాలుగా చెప్తారు. పితృఋణం తీర్చుకుంటూ ఉంటే ఇటువంటి బాధలనుంచి దూరం కావచ్చు. పితృఋణం తీర్చుకొనే పద్ధతే శ్రాద్దం. తిలతర్పణం వదలటం అంటారు. మహాలయ పక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. దానికి సంతృప్తి చెందిన పితృదేవతల ఆశీర్వాదం ఆ వంశీకులకు ఉన్నతి కలిగిస్తుంది.
శ్రాద్ధం చేయటంవల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. మనస్ఫూర్తిగా, శ్రద్ధతో శ్రాద్ధకర్మ నిర్వహిస్తే వారు తమ సంతతి వారికి ఆయుష్షు, విద్య, ధనం, సంతానం, సమస్తం కలిగేలాగా దీవిస్తారు. శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం అంటే. శ్రాద్ధకర్మలో నువ్వులు, గూడమిశ్రీత అంటే బియ్యాన్ని బెల్లంతో కలిపి వండే అన్నం, పితృదేవతలకు అర్పిస్తే ఆ వ్యక్తి సంపద వృద్ధి అవుతుంది.
అమావాస్యనాడు శ్రాద్ధకర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి. అన్ని కోరికలు నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం చేసే శ్రాద్థంకన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయపక్షంలో చేసేవి. పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్యనాడైనా చేయాలంటారు పెద్దలు.
ధనం సమకూరనప్పుడు, అవకాశం లేనపుడూ శ్రార్ధకర్మలు పద్ధతి ప్రకారం చేయలేనివారు పితృపక్షమైన ఈ మహాలయ అమావాస్యనాడు ఉత్త శాకంతో అంటే ఏదైనా కూరతో శ్రాద్ధం చేయవచ్చు. అదికూడా వీలుకాకపోతే, గోవుకు దాని ఆహారమైన గడ్డి పెట్టవచ్చు. అదీ చేయలేనివారు చేతులెత్తి మొక్కి పితృదేవతలకు నమస్కరించవచ్చు.
1.ఋషి ఋణము, 2. దేవ ఋణము, 3. పితృ ఋణము. ఈ మూడు ఋణాలను తీర్చుకోవాలి. తీర్చుకున్నవారు ఉన్నతిని పొందుతారు అనేది శాస్త్ర వాక్యమే కాక అనుభవజ్ఞులు కూడా ఉన్నతశిఖరాలను అధిరోహించామని చెప్తున్నారు.
అన్ని అమావాస్యలు (సంవత్సరంలో 12సార్లు) సౌరమానం ప్రకారం సంక్రమణ ఆరంభ దినాలు (సంవత్సరంలో 12 సంక్రమణాలు) మరియు గ్రహణాల, మహాలయ పక్షాల వంటి సందర్భాల్లో తర్పణాలు చేయాలని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. అలా వీలుకానిపక్షంలో అమావాస్య తర్పణలు తప్పక చేయాలి. సౌరమానులకు సంక్రమణాలు ప్రధానం. ఆమావాస్య తర్పణాలతో బాటు (ఉత్తరాయణ పుణ్యకాలం మకరం) సంవత్సరంలో మేషం, కర్కాటకం (దక్షిణాయన ఆరంభం కర్కాటకం) తుల, మకర సంక్రమణాలు ఈ నాలుగు నెలల్లోనైనా తప్పక తర్పణం చేయాలి. మహాలయ పక్షాలలో విధిగా తర్పణం చేసి తీరాలి. మనసారా శ్రద్ధ, భక్తితో మన పితృదేవులకు కృతజ్ఞతలు తెలుపుకునే ఉత్తమ యజ్ఞంలా భావించిచేయాలి. ‘శ్రద్ధ యా దీయతే ఇతి శ్రాద్ధం’ అన్నారు పెద్దలు. ఈ తర్పణాలను, పితృకర్మలను నిజాయతీగా శ్రద్ధగా మనసావాచా కర్మణా చేస్తే మంచిది. ఇక్కడ మొక్కుబడికి చేయడం అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు. అసలు ఎక్కడా ఆర్భాటం కోసం చేసే ఏ పని కూడా భగవం తుడు మెచ్చడు. మనస్పూర్తిగా చిత్తశుద్ధితో చేసిన చిన్న విషయమైనా భగవంతుని మెప్పు తప్పక ఉంటుంది.

- వాణిమూర్తి

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top