Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Saturday, 28 September 2019

Life Story of Shirdi Sai Baba- (sep28, 1838 -15 october 1918 )షిరిడీ సాయిబాబా జీవిత చరిత్ర-షిరిడీలో బాబా నివాసం….ముఖ్యమైన శిష్యులు, అనుయాయులు-తన భక్తులకు బాబా పదకొండు వాగ్దానాలు-షిర్డీ సాయిబాబా చెప్పిన మాటలు-మహిమలు

సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు. ఈయన రెండు సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు.

షిరిడీ సాయిబాబా జీవిత చరిత్ర……
సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు. ఈయన రెండు సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరికి ప్రభువు ఒక్కడే). పెక్కుమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.

సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబా బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి.

జీవిత చరిత్ర……
సాయిబాబా పుట్టుపూర్వోత్తరాల తెలుసుకోవడం కోసం జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడీ చుట్టుప్రక్కలే జన్మించి ఉండవచ్చుననీ, అతని బాల్య నామం హరిభావు భుసారి కావచ్చుననీ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.తన జన్మ, బాల్యాల గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అవి అనవసరమని అనేవాడు. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో మరియు పేరు ఏమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కుల గోత్రాలు చూస్తారు మరియు వారిది ఈ మతం అని మనసులో నాటేసుకొంటారు, బహుశా బాబా అందుకే తన పేరు మరియు పుట్టిన ప్రదేశం ప్రస్తావన చేయలేదు. ఒకమారు తన ప్రియానుయాయుడైన మహాల్సాపతితో తాను పత్రి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని కథనం ఉంది.మరొకమారు ఫకీరు భార్య తనను సేలుకు చెందిన వెంకోసా అనే గురువుకు అప్పగించినట్లు, తాను వెంకోసా వద్ద పన్నెండేళ్ళు శిష్యరికం చేసినట్లు చెప్పాడట.ఈ రెండు కథనాల వలన బాబా పూర్వ జీవితం గురించి వివిధ అభిప్రాయాలు ఉన్నాయి.

తన సుమారు పదహారు సంవత్సరాల ప్రాయంలో బాబా మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చాడని, అక్కడ మూడేండ్లు ఉండి తరువాత కొంత కాలం కనుపించలేదని, మళ్ళీ ఒక సంవత్సరం తరువాత (సుమారు 1858లో) షిరిడీకి తిరిగి వచ్చాడనీ అత్యధికులు విశ్వసించే విషయం. ఈ ప్రకారం బాబా సుమారు 1838లో జన్మించి ఉండవచ్చును.

ఆ యువకుడు ఒక వేప చెట్టు క్రింద ధ్యానంలో రాత్రింబవళ్ళు కూర్చుని ఉండేవాడు. అతనిని చూచి గ్రామస్థులు ఆశ్చర్యపడ్డారు.మహాల్సాపతి, అప్పా జోగలే, కాశీనాధ వంటి ధార్మిక చింతనాపరులైన గ్రామస్థులు బాబాను తరచు దర్శించసాగారు. సాయిబాబా పిచ్చివాడని మరి కొందరు రాళ్ళు కూడా రువ్వేవారు.మళ్ళీ కొంతకాలం కనుపించకుండా పోయిన సమయంలో అతనెక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అప్పుడు అతను చాలా మంది సాధువులను, ఫకీరులను కలిశారని, 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి అధ్వర్యంలో జరిగిన ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో సైనికుడిగా పాల్గొని ఉండవచ్చుననీ, కొంతకాలం నేత పనిచేశాడనీ కొన్ని సూచనల వలన తెలుస్తున్నాయి. కానీ అవి అంచనాలు మాత్రమే.నిజానిక వీటికిి ఎటువంటి ఆధారాలు లేవు.

షిరిడీలో బాబా నివాసం….
తన మసీదు వరండాలో సాయిబాబా

1858లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్ళివారితో కలిసి బాబా షిరిడీ వచ్చారు. అక్కడ ఖండోబా మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు మందిరం పూజారి మహాల్సాపతి “Aao Sai” “రండి సాయీ” అని పిలిచాడు. తరువాత ‘సాయి’ నామం స్థిరపడి ఆయన “సాయిబాబా”గా ప్రసిద్ధుడైనారు.షిరిడీ ప్రాంతంలో సాము గరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్‌లలాగా ఉండేది. ఒకసారి ‘మొహిదీన్ తంబోలీ’ అనే వానితో కుస్తీ పట్టి ఓడిపోయిన తరువాత బాబాలో చాలా మార్పు వచ్చింది. సూఫీ ఫకీరులలాగా మోకాళ్ళవరకు ఉండే ‘కఫనీ’, తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టారు.ఇలా ముస్లిం ఫకీరులా ఉండే బాబాకు స్థానిక హిందువులనుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది.
1918లో తన సమాధి వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు. ఒక పాత మసీదును తన నివాసం చేసుకొన్నారు. మసీదులో ధునిని వెలిగించారు. అందులోనుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవారు. అది వారికి రక్షణ ఇస్తుంది.వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మ బోధలు చేసేవారు. చాలా మహత్తులు చూపించారు. స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవారు. ఉత్సవాలలో పాల్గొనేవారు. ఒకోమారు విపరీతంగా కోపం చూపేవారు.
మసీదు గొడకానుకొని ఉన్న సాయిబాబా, భక్తులతోడుగా


1910 తరువాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది. దేవుడని గుర్తించిన భక్తులు పెక్కురు బాబా దర్శనానికి రాసాగారు.అక్టోబరు 15, 1918 మధ్యాహ్నం 2.30కి బాబా తన భక్తుడైన బయ్యాజీ అప్పాకోతే పాటిల్ వడిలో మహా సమాధి చెందారు. ఆయన దేహం బూటి వాడలో ఖననం చేయబడింది. అక్కడే ‘సమాధి మందిరం’ నిర్మించబడింది.

ముఖ్యమైన శిష్యులు, అనుయాయులు

సాయిబాబా తన మార్గానికి, ఉపదేశాలకు చెందిన సంస్థాగత ఏర్పాట్లు ఏవీ చెయ్యలేదు. ప్రత్యేకించి తన శిష్యులు అని చెప్పుకొనే వ్యవస్థ కూడా ఏమీ లేదు. ఆయన అందరికీ చెందినవారు. సకోరీకి చెందిన ఉపాసనీ మహారాజ్ , అహమ్మద్ నగర్‌కు చెందిన మెహర్ బాబా వంటి సాయిబాబా భక్తులు ప్రసిద్ధులయ్యారు.

శ్రీ సాయిబాబా జీవిత సమయంలో కొందరు భక్తులు ఆయనను సదా అంటిపెట్టుకొని ఉన్నారు - వారిలో ముఖ్యులు: మహాల్సాపతి , హేమాండ్ పంతు, శ్యామా, దాసగణు, హరి సీతారాం దీక్షిత్ (కాకాదీక్షిత్), రఘువీర్ పురందరే, హరి వినాయక్ సాఠే, నానా సాహెబ్ చందోర్కర్, బల్వంత్ నాచ్నే, దామోదర్ రాస్నే, మోరేశ్వర్ ప్రధాన్, నార్కే, ఖాపర్దే, కర్టిస్, రావు బహద్దూర్ ధూమల్, నానా సాహెబ్ నిమోన్కర్, అబ్దుల్, లక్ష్మీబాయి షిండే, బయ్యాజీ అప్పాజీ పాటిల్, కాశీరాం షింపీ, కొండాజీ,గాబాజీ,తుకారాం , శ్రీమతి చంద్రాబాయి బోర్కర్, శ్రీమతి తార్కాడ్, రేగే, రాధాకృష్ణ ఆయీ, కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ, సపత్నేకర్, అన్నా చించిణీకర్, చక్ర నారాయణ్, జనార్ధన్ గల్వంకర్

తన దైనిక వ్యవహారాలలోను, బోధనలలోను సాయిబాబా హిందూమతానికి చెందిన సంప్రదాయాలనూ, ఇస్లాం సంప్ర్రదాయాలనూ కూడా పాటించారు. నమాజ్ చదవడం, అల్-ఫతీహా మననం, ఖొరాన్ అధ్యయనం వంటి ఆచారాలను ప్రోత్సహించారు కాని చాలా ఇతర ఆచారాలను పాటించలేదు.ఆయన దుస్తులు కూడా సూఫీ ఫకీర్ తరహాలోనే ఉండేవి. మతం, కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించారు. అలాగే సనాతన ఛాందస సంప్రదాయాలను, ఏ మతానివైనా గాని, ఖండించారు.తాను ఫకీరుగా ఉన్నా తన అనుయాయులను సామాన్య గృహస్థ జీవనం గడపమని చెప్పారు. ప్రార్థన, భగవన్నామస్మరణ, పుణ్యగ్రంధ పఠనం - వీటిని ప్రోత్సహించారు. ఖొరాన్ చదువమని ముస్లిములకూ, రామాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణం చేయమని హిందువులకూ ఉపదేశించారు.నీతి బద్ధమైన జీవనం గడపమనీ, ఇతరులను ప్రేమించి సహాయం చేయమనీ చెప్పారు. తన భక్తులకు రెండు (2) ముఖ్యమైన లక్షణాలు అలవరచుకోమని పదేపదే చెప్పారు - అవి శ్రద్ధ (విశ్వాసం, భక్తి, దీక్ష), సబూరి (ఓర్పు, సాధన). నాస్తికత్వాన్ని తప్పు పట్టారు. అశ్రద్ధ చేయకుండా బాధ్యతలు నెరవేర్చాలనీ, వ్యామోహానికి లొంగకుండా తృప్తులు కావాలనీ ఉపదేశించారు.

రెండు మతాల గ్రంథాలనూ సాయిబాబా ఆదరించి వ్యాఖ్యానించారు. వాటిపై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉంది.హిందూ మత విషయాలపై బాబా వ్యాఖ్యానాలలో అద్వైతం, భక్తి అంశాలు కలగలిసి ఉండేవి.తన నివాస స్థానమైన మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టుకున్నారు.

భగవంతుడు అంతటా, అందరిలోనూ ఉన్నాడనేది బాబా బోధనలలో ఒక ముఖ్యాంశం. సాయిబాబా ఉపదేశాలు ఇస్లామిక్ సిద్ధాంతాలకూ, ఉపనిషత్సూత్రాలకూ కూడా సరిపోతాయి. ఈ లోకం నశ్వరమనీ, భగవంతుడిచ్చే మోక్షమే శాశ్వతమనీ చెప్పారు. సాధనలో గురువు ప్రాముఖ్యతను గురించీ, గురువునే దేవుడిగా భావించమనీ పదేపదే చెప్పారు. పూర్వపు కర్మల కారణంగా వివిధ ఫలితాలు సంభవిస్తాయని కూడా చెప్పారు.

సాయిబాబా రచించిన గ్రంథాలేవీ లేవు. సాయిబాబా బోధనలు మౌఖికంగానే శిష్యులకు లభించాయి. అవి పెద్ద పెద్ద ఉపన్యాసాలు కావు. సమయానుసారంగా చేసిన చిన్న చిన్న ఉపదేశాలు. తన వద్దకు దర్శనానికి వచ్చిన వారిని తరచు సాయిబాబా ‘దక్షిణ’ అడుగుతుండేవాడు. అలా వచ్చిన ధనాన్ని పేదలకు పంచిపెట్టేవారు. మిగిలిన కొద్దిపాటి ధనంతో పుగాకు, అగ్గిపెట్టెలవంటివి కొనేవారు. భక్తులవద్ద దక్షిణ తీసికొని వారి పూర్వ ఋణాలను చెల్లించడానికి దోహదం చేస్తారని అతని అనుయాయులు అనేవారు.

దానము, ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడం – ఇవి బాబా బాగా ప్రోత్సహించిన గుణాలు. ఏదో సంబంధం లేకుండా ఎవరూ ఎక్కడికీ వెళ్ళలేరు అని బాబా అనేవారు. దగ్గరకు వచ్చినవారిని తిరస్కరించకుండా ఆహ్వానించి ఆదరించమని చెప్పేవారు. “దప్పిక గొన్నవారికి నీరు, ఆకలిగొన్నవారికి అన్నము, నగ్నంగా ఉన్నవారికి దుస్తులు ఇవ్వు, నీ వరండాలో నలుగురూ కూర్చొని విశ్రమించే అవకాశం ఇవ్వు. అలాగైతే శ్రీహరి తప్పక ప్రసన్నుడౌతాడు. ఒక వేళ దానం చేయడం ఇష్టం లేకపోతే మర్యాదగా నిరాకరించు గాని వారియెడల కుక్కలాగా మొరగవద్దు” అని చెప్పాడు.

బాబా చెప్పిన వాటిలో మరి కొన్ని ప్రసిద్ధ వాక్యాలు – “నేనుండగా భయమెందులకు?”"అతనికి మొదలు లేదు... తుది లేదు "

తన భక్తులకు బాబా పదకొండు వాగ్దానాలు చేశాడు.:


 1. షిరిడీలో అడుగు పెట్టినవారి కష్టాలు తీరినట్లే.
 2. మసీదు మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లివిరుస్తుంది.
 3. నేనీ భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా సచేతనంగా ఉంటాను.
 4. నా సమాధి నా భక్తులను దీవిస్తుంది. వారి అవుసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది.
 5. నాసమాధినుండే నేను మీకు దర్శనమిస్తాను.
 6. నా సమాధినుండి నేను మాట్లాడుతాను.
 7. నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ ఉంటాను.
 8. మీరు నావంక చూడండి. నేను మీవంక చూస్తాను.
 9. మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను.
 10. నా సహాయం, బోధన కోరినవారికి అవి వెంటనే లభిస్తాయి.
 11. నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు.

భక్తులు, పూజా విధానాలు

ఖండోబా ఆలయంలోని పూజారి మహాల్సాపతి సాయిబాబాకు మొదటి భక్తుడని ప్రతీతి. తరువాత కూడా కొద్దిమంది స్థానిక శిష్యులు, విశ్వాసంతో దర్శనానికి వచ్చే మరి కొద్దిమంది మాత్రమే బాబా భక్తజనంగా పరిగణించవచ్చును. 1910 తరువాత ఒక భక్తుడైన దాసగణు తన సంకీర్తనల ద్వారా బాబా మహిమలను దేశమంతటా చాటాడు. అప్పటినుండి దేశంలో చాలా ప్రాంతాలనుండి హిందూ, ముస్లిమ్ భక్తులు పెద్ద సంఖ్యలో షిరిడీకి రాసాగారు. బాబా జీవిత కాలం చివరి భాగంలో కొందరు క్రైస్తవ, పార్శీ భక్తులు కూడా షిరిడి సాయి దర్శనానికి రాసాగారు.

షిరిడీలోని సాయి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. అనుదినం వేల సంఖ్యలో వివిధ ప్రాంతాలనుండి భక్తులు షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకొంటారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ అనే సంస్థ షిరిడీ కేంద్రంగా వివిధ కార్యక్రమాలు, ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నది.

దేశంలో అన్ని ప్రధాన నగరాలలోనూ సాయిబాబా మందిరాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్…లో అనెక నగరాలలోను, పట్టణాలలోను, చాలా గ్రామాలలోను సాయి మందిరాలున్నాయి.సాయి బాబా గురించి అనేక పుస్తకాలు ప్రచురితమయ్యాయి.హిందువుల యాత్రా స్థలాలలో ఒకటిగా షిరిడీ పరిగణింపబడుతున్నది. అయితే సాయిబాబా ఆరాధనోద్యమంలో కొద్దిపాటి మాత్రమే షిరిడి సాయి సంస్థానం మార్గదర్శకత్వ వ్యవస్థలో ఉంది. అధికంగా భక్తులు, పూజలు, ఆలయాలు అక్కడి ప్రజల సంకల్పానుసారం ఏర్పాటు చేయబడుతున్నది.

భారతదేశం వెలుపల అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ వంటి చోట్ల కూడా సాయి బాబా భక్తులు, ఆరాధనా కార్యక్రమాలు జరుగుతున్నాయి.

షిరిడీలోని సాయిమందిరానికి సగటుమ రోజూ 20 వేల మంది సందర్శకులు వస్తారని. కొన్ని ప్రత్యేక దినాలలో ఈ సంఖ్య లక్షవరకూ ఉంటుందని అంచనా.

మహిమలు

సాయిబాబా పెక్కు మహిమలు కనబరచారు. వీటిలో ఎక్కువగా హేమాండ్ పంతు రచించిన ‘సాయి సచ్చరిత్ర’లో ప్రస్తావించబడ్డాయి. దీర్ఘ కాలిక వ్యాధులను నయం చేయడం, ఖండ యోగం వంటి అసాధారణ యోగ ప్రక్రియలు, ప్రకృతి శక్తులను నియంత్రించడం, భక్తుల మనసులోని విషయాలు తెలిసికోవడం, దూర ప్రాంతాలలోని భక్తులకు తన సందేశం తెలియజేయడం వంటివి ఇలాంటి మహిమలలో కొన్ని.

తన భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా బాబా అనేక భక్తులకు కలలలోను, మనోధ్యాన సమయంలోను దర్శనమిచ్చి మార్గ నిర్దేశనం చేయడం, కష్టాలనుండి విముక్తి కలిగించడం వంటి మహిమలు కనబరచారు.ఇటువంటి విషయాలు భక్తుల సత్సంగ కార్యక్రమాలలో తరచు చెప్పబడతాయి.

షిర్డీ సాయిబాబా చెప్పిన మాటలు

షిర్డీ సాయిబాబా ఎలాంటి హంగులూ, ఆర్భాటాలూ చూపలేదు. మంత్రాలూ తంత్రాలూ ప్రదర్శించలేదు. నిరాడంబర జీవితం గడిపి చూపారు. సాయిబాబాకు మసీదే మహలు అయింది. అందరూ, అన్ని జీవులూ తినగా మిగిలిన పదార్ధాలనే పంచ భక్ష్య పరమాన్నాలుగా భావించారు. షిర్డీ సాయిబాబా మసీదులో స్తంభాన్ని ఆనుకునో, నింబ వృక్షం కిందనో ఏ ఆడంబరాలూ లేకుండా కూర్చుని, శ్యామా, మహల్సాపతి, భయజాబాయి లాంటి భక్తులకు జీవన సత్యాలు బోధిస్తూ ఉండేవారు. అవి మామూలు మాటలు కాదు, అమూల్యమైన ఆణిముత్యాల మూటలు. ఒక సందర్భంలో సాయిబాబా ఇలా చెప్పారు.

మీరు ఎవర్నీ నొప్పించకండి. తోటివారు మిమ్మల్ని ఏ రకంగా నయినా కష్టపెట్టినా సరే, వారిని క్షమించండి. మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయండి. ఇలా చేయడం వల్ల మేలు జరగడము, మనశ్శాంతిగా ఉండడమే కాదు, మీకు హాని చేసినవారు, లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది కూడా. శ్రద్ధ, సబూరి చాలా అవసరం. మీరందరూ శ్రద్ధ, సబూరీలను అలవర్చుకోవాలి. సహనం, విశ్వాసం లేనివారు జీవితంలో ఏమీ సాధించలేరు. ఎందుకూ కొరకాకుండా పోతారు. ఏ పనిచేసినా శ్రద్ధగా చేయండి. అన్ని సమయాల్లో సహనంగా వ్యవహరించండి. ఎవరైనా, ఏ కారణంగా నయినా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోకండి. ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకండి. ఓర్పుతో మెల్లగా నొప్పించని విధంగా సమాధానం చెప్పి, అక్కడినుండి వెళ్లిపోండి.
ఇతరులు మీపైన అనవసరంగా నిందలు వేసినా మీరు చలించకండి. అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక, నిశ్చలంగా, నిబ్బరంగా ఉండండి. వారితో పోట్లాటకు దిగారంటే, మీరు కూడా వారితో సమానులే అవుతారు. దేవునిపట్ల విశ్వాసం ఉంచండి. ఎట్టి పరిస్థితిలో నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. తోటివారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు. వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు. మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. మనను మనం పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి. ఇతరులు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు కలిగిస్తున్నా, పైన భగవంతుడు ఉన్నాడని నమ్మండి. దేవుడు మీకు తప్పక సాయం చేస్తాడనే విశ్వాసాన్ని ఉంచండి. దేవుడివైపు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే, దేవుడు మిమ్మల్ని కాపాడటానికి 1000 అడుగులు ముందుకు వస్తాడు.

భారతదేశంలో దాదాపు అన్ని ముఖ్య నగరాలలోను, చాలా పట్టణాలలోను సాయిబాబా మందిరాలున్నాయి.కొన్ని విదేశాలలో కూడా బాబా మందిరాలున్నాయి. ముంబైకు చెందిన షామారావు జయకర్ చిత్రించిన నిలువెత్తు పటం బాబా నివసించిన మసీదులో ఉంది. షిరిడీలోని సమాధి మందిరంలోని పాలరాతి విగ్రహం ‘తలీమ్’ అనే శిల్పి చెక్కినది.వివిధ బాబా ఆలయాలలోను, సత్సంగాలలోను, కుటుంబ ప్రార్థనా సమావేశాలలోను బాబా భజన, హారతి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.

స్వయంగా వండి పెట్టేవారు 

బాబా దినచర్య విషయానికొస్తే... రోజూ ముఖ ప్రక్షాళన చేసుకున్న తర్వాత ధునిలో కట్టెలు వేసి, ఫలహారం సమయానికి భుజానికి జోలె, చేతిలో భిక్ష పాత్రా పట్టుకుని అయిదు ఇళ్లకు భిక్షకు వెళ్లేవారు. కాసేపటికి లెండీ వనానికి వెళ్లి వామన తాత్యా అనే భక్తుడు ఇచ్చే రెండు పచ్చి కుండలతో నీళ్లు తోడి మొక్కలకు పోసేవారు. సాయిబాబానే స్వయంగా రకరకాల మొక్కల్ని తెచ్చి లెండీవనంలో నాటి పెంచేవారట. తర్వాత ద్వారకామాయిలో భక్తులతో గడిపి మధ్యాహ్నానికి మరోసారి భిక్షకు వెళ్లేవారు. భిక్షలో దొరికిన పదార్థాలన్నిటినీ మసీదులో రెండు పాత్రల్లో వేసేవారు. ఒక పాత్రలోనివి మసీదు తుడిచే మహిళ, భక్తులూ తీసుకెళ్లేవారు. మరో పాత్రలోనివాటిని కుక్కలూ పిల్లులూ కాకులూ యథేచ్ఛగా తినేవి. నిజానికి బాబాకోసం ఎంతోమంది భక్తులు రకరకాల ఫలహారాలు వండి తీసుకొచ్చేవారు అయినా చివరి రోజుల వరకూ ఆయన భిక్షాటన మానలేదు. తన దగ్గరకు ధనవంతులు వచ్చినా బీదవారొచ్చినా ఒకేలా చూసేవారు. ద్వారకామాయిలోకి అడుగుపెట్టాక అందరూ సమానమే అనేవారు. వివిధ ప్రాంతాల నుంచి ఎందరో భక్తులు సద్గురు సాయిని దర్శించుకునేందుకు వచ్చేవారు. అలాంటి వారు దక్షిణ రూపంలో ఇచ్చిన డబ్బుని పేద భక్తులకు రోజుకి రూ.50, 20, 15 చొప్పున పంచిపెడుతూ ఉండేవారు బాబా. ఇంకా మిగిలితే ఆ సొమ్ముతో స్థానికంగా ఉన్న ఆలయాలకు మరమ్మతులూ బీదవారికి అన్నదానాలూ చేయించేవారు. ఒక్కోసారి వంటసామాను తెప్పించి రకరకాల వంటకాలను తనే స్వయంగా వండి వడ్డించేవారు.

బాబా మహా సమాధి 

షిర్డీలో దాదాపు అరవై ఏళ్లు నివసించిన బాబా 1918 సంవత్సరంలో దసరా రోజున తన భౌతిక దేహాన్ని విడిచి వెళ్లారు. సమాధి చెందడానికి కొన్ని నెలల ముందు దగ్గరి భక్తుడూ కోటీశ్వరుడూ అయిన బాపూ సాహెబ్‌ బూటీకి చక్కని భవనం ఒకటి కట్టించమని బాబా చెప్పినట్లూ కల వచ్చిందట. అది సాయినాథుడి ఆజ్ఞగా భావించి పనులు మొదలుపెట్టాడు బూటీ. మందిరం పనులు పూర్తి కావొచ్చేసరికి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో సాయి భక్తురాలైన బాయిజా బాయి కొడుకు తాత్యా అనారోగ్యంతో మంచం పట్టాడు. చిన్నతనం నుంచీ బాబాను మామా అంటూ ఎన్నోఏళ్ల పాటు ఆయనతో మసీదులోనే నిద్రించాడు అతడు. తాత్యా అనారోగ్యం గురించి తెలిసి ఓరోజు బాబా అతడిని తీసుకు రమ్మని కబురు పంపించారు. అతికష్టంమీద మసీదులో అడుగుపెట్టిన తాత్యాని చూసి 'నీకేం కాదు, నీ బదులు నేను వెళ్తాను' అని చెప్పారట. బాబా మాటలు అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత నుంచీ ఆయన ఆరోగ్యం క్షీణించడం, తాత్యా కోలుకోవడం మొదలైంది. దసరా రోజుకి సాయిబాబా పూర్తిగా నీరసించిపోయారు. చివరికి... నాకిక్కడ బాగోలేదు, బూటీ కట్టించిన భవనంలోకి తీసుకెళ్లమని అంటూ పక్కకు ఒరిగిపోయారు. తర్వాత సద్గురు సాయి చెప్పిన ప్రకారమే ఆయన దేహాన్ని బూటీ వాడాలోని మందిరంలో సమాధి చేశారు. అదే ఇప్పటి షిర్డీ ఆలయం. సమాధి పైనున్న బాబా నిలువెత్తు విగ్రహాన్ని ఆ తర్వాత 36 ఏళ్లకు ప్రతిష్ఠించారు.

మహనీయుని మహాభినిష్క్రమణం..


శ్రీ సాయిబాబా నిర్యాణం చెందిన వార్త దావాలనంలా శిరిడీ అంతా వ్యాపించి పోయింది..
అప్పటిదాకా ఎంతో వేడుకతో ఉన్న శిరిడీ ఒక్కసారిగా మూగబోయింది..
బూటీ బాధ వర్ణనాతీతంగా ఉంది..
బూటీ పలుకుబడి వల్ల నైతే నేమి, శ్రీ సాయిబాబా తాను స్వయంగా గృహప్రవేశం చేస్తున్నామని చెప్పిన పలుకుల వలనైతే నేమి..
చుట్టుప్రక్కల గ్రామాలనుండీ..
జనం తండోపతండాలుగా వచ్చివున్నారు..
భజనబృందాలూ.. కీర్తనకారులూ..నర్తకులూ..
శ్రీ సాయిబాబా కోరిక మేరకు, సన్నాయి వాద్యకారుడు పిలానీ గురవ్ తన బృందం తో సహా తయారుగా వున్నాడు..
అందరికీ శ్రీ సాయిబాబా నిర్యాణం ఆశనిపాతం లా తగిలింది..
డీలా పడిపోయారు..
ఇదే అదను గా కొందరు వక్రబుద్ధులు, హిందూ ముస్లిం సంప్రదాయాల చిచ్చు పెట్టారు..
శ్రీ సాయిబాబా భౌతిక కాయాన్ని ఏ సంప్రదాయం లో ఖననం చేయాలో అనే మీమాంసను తెరపైకి తెచ్చారు.
ఒక రోజు ఈ వివాదం తెరపైకి వచ్చినా..
మహల్సాపతి, నానా చాందోర్కర్, భాగోజీ..
ఇలా అందరూ కలసి
శ్రీ సాయిబాబా చివరి కోరిక ప్రకారం బూటీ మందిరం లోనే సమాధి చేయాలని నిశ్చయం చేసి, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయమని బూటీ కి చెప్పేసారు.
వివాదం సమసిపోయింది… యధావిధిగా జోగ్ ఆరోజు కూడా హారతి ఇచ్చాడు….
ప్రజలందరూ హర్షించారు..
శ్రీ సాయిబాబా శరీరం బూటీ వాడాకు అత్యంత వైభవంగా తరలింది..
పూలవర్షం ఒక వైపు..
కన్నీటి ధారలు మరోవైపు..
బ్యాండ్ మేళం..పిలానీ గురవ్ సన్నాయి వాయిద్య ఘోష..
శ్రీ సాయిబాబా మరణించినట్లు గాక..ఆయన తమ మధ్య..
తమతో కలసి మందిర ప్రవేశం చేస్తున్నారని భక్తులందరూ భావించారు…
ఎత్తైన పాలరాతి వేదిక పై
శ్రీ సాయిబాబా పార్థివ దేహాన్ని ఉంచారు..
చేయవలసిన క్రతువు పూర్తి చేశాక, ఆ వేదిక క్రిందనే
శ్రీ సాయి దేహాన్ని సమాధి చేశారు..
ఆ వేదిక పై శ్రీ సాయిబాబా కోసం తయారు చేసిన వెండి సింహాసనాన్ని ఉంచారు..
సింహాసనం పై శ్రీ సాయి చిత్రపటాన్ని పెట్టారు..
హారతులు సక్రమంగా ప్రారంభించారు..
బూటీ కట్టించిన ఆ మందిరం “శ్రీ సాయిబాబా మందిరంగా ” ప్రసిద్ధి పొందింది..
కుడివైపు గదిలో
శ్రీ సాయిబాబా వాడిన సర్వ పవిత్ర వస్తువులను ప్రదర్శన కోసం భద్రపరచారు..
శ్రీ సాయిబాబా సమాధి మందిరం పర్యవేక్షణకు ముఖ్యమైన భక్తులందరూ కలసి “శ్రీ సాయి సంస్థాన్” అని సంస్థను ఏర్పాటు చేశారు.
శ్రీ సాయిబాబా భౌతికంగా లేకపోయినా..
విశ్వాసం తో శ్రీ సాయిబాబా ను కొలిచిన వారి కోర్కెలు యధావిధిగా తీరిపోతున్నాయి.
“నేను సమాధి నుండే మీ కోర్కెలు తీరుస్తాను!.” అన్న
శ్రీ సాయినాథుని మాటలు అక్షర సత్యాలుగా మారిపోయాయి..
1922 నాటికి దాసగణు ఆ సంస్థాన్ కు అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నాడు..
ఏకధాటిగా 25 సంవత్సరాల
పాటు శ్రీ సాయి సంస్థాన్ కు అధ్యక్షుడిగా సేవ చేసాడు..
కుగ్రామం గా ఉన్న శిరిడీ పట్టణం గా రూపుదిద్దుకున్నది.. వందలు, వేల సంఖ్యలో భక్తులు సాయి మందిరాన్ని దర్శించసాగారు..
మహల్సాపతి, మాధవరావ్, దాసగణు, భాగోజీ..
అందరూ బూటీ వద్ద కలిసినప్పుడు శ్రీ సాయిబాబా తమతో చెప్పిన మాటలు గుర్తుతెచ్చుకుని..
పరవశించిపోతుండేవారు..
వారికి శ్రీ సాయినాథులు ఇంకా తమతో వున్నట్లుగానే ఉంది..
ఒకరోజు బూటీ మాటల సందర్భంలో..
తనను రాధాకృష్ణ ఆయీ మందిర నిర్మాణం కోసం ఎంత బలవంత పెట్టిందీ గుర్తుతెచ్చుకుని..
తానారోజు వెనుకంజ వేసివుంటే…
ఈనాడు తనకీ భాగ్యం దక్కేది కాదని అన్నాడు..
అందరూ నిజమే నన్నారు..
శ్రీ సాయిబాబా తన ముఖ్యమైన భక్తులలో రాధాకృష్ణ ఆయీ కూడా ఒకటి అని చెప్పడం వారు గుర్తుచేసుకున్నారు..షిర్డీ ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల్లో ఒకటి

నూట యాభైఏళ్ల కిందట... షిర్డీ గ్రామం ఒకటుందన్న విషయం మహారాష్ట్రలోనే చాలామందికి తెలీదు. ప్రస్తుతం షిర్డీ ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల్లో ఒకటైంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన హిందూ ఆలయాల్లో మూడో స్థానానికి చేరుకుంది. సాయినాథుడికి భారత్‌లోనే కాదు, ఎన్నో దేశాల్లో ఎందరో భక్తులున్నారు. దాదాపు 50 దేశాల్లో 8,500 దాకా ఆలయాలున్నాయి. పద్మనాభస్వామి ఆలయం, తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ప్రపంచంలో అత్యంత సంపన్నమైన హిందూ దేవాలయం షిర్డీసాయి బాబాదే. సాయి సంస్థాన్‌ బ్యాంకు ఖాతాల్లో 1800 కోట్ల రూపాయల సొమ్ము, 380 కిలోల బంగారం, సుమారు 4,450 కిలోల వెండీ ఉన్నాయట. ఇవి కాకుండా డాలర్లూ పౌండ్ల రూపంలో మరికొంత ఉంది. ఇలా మొత్తం బాబా ఆలయ ఆస్తుల విలువ రెండువేల కోట్ల రూపాయలకు పైనే.
first Sai baba temple at Bhivpuri.-ప్రపంచంలోనే తొలి బాబా గుడి - భివ్‌పురి. ఆ కథేంటో తెలుసుకుందామా..?

Tallest Sai Baba Statue -ప్రపంచంలోనే అతిపెద్ద సాయిబాబా విగ్రహం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సాయిబాబా పుట్టుకను రహస్యంగా ఎందుకుంచారు..?సాయిబాబా, తన జీవితంలో ముగ్గుర్ని గురువులుగా భావించారు. బాబా తనను తాను సామాన్యుడినని చెప్పుకుంటూ ఆ ముగ్గురు మహనీయులకి గురుస్థానం ఇచ్చారు. ఆ సంగతి వివరంగా తెలుసుకుందాం.


0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top