Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Thursday, 19 September 2019

గ్రామ సచివాలయం తాజా సమాచారం.....గ్రామ సచివాలయ సిబ్బందికి 6 రోజుల ప్రాధమిక శిక్షణా కార్యక్రమం షెడ్యూలు
సచివాలయాలకు సంబంధించి జిల్లాల్లో ఆయా కేటగిరీలకు కేటాయించిన 
పోస్టులు పూర్తిగా భర్తీ కాని చోటే..బీసీ, జనరల్‌ అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల తగ్గింపుపై ఈ నెల 15 తర్వాత స్పష్టత 
ఇప్పటికి 1,01,454 మందికి కాల్‌లెటర్లు
సాక్షి, అమరావతి: ‘సచివాలయ’ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు రాతపరీక్షల్లో కనీస అర్హత (క్వాలిఫై) మార్కులను తగ్గించారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన పోస్టులకు సరిపడా ఆయా కేటగిరీల అభ్యర్థులు రాత పరీక్షల్లో కనీస మార్కులు తెచ్చుకోలేని జిల్లాల్లో.. లేని పోస్టుల్లో మాత్రమే అర్హత మార్కులు తగ్గించి, ఆ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో జిల్లాల్లో పోస్టులు పూర్తిగా భర్తీ కాని వాటికి కనీస అర్హత మార్కులు తగ్గించి, నియమించడానికి కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)లు చర్యలు చేపట్టాయి. సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల్లో ఓసీలకు 60, బీసీలకు 52.50, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హత మార్కులుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ కనీస అర్హత మార్కులు తెచ్చుకున్న వారినే ఉద్యోగం పొందేందుకు అర్హులుగా పేర్కొంటూ డీఎస్సీలు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు పిలుస్తున్నాయి. అయితే.. పలు జిల్లాల్లో వివిధ రకాల ఉద్యోగాల రాతపరీక్షల్లో కనీస అర్హత మార్కులు తెచ్చుకున్న వారు తగినంత మంది లేక ఖాళీలు మిగిలిపోయాయి. 
నిర్దేశిత అర్హత మార్కులు సాధించినవారు లేక..
1,26,728 సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 1–8 మధ్య పరీక్షలు జరిగాయి. జిల్లాల్లో పోస్టుల వారీగా, రిజర్వేషన్ల వారీగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలకు సరిపడా అర్హత సాధించిన వారు లేక శనివారం సాయంత్రం వరకు 1,01,454 మంది అభ్యర్థులకు మాత్రమే డీఎస్సీలు కాల్‌లెటర్లు పంపాయి. సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్‌లోనే అవసరమైన జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు తగ్గిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాల్లో పోస్టులవారీగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయించినవాటికి కనీస అర్హత మార్కులను తగ్గించి సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని వారికి సమాచారం పంపుతున్నారు. ఈ పోస్టులను ఈ నెల 14లోపు ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 
సీఎం నిర్ణయం మేరకు జనరల్, బీసీ కేటగిరీల కటాఫ్‌ తగ్గింపు!
పలు జిల్లాల్లో వివిధ రకాల ఉద్యోగాలు బీసీ, జనరల్‌ కేటగిరీల్లో మిగిలిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ కేటగిరీల అభ్యర్థులకు రాత పరీక్షల్లో కనీస అర్హత మార్కులు తగ్గించాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో లేదా రాష్ట్ర మంత్రివర్గం ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అక్టోబర్‌ 15న జిల్లాల వారీగా జనరల్, బీసీ కేటగిరీల్లో మిగిలిపోయే పోస్టుల వివరాలను ప్రభుత్వం ముందు ఉంచనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత కటాఫ్‌ తగ్గింపుపై స్పష్టత ఉండొచ్చని అంటున్నారు.  


గ్రామ సచివాలయ ఉద్యోగుల శిక్షణా కరదీపిక...

Download.... training module డౌన్ల్లోడ్.


💥మిగిలిన 'సచివాలయ' పోస్టులకు మళ్లీ ఎంపిక!....వివరాలు.... latest....
➖➖➖➖
💥నేటి నుంచి 'సచివాలయ' నియామక పత్రాలు...3 ఏళ్ల నిబంధన మధ్యలో మానుకుంటే జీతం తిరిగి కట్టాల్సిందే....అభ్యర్ధులలో ఆందోళన.... http://www.mannamweb.com/2019/10/appointments-3.html

ఆ నిబంధనతో బెంబేలు!
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :
              గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఒక నిబంధన బెంబేలెత్తిస్తోంది. నియామక పత్రాలను సోమవారం అందుకున్న వారిలో సైతం ఈ నిబంధన చర్చనీ యాంశంగా మారింది. దీని ప్రకారం సచివాలయ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి మూడు సంవత్సరాల పాటు కచ్చితంగా ఆ విధులు నిర్వహించాల్సిఉంది. ఈ లోగా ఏ కారణం చేతనైనా ఉద్యోగాన్ని మానుకుంటే, మూడు సంవత్సరాల కాలంలో పొందిన జీత భత్యాలను తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని 'రికవరి' చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రొబేషనరీ పిరియడ్‌లో నెలకు 15 వేల రూపాయల వేతనాన్ని ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ కాలం రెండు సంవత్సరాలే అయినప్పటికీ, మూడేళ్లకు ఆ మొత్తాన్ని ప్రామాణికంగా తీసుకుంటే 5.40 లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఎప్పుడు మానేస్తే అప్పటివరకు జీతంగా తీసుకున్న మొత్తాన్నే తిరిగి చెల్లించాల్సిఉంటుందా. మూడు సంవత్సరాల మొత్తాన్ని కట్టాల్సిఉంటుందా అన్న దానిపై స్పష్టత లేదు. ప్రభుత్వ ఉద్యోగాకు ప్రొబేషనరీ, మానుకోవాలంటే ముందుగా నిర్ణీత కాలంలో నోటీసు ఇవ్వడం వంటి నిబంధనలు సహజమేయైనప్పటికీ ఇలా రికవరీ నిబందన ఇప్పటి వరకు లేకపోవడంతో అభ్యర్థులలో రకరకాలుగా చర్చ జరుగుతోంది. సచివాలయ ఉద్యో గాలు జిల్లా స్థాయి నియామకాలన్న సంగతి తెలిసిందే! దీంతో బదిలీలకు అవకాశం తక్కువ! ఉద్యోగాలు పొందిన వారిలో ఎక్కువ మంది యువతీ యువకులే. వివాహనంతరం వీరిలో కొందరైనా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అదే విధంగా దీనికన్నా ఉన్నత ఉద్యోగాలను పొందినప్పుడు కూడా ఒకే సారి భారీ మొత్తంలో చెల్లించా ల్సిరావడం ఆటంకంగా మారవచ్చు. ఈ కారణంతోనే కొందరు అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరాలా వద్దా అనే అంశంపై పునరాలోచిస్తున్నారు.

సర్పంచ్‌ల కన్నుసన్నల్లోనే .. జాబ్‌ఛార్ట్‌ విడుదల

సచివాలయ ఉద్యోగులు పూర్తిగా సర్పంచ్‌ల కన్నుసన్నల్లోనే విధులు నిర్వహించనున్నారు. జాబ్‌ఛార్ట్‌లో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం పేర్కొంది. వీరిని బదిలీ చేయడం, తొలగించడం, బదిలీ చేయడం, క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం వంటి వాటితో పాటు సెలవులు ఇచ్చే అధికారాన్ని కూడా సర్పంచ్‌లకే ప్రభుత్వం కట్టబెట్టింది. దీనితో పాటు రికార్డులు భద్రపరచడం, రిజిస్టర్లు నిర్వహించడం తదితర బాధ్యతలను కూడా సర్పంచ్‌ దిశా నిర్ధేశంలోనే చేయాల్సిఉంది. సాంకేతిక, పాలనా పరమైన అంశాలను ఆయా గ్రామ పంచాయతీ సెక్రటరీ పర్యవేక్షిస్తారని నిబందనల్లో పేర్కొన్నారు.

*Lr.No:751 DT:28.09.19*
 గ్రామ సచివాలయ ఉద్యోగానికి ఎంపికైన వారికి web option ద్వారా places కేటాయించాలని జిల్లా కలెక్టర్లకు అందిన ఉత్తర్వులు.


‘సచివాలయ’ ఉద్యోగుల విధివిధానాలు ఖరారు

మూడు ప్రాంతాలను ఎంచుకునే చాన్స్‌

వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్‌  

ఒకే పోస్టుకు ఎక్కువ మంది పోటీ పడితే రెండు, మూడు ప్రాధాన్య స్థానాల్లో నియామకం   

అపాయింట్‌మెంట్‌ లెటర్ల తర్వాత ఉద్యోగులకు వేరుగా పోస్టింగ్‌ ఆర్డర్లు  

అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్రామ, వార్డు సచివాలయాలు

ఉద్యోగులకు నేడు విజయవాడలో నియామక పత్రాలు అందజేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్‌ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని నిర్ణయించింది. ఉద్యోగి సొంత మండలం లో మరే గ్రామమైనా.. జిల్లాలో మరెక్కడైనా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. పోస్టింగ్‌ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది.

సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జిల్లా సెలక్షన్‌ కమిటీల(డీఎస్సీ) ఆధ్వర్యంలో పోస్టింగ్‌ ఇస్తారు. ఈ మేరకు విధివిధా నాలను ప్రభుత్వం ఖరారు చేసింది. దీనిపై పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు పోస్టింగ్‌ కోరుకుంటున్న మూడు ప్రాంతాల వివరాలను డీఎస్సీల ద్వారా ఉన్నతాధికారులు తెలుసుకుంటారు. వీలైతే ఈ సమాచారాన్ని ఉద్యోగులు అన్‌లైన్‌లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలోనే పోస్టింగ్‌ ఇస్తారు. ఒకే గ్రామ సచివాలయంలో ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు పోటీపడినప్పుడు ఉద్యోగులు కోరుకున్న రెండు, మూడు స్థానాల్లో అవకాశం కల్పిస్తారు. 

ఉద్యోగులకు నేడు నియామక పత్రాలు 
గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్ష ఫలితాల అనంతరం సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా పూర్తయి ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ నెల 30వ తేదీన(సోమవారం) జిల్లా కేంద్రాల్లో అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేస్తారు. విజయవాడలో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. జిల్లాల్లో సంబంధిత జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో ఉద్యోగులకు అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేస్తారు. అపాయింట్‌మెంట్‌ లెటర్‌ అంటే అభ్యర్థి ఫలానా ఉద్యోగానికి ఎంపికైనట్టు  నిర్ధారిస్తూ ఇచ్చే పత్రమని, సదరు ఉద్యోగిని ఎక్కడ విధుల్లో నియమించారనే సమాచారాన్ని వేరుగా అందజేసే పోస్టింగ్‌ ఆర్డర్‌లో తెలియజేయనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. 

సీఎం కార్యక్రమ షెడ్యూల్‌ 
విజయవాడలోని ‘ఎ’ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో సోమవారం ఉదయం 8 గంటలకు కృష్ణా జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికై, కార్యక్రమానికి ఆహ్వానం ఆందినవారి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేదిక వద్దకు చేరుకుంటారు. సచివాలయ ఉద్యోగులకు లాంఛనప్రాయంగా నియామక పత్రాలు అందజేసిన తరువాత వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.  ఇలా ఉండగా అన్ని జిల్లా కేంద్రాల్లో సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి సందేశాన్ని వినేందుకు వీలుగా అధికారులు ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.

గ్రామ సచివాలయ ఉద్యోగుల జాబ్ చార్ట్
ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ వారిచే జారీచేసింది...
కింది లింక్ నుంచి చేసుకోగలరు.....
JOB CHARTS OF VILLAGE SECRETARIAT FUNCTIONARIES

తొలి నియామక పత్రాన్ని అందించనున్న సీఎం వైఎస్‌ జగన్‌
జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో పంపిణీ

తూర్పు గోదావరిలో సచివాలయ వ్యవస్థకు శ్రీకారం

సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైనవారందరికీ ఈ నెల 30న ఒకేసారి నియామక పత్రాలు అందించనున్నారు. తొలి నియామక పత్రాన్ని విజయవాడలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అందిస్తారు. జిల్లాల్లో జిల్లాల ఎంపిక కమిటీ (డీఎస్సీ)ల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు చెప్పారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొని.. అక్కడ నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలకు ఎంపికైన వారిని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో 13 జిల్లాల్లో ఉద్యోగాలకు ఎంపికైనవారు సీఎం ప్రసంగాన్ని వీక్షించేలా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

రాత పరీక్షల్లో ఉత్తీర్ణులై సెప్టెంబర్‌ 30 నాటికి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తికాని వారికి వెరిఫికేషన్‌ పూర్తయిన వెంటనే అక్కడికక్కడే నియామక పత్రాలు ఇవ్వనున్నారు. కాగా, శుక్రవారం కూడా పలు జిల్లాల్లో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కొనసాగింది. కృష్ణా జిల్లాతో సహా నాలుగైదు జిల్లాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలతో షార్ట్‌ లిస్టుల జాబితా వెల్లడి పూర్తి కాగా, మిగిలిన జిల్లాల్లో శనివారం నాటికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. కేటగిరీ –1 ఉద్యోగాల్లో నాలుగు రకాలకు ఒకే రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తులో ఆ నాలుగింటిలో మొదటి ప్రాధాన్యత కింద కోరుకున్న దాని ప్రకారం ఉద్యోగాల కేటాయింపు చేయాల్సి ఉండడం సంక్లిష్టతతో కూడుకోవడంతో జాబితాల వెల్లడి ఆలస్యమవుతోందని అధికారులు వెల్లడించారు. 

తూర్పు గోదావరి జిల్లాలో సచివాలయ వ్యవస్థకు శ్రీకారం
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు తూర్పు గోదావరి జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుడతారని అధికార వర్గాలు తెలిపాయి. అక్టోబర్‌ 2న కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని కరప గ్రామంలో సచివాలయ భవనాన్ని సీఎం ప్రారంభిస్తారని వివరించాయి.
__________________________


అన్ని డిస్ట్రిక్ట్స్   షార్ట్ లిస్ట్స్ మరియు   కాల్ లెటర్స్  ఎప్పటి కపుడు అప్లోడ్ చేస్తూ ఉన్నారు డౌన్లోడ్ చేసుకోండి .

షార్ట్ లిస్ట్స్  మరియు   కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత  మీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయండి.

షార్ట్ లిస్ట్స్  నందు  కొన్ని  DISTRICTS 24-09-19  మరియు 25-09-2019  తేదీ,  కొన్ని 25-09-2019  తేదీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉన్న అభ్యర్థుల లిస్ట్ మాత్రమే ఉన్నది గమనించగలరు .

ఎప్పటికపుడు లింక్స్ అప్డేట్ చేయబడతాయి  చెక్ చేస్తూ ఉండండి.

♦selected candidates for certificate verificationఈ  క్రింది విషయాలు ఈ రోజు 24/9/2019న  INSERT చేసారు. గమనించగలరుతనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ కాపీ. దీనికి సంబంధించిన నిర్ణీత ఫార్మాట్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
ANTECEDENTS VERIFICATION FORM
▪అభ్యర్థి ఆన్‌లైన్‌లో certificate upload చేసిన అనంతరం వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
DOWNLOAD UPLOAD CERTIFICATES
ఐదు జిల్లాల్లో మొదలు..  నేటి నుంచి మిగిలిన జిల్లాల్లో కూడా
జిల్లాల వారీగా..పోస్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలు వెబ్‌సైట్‌లో 
ఈనెల 29కల్లా మొత్తం ప్రక్రియ పూర్తి Latest news...
సాక్షి, అమరావతి : సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కార్యక్రమం మంగళవారం ఐదు జిల్లాల్లో ప్రారంభమైంది. అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇందుకు శ్రీకారం చుట్టగా మిగిలిన ఎనిమిది జిల్లాల్లో బుధవారం నుంచి మొదలు పెట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాల్లో పోస్టుల వారీగా ఎంపికైన వారి జాబితాలను అభ్యర్థుల హాల్‌టికెట్‌ నంబరు, జిల్లా ర్యాంకుల వివరాలతో అధికారులు ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు. 19 రకాల ఉద్యోగాలకు సంబంధించి షార్ట్‌లిస్టును తయారుచేసి ప్రకటించాల్సి ఉండగా.. మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు జిల్లాల వారీగా, పోస్టుల వారీగా ఉద్యోగాలకు ఎంపికైన వారితో కూడిన 105 షార్ట్‌లిస్టులను అందుబాటులో ఉంచారు.

రిజర్వేషన్ల ప్రకారం, రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా జాబితాల రూపకల్పన సంక్లిష్టంగా మారడంతో జాబితాల వెల్లడి ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. కాగా, అన్ని జిల్లాల్లో అన్ని రకాల పోస్టులకు షార్ట్‌లిస్టు బుధవారం సాయంత్రానికి ఖరారయ్యే అవకాశముందని వారంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలంటూ అభ్యర్థులకు కాల్‌ లెటర్లు పంపుతారు. మరోవైపు.. ముందుగా నిర్ణయించినట్లుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రారంభమైన చోట కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్‌ కమిటీలు ఈ ప్రక్రియను 24 నుంచి 26 వరకు జరుపుకోవడానికి అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. కొన్ని జిల్లాల్లో అవసరమైతే 27వ తేదీ వరకు కూడా జరిపినా 29వ తేదీకల్లా మొత్తం ప్రక్రియను పూర్తిచేసి ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేయాలని అధికారులు స్పష్టం చేశారు.

AP Grama/Ward Sachivalayam 2019 Certificates Upload Link

1. Two copies of the application form which was uploaded to the website.             
2. Two photos, on the rear side of which candidate details shall be given             
3. Copy of Hall Ticket             
4. Date of Birth Certificate or 10th class pass certificate               
5. Certificates of all Education qualifications        6. School Study Certificates 4th to 10th Class          7. Latest Community Certificate issued by the competent authority             
8. Medical Certificates for PH Candidates, issued by competent Board/Authority                     a)Medical Certificate for Blind (For VH)                   b)Certificate of Hearing Disability and Hearing Assessment (For HH)                   
c)Medical Certificate in respect of Orthopedically Handicapped Candidates (For OH)               9.Sports Merit certificates (In case of candidates selected under sports quota)             
10.Ex-service Men Certificates (In case of Candidates Selected under Ex- Service Men Quota) issued by competent Unit Head          
11.Creamy Layer Certificate (For all BC Candidates)             
12.Residence Certificate, if you are claiming local status as private candidate             
13.Duly filled & signed Antecedent Verification form downloaded from candidate’s log-in              14.Certificate of experience issued by competent district head of the dept including length of service/weightage marks, if any.             
15.Two sets of prints/photocopies of all Certificates that are uploaded to website (when uploaded Certificates are printed, Hall Ticket no. of the candidate is also printed. Only such  copies that have Hall Ticket no. printed are accepted) duly attested by the candidate.             
16.Other Certificates, if any mentioned in Application.

Upload Certificate File Size Must be below or equal to 400 KB (File Type pdf/jpg/jpeg/png).
After Uploading of the Certificates,Please Download Uploaded Certificates zip file from this page take printouts of Certificates for Verification.Call Letter Enabled for District and Post Up to date and time time.
అన్ని జిల్లా కాల్ లెటర్స్ ఎప్పటికపుడు  అప్డేట్ చేయబడతాయి. క్రింది లింక్ చెక్ చేస్తూ ఉండడవలెను.
Download Call Letters

సచివాలయ మెరిట్‌ లిస్ట్‌ -కొలిక్కిరాని కసరత్తు.. సచివాలయాల ఉద్యోగార్థుల్లో ఆందోళన
నేడు ప్రకటించే అవకాశం
పత్రాల పరిశీలనానంతరం అక్కడికక్కడే నియామక ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి జిల్లాల వారీగా ప్రతిభావంతుల జాబితా (మెరిట్‌ లిస్ట్‌) తయారీ పని ఆదివారానికీ కొలిక్కి రాలేదు. ముందు ప్రకటించిన ప్రకారమైతే ఈపాటికే జిల్లాల వారీగా జాబితాలను ప్రకటించి, అభ్యర్థులు అప్‌లోడ్‌ చేసిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవ్వాలి. మార్కులు, ర్యాంకుల వివరాలు జిల్లాలకు సకాలంలో వెళ్లినా శనివారం సాయంత్రం వరకు అత్యధిక జిల్లాల్లో బయటకు రాలేదు. పంచాయతీరాజ్‌, పురపాలకశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాక కొంత కదలిక వచ్చింది. మార్కులు, రిజర్వేషన్‌, రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా ప్రతిభావంతుల జాబితా తయారు చేసే ప్రక్రియ అత్యధిక జిల్లాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉదయం ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. జాబితాల్లో పేర్లున్న వారంతా సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేసి, అసలైన ధ్రువపత్రాలతో హాజరయ్యేలా జిల్లా యంత్రాంగాలు సోమవారం నేరుగా అభ్యర్థులకు సమాచారాన్ని అందించనున్నాయి. ఈ ప్రక్రియను 3 రోజులపాటు నిర్వహించి, పత్రాల పరిశీలన తర్వాత అక్కడికక్కడే నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

వెబ్‌సైట్‌లో పెట్టాలని అభ్యర్థుల వినతి
ప్రతిభావంతుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయ వెబ్‌సైట్‌లో పెట్టాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే సమాచారాన్ని అందించి మిగతా వారి వివరాలు బహిర్గతం చేయబోమని కొన్ని జిల్లాల్లో అధికారులు ప్రకటించడంతో ఉద్యోగార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విధానంతో ప్రతిభావంతుల జాబితాలో ఎవరికెన్ని మార్కులొచ్చాయో తెలుసుకోవడం కష్టమని, అవకతవకలు జరిగినట్లుగా అనుమానించాల్సి వస్తుందని హెల్ప్‌లైన్‌కు ఆదివారం కొందరు అభ్యర్థులు ఫోన్లు చేశారు. దీనిపై పంచాయతీరాజ్‌, పురపాలకశాఖ ఉన్నతాధికారులు సమావేశమై ప్రతిభావంతుల జాబితాలను జిల్లా వెబ్‌సైట్లలో పెట్టే విషయమై చర్చించారు. ప్రతిభావంతుల జాబితాల్లోని అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదివారం మరోసారి ఆదేశాలు జారీ చేశారు. పొరుగు సేవల కింద పనిచేస్తూ పరీక్షలు రాసిన తమకు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో వెయిటేజీ మార్కులు కలపలేదని ఏఎన్‌ఎంలు ఆదివారం పలుచోట్ల ఆందోళనకు దిగారు. అర్హత మార్కుల్లో రిజర్వేషన్‌ అమలు చేయకపోవడంపై మాజీ సైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


💥 *గ్రామ వార్డ్ సచివాలయ అన్ని పోస్టుల ర్యాంక్  కార్డ్స్ విడుదల

💥రిజల్ట్ ని చూసుకొంటే రిజల్ట్ తో పాటు జిల్లా ర్యాంక్ కనిపిస్తుంది..DOWNLOAD GRAMASACHIVALAYAM RANK CARDS  ఇక్కడ కింది లింక్ ద్వారా చేసుకోండి..                Download.... Rank Card Result

సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కాల్‌ లెటర్‌లో పేర్కొన్న తేదీల్లో వివిధ కారణాలతో వెరిఫికేషన్‌కు హాజరు కాలేకపోయినా, హాజరైనా అన్ని ఒరిజనల్స్‌ చూపలేకపోయినా.. వారికి రెండో ఛాన్స్‌ ఇవ్వాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ జిల్లా సెలక్షన్‌ కమిటీలను ఆదేశించారు. రాత పరీక్షల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఆయా జిల్లాల్లో భర్తీ చేసే పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా సెలక్షన్‌ కమిటీలు షార్ట్‌ లిస్టు జాబితాలు తయారు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. శనివారం శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలతో పాటు మరో రెండు మూడు జిల్లాల్లో షార్టు లిస్టులు విడుదల చేసి, ఎంపికైన అభ్యర్థుల మొబైల్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్, ఈ మెయిల్‌ పద్ధతిలో సమాచారం పంపే కార్యక్రమం మొదలు పెట్టినట్లు తెలిపారు.

షార్ట్‌ లిస్టులో పేరున్న వారు వారి కాల్‌ లెటర్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు చెబుతున్నారు. ఆయా జిల్లాల్లో ఈ నెల 23, 24, 25 తేదీల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏ అభ్యర్థి ఏ రోజు, ఏ ప్రాంతంలో వెరిఫికేషన్‌కు హాజరు కావాలన్నది అభ్యర్థికి పంపే సమాచారంలోనే ఉంటుందని అధికారులు తెలిపారు. వివిధ కారణాలతో నిర్ణీత సమయంలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు çహాజరు కాని వారికి మరో అవకాశం ఇవ్వనున్నారు. అక్టోబరు 2వ తేదీ లోపే ఈ కార్యక్రమం పూర్తి చేయాలని జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. కాగా, షార్ట్‌ లిస్టుల తయారీ, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కార్యక్రమంపై శనివారం పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ జిల్లా సెలక్షన్‌ కమిటీలతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.

అక్టోబరు 14 నుంచి రెండో విడత శిక్షణ
ఎంపికైన వారందరికీ 29వ తేదీలోగా నియామక పత్రాలు అందజేసి, మొదటి విడతలో రెండు రోజులు ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నారు. అక్టోబర్‌ 2న విధుల్లో చేరిన అనంతరం.. అక్టోబరు 14 నుంచి నవంబరు 15 తేదీల మధ్య ఉద్యోగులకు దశల వారీగా రెండో విడత శిక్షణ ఇస్తారు. ఇందు కోసం ఈ నెల 26వ తేదీ నుంచి మాస్టర్‌ ట్రైనర్స్‌కు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

33 శాతం ఉద్యోగాలు మహిళలకు..
సచివాలయ ఉద్యోగ నియామకాల్లో 33 శాతం పోస్టులు మహిళలకు దక్కేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, రోస్టర్‌ ఆధారంగా ప్రతిభ మేరకు మహిళలకు అన్ని కేటగిరీల్లోనూ నిర్ణీత సంఖ్యలో మహిళలకు పోస్టులు రాని పరిస్థితుల్లో వారికి ప్రత్యేకంగా మూడో వంతు పోస్టులు వచ్చేలా అవకాశం కల్పిస్తారు.

సర్టిఫికెట్ల జారీలో ఇబ్బందులు పెట్టకుండా ఆదేశాలు
ఉద్యోగాలకు ఎంపికైన వారికి అవసరమైన సర్టిఫికెట్లను తహసీల్దార్లు వెంటనే జారీ చేసేలా జిల్లా కలెక్టర్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బీసీ అభ్యర్థులు తాజాగా క్రిమిలేయర్‌ సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉందని, వాటితో పాటు అవసరమైన వారికి నివాసిత, కుల ధ్రువీకరణ పత్రాలు జారీలో ఎలాంటి ఇబ్బందులు రానీయవద్దని సూచించింది.

వెరిఫికేషన్‌ సమయంలో అభ్యర్థులు అధికారులకు చూపాల్సిన సర్టిఫికెట్ల వివరాలు..
►అభ్యర్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అనంతరం వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న పత్రం.
►ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌ లేదా అధికారుల నుంచి తీసుకున్న పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం.
►ఒరిజనల్‌ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు.
►నాలుగో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఎక్కడ చదివారన్న వివరాలతో స్టడీ సర్టిఫికెట్లు.
►స్కూలు, కాలేజీల్లో చదవకుండా డైరెక్ట్‌ డిగ్రీ వంటి కోర్సులు చేసిన వారి నివాస ధ్రువీకరణ పత్రం.
►రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ నోటిఫికేషన్‌ మేరకు తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీకి స్థానికత మార్చుకున్నప్పుడు సంబంధిత అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్‌.
►చెవిటి, మూగ వైకల్యంతో ప్రత్యేక స్కూళ్లలో చదువుకున్న వారు.. వారి తల్లిదండ్రుల నివాసిత ధ్రువీకరణ పత్రం.
►బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం.
►బీసీ అభ్యర్థులు తాజాగా తహసీల్దార్‌ జారీ చేసిన నాన్‌ క్రిమిలేయర్‌ సర్టిఫికెట్‌.
►దివ్యాంగ అభ్యర్థులు సదరం క్యాంపుల ద్వారా పొందిన మెడికల్‌ సర్టిఫికెట్‌.
►ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తూ వెయిటేజీ పొంది.. ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారు తమ శాఖాధిపతి నుంచి పొందిన ఇన్‌ సర్వీసు సర్టిఫికెట్‌.
►తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ కాపీ. దీనికి సంబంధించిన నిర్ణీత ఫార్మాట్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

'సచివాలయ' ఉద్యోగాల మెరిట్‌ జాబితా వెల్లడి.. అభ్యర్థుల ర్యాంకులు ఇలా
మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేయాల్సిన అవసరం లేకుండా.. అర్హత మార్కులను తగ్గించి, ఆ మేరకు మార్కులు వచ్చిన వారితో ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది.
హైలైట్స్
వెబ్‌సైట‌్‌ సచివాలయ ఉద్యోగాల మెరిట్‌లిస్ట్‌
సెప్టెంబరు 24, 25 తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెరిట్ జాబితాను ప్రభుత్వం శనివారం (సెప్టెంబరు 21) ప్రకటించింది. రిజర్వేషన్ల ప్రకారం రూపొందించిన అభ్యర్థులు మెరిట్ జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో మెరిట్ జాబితాను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ నెంబర్ల ద్వారా జిల్లాల వారీగా ఆయా పోస్టులకు సంబంధించి ర్యాంకుల వివరాలను తెలుసుకోవచ్చు. మెరిట్‌జాబితాను జిల్లా కలెక్టర్లకు కూడా అందజేశారు. ఎంపికైన అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపనున్నారు. 
Ranks are displayed in Results అనే సూచనను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రభుత్వం ఉంచింది.గ్రామ / వార్డ్ సచివాలయ పరీక్షల మెరిట్ లిస్టులు సిద్ధం...
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల మెరిట్‌ లిస్ట్‌లు సిద్ధం చేశామని మున్సిపల్‌శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. మెరిట్‌ లిస్ట్‌ను జిల్లాల కలెక్టర్లకు పంపినట్లు వెల్లడించారు. ఈనెల 21 నుంచి 23 వరకు ఎంపికైనన అభ్యర్థులకు కాల్‌ లెటర్‌ పంపిస్తామని, అభ్యర్థులకు ఈ-మెయిల్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా కూడా సమాచారం అందుతుందని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలని, ధరఖాస్తులో చెప్పిన అర్హత, కుల ధృవీకరణ, క్రీమిలేయర్‌, నివాస సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.

ఈ నెల 23 నుంచి 25 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని, ఈ నెల 27న అభ్యర్థులకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం 20 బృందాలను ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక ఏ అభ్యర్థి ఎక్కడ ఉద్యోగం చేయాలన్నది నిర్ణయిస్తామని, 60 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేశామని మున్సిపల్‌ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు.

💥 గ్రామ సచివాలయ పరీక్షలు రాసిన ఇన్ సర్వీస్ అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యొక్క సర్వీస్ వెయిటేజీ మార్కులు రిజల్టు లో కలిపి చూపిస్తున్నాయి*
ఒకసారి చెక్ చేసుకోగలరు....
http://gramasachivalayam.ap.gov.in/

http://vsws.ap.gov.in/

http://wardsachivalayam.ap.gov.in/

https://www.rtgs.ap.gov.in/

శనివారం ఉదయం.11గంటలకు జిల్లాల వారీగా ‘సచివాలయ’ పరీక్షల్లో పాసైన వారి జాబితాలు
నేడు, రేపు సరి్టఫికెట్ల స్కాన్డ్‌ కాపీలను అభ్యర్థులు అప్‌లోడ్‌ చేయాలి
23, 24, 25 తేదీల్లో ఒరిజినల్‌ సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌
అపాయింట్‌మెంట్‌ లెటర్ల జారీ బాధ్యత జిల్లా సెలక్షన్‌ కమిటీలదే
అక్టోబర్‌ 1, 2 తేదీల్లో శిక్షణ
అది ముగియగానే రెండో తేదీనే విధుల్లోకి

జిల్లాలకు ప్రతిభావంతుల జాబితా
గ్రామ సచివాలయ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ

గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల్లో ప్రతిభావంతుల జాబితాను జిల్లాలవారీగా శుక్రవారం రాత్రి పంపారు. ఈ మేరకు కలెక్టర్లు తదుపరి ప్రక్రియను పూర్తి చేస్తారు. పోస్టులు, రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్లు, మెరిట్‌ ఆధారంగా అర్హుల జాబితాను కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా ఎంపిక కమిటీ రూపొందించి గ్రామ సచివాలయ వెబ్‌సైట్‌లో పెడుతుంది. జాబితాలోని అభ్యర్థుల మొబైళ్లకు వచ్చే సంక్షిప్త సమాచారం ఆధారంగా శనివారంనుంచి ధ్రువీకరణ పత్రాలను అభ్యర్థులు అప్‌లోడ్‌ చేయాలి.
* అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
* ఉత్తీర్ణులైనవారు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యేలా ఈమెయిల్‌, ఇతరత్రా మార్గాల్లో కేంద్రం చిరునామా, తేదీ, సమయం పేర్కొంటూ కాల్‌లెటర్‌ పంపాలి.
* పోస్టులవారీగా ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారుల నేతృత్వంలో పరిశీలన బోర్డులు ఏర్పాటుచేయాలి. వీటికి సహాయ సంచాలకుడి స్థాయికి తగ్గకుండా నేతృత్వం వహించాలి.
అభ్యర్థులు పాటించాల్సినవి..
* గెజిటెడ్‌ అధికారి సంతకం చేసిన 2 సెట్ల ధ్రువపత్రాలు, 2 పాస్‌పోర్టు సైజు ఫోటోలు అందించాలి.
* గ్రామ, వార్డు సచివాలయం వెెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న దరఖాస్తు, జనన, కుల ధ్రువీకరణ, ఆయా పోస్టులకు నిర్దేశించిన విద్యార్హతల ధ్రువపత్రాలు
* స్థానికత కోసం అవసరమైన పత్రాలు.
* 2014 జూన్‌ 2 నుంచి 2019 జూన్‌ 1 మధ్య కాలంలో తెలంగాణనుంచి ఆంధ్రపదేశ్‌కు వలస వచ్చిన అభ్యర్థులు స్థానికతను నిరూపించే పత్రం.
* అంధులు, వినికిడి లోపమున్న అభ్యర్థులు ప్రత్యేక పాఠశాలల్లో చదివితే సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన తల్లిదండ్రుల నివాస ధ్రువీకరణ.
* దివ్యాంగులైన అభ్యర్థులైతే సదరం ధ్రువీకరణ.
* మాజీ సైనికోద్యోగులు, క్రీడలు, ఎన్‌సీసీ విభాగాల కింద అర్హత సాధించిన వారు సంబంధిత పత్రాలు.

Model call letter for attending to certificate verification to the post of panchayat secretary

Required Documents
1. Two photos, on the rear side of which candidate details shall be given
2. Education Certificates (All Certificates)
3. Community Certificate issued in the last 6 months by the competent authority
4. Original Hall Ticket
5. School Study Certificates 4th to 10th (As mentioned at Column 30 of your Application)
6. Medical Certificates for PH Candidates, issued by competent Board/Authority
a) Medical Certificate for Blind (For VH)
b) Certificate of Hearing Disability and Hearing Assessment (For HH)
c) Medical Certificate in respect of Orthopedically Handicapped Candidates (For OH)
7. Sports quota certificate (In case of candidates selected under sports quota)
8. Ex-servicemen Certificates (In case of Candidates Selected under Ex-Service Men
Quota) issued by competent Unit Head
9. Creamy Layer Certificate (For all BC Candidates)
10. Other Certificates if any mentioned in Application


'సచివాలయ' పరీక్షల అర్హత మార్కులు తగ్గింపు.. ఎప్పుడంటే?

కనీస అర్హత మార్కుల తగ్గింపు ఇప్పుడు లేనట్టే
సాక్షి, అమరావతి: సచివాలయాల ఉద్యోగాల భర్తీ విషయంలో కనీస అర్హత మార్కులు తగ్గింపుపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ‘సాక్షి’కి చెప్పారు. రాతపరీక్షల ఫలితాల వెల్లడి అనంతరం పలు జిల్లాల్లో వివిధ పోస్టుల సంఖ్య కన్నా రాతపరీక్షలలో వివిధ కేటగిరీల్లో కనీస అర్హత మార్కులు సాధించిన వారి సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంగీకరిస్తున్నారు. అయితే, జిల్లాలో భర్తీ చేసే పోస్టుల సంఖ్య కన్నా ఆ జిల్లాలో క్వాలిఫయింగ్‌ మార్కులు వచ్చిన వారు తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలన్న దానిపై 15 రోజుల తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. భర్తీ చేసే ఉద్యోగాలు ఎక్కువ ఉండి, కనీస మార్కులు తెచ్చుకున్న వారు తక్కువగా ఉన్నా ఇప్పుడు అర్హత మార్కులు తెచ్చుకున్న వారికే జిల్లా సెలక్షన్‌ కమిటీలు కాల్‌ లెటర్లు పంపడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఇప్పుడు షెడ్యూల్‌ ప్రకారం భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా వారీగా మిగిలి పోయే పోస్టుల సంఖ్యను సమీక్షించిన తర్వాత, ఆ పోస్టులకు తిరిగి నోటిఫికేషన్‌ జారీ చేయాలా.. లేదంటే ఇప్పుడు జరిగిన రాత పరీక్షల్లో మార్కులను తగ్గించి ఆ పోస్టులను భర్తీ చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తుదినిర్ణయం తీసుకుంటారన్నారు.


పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్ధులు సాధించిన మార్కులు..

--------------------------------------------------
కేటగిరీ           అర్హత సాధించినఅభ్యర్థులు
ఓపెన్ కేటగిరీ    24,583             

బీసీ                 1,00,494

ఎస్సీ                 63,629

ఎస్టీ                 9,458

మొత్తం         1,98,164
----------------------------------------
కేటగిరీ        మార్కులు      '
ఓపెన్ కేటగిరీ 122.5          '
బీసీ                 122.5          '
ఎస్సీ                 114             '
ఎస్టీ.           108             '
-------------------------------------
అక్టోబరు 2న రాష్ట్రవ్యాప్తంగా 788 గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబరు 2 నుంచి రాష్ట్రంలో ప్రారంభంకానున్న మొత్తం 788 సచివాలయాల్లో.. మండలానికి ఒకటి చొప్పున 678 పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఒక్కో వార్డు చొప్పున 110 సచివాలయాలు అందుబాటులోకి రానున్నాయి.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి 8 వరకు రాతపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 1,26,728 ఉద్యోగాలకు గానూ 21,69,814 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 19.74 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల ఫలితాలను సెప్టెంబరు చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఫిర్యాదుల స్వీకరణకు 1902 కాల్‌సెంటర్‌ నెంబరును ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులకు ఏమైనా ఫిర్యాదులుంటే నేరుగా ఈ నెంబరుకు ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు.

పరీక్షలు సాగాయిలా..

సెప్టెంబరు 1న కేటగిరీ-1, కేటగిరీ-3 (డిజిటల్ అసిస్టెంట్) పరీక్షలు నిర్వహించారు.
సెప్టెంబరు 3న వీఆర్వో, సర్వేఅసిస్టెంట్; ఏఎన్‌ఎం/వార్డు హెల్త్ సెక్రటరీ పరీక్షలు నిర్వహించారు.
సెప్టెంబరు 4న విలేజ్ అగ్రికల్చర్ సెక్రటరీ, విలేజ్ హార్టికల్చర్ సెక్రటరీ పరీక్షలు నిర్వహించారు.
సెప్టెంబరు 6న విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, ఏనిమల్ హస్బెండరీ పరీక్షలు నిర్వహించారు.
సెప్టెంబరు 7న కేటగిరీ 2(ఎ) ఇంజినీరింగ్ అసిస్టెంట్/వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, కేటగిరీ-3 విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పరీక్షలు నిర్వహించారు.
సెప్టెంబరు 8న కేటగిరీ 3 వార్డు ప్లానింగ్-రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్-డెవలప్‌మెంట్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్-డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు శానిటేషన్-ఎన్విరాన్‌మెంట్ సెక్రటీ పరీక్షలు నిర్వహించారు.

మొత్తం పోస్టులు ఇలా...


గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి మొత్తం 1,28,589 పోస్టులను ప్రభుత్వం భర్తీచేయనున్నారు. వీటిల్లో గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులకు 10 శాతం వెయిటేజి ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

స్టైఫండ్ రూ.15 వేలు...

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబరు 2న విధుల్లో చేరతారు. నియామకాలు పొందినవారికి రూ.15 వేల స్టైఫండ్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత శాశ్వత పేస్కేలు వర్తింపజేస్తారు. వీరికి రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ అమల్లో ఉంటుంది. వీరికి డీడీఓగా పంచాయతీ సెక్రటరీ వ్యవహరించనున్నారు. పంచాయతీ సెక్రటరీలకే గ్రామ వాలంటీర్లకు వేతనాలు చెల్లించే బాధ్యతను కూడా ప్రభుత్వం అప్పగించింది.

సచివాలయ’ పరీక్ష ఫలితాలు


★ ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదల. 

★ ఫలితాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్. 

★ కేవలం 10 రోజుల్లో ఫలితాలు విడుదల. 

★ 19 రకాల పోస్టులకు 14 పరీక్షలు నిర్వహణ. 

★ ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ.15వేల చొప్పున జీతం ఇవ్వనున్నారు. 

★ ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 30, అక్టోబర్‌ 1న శిక్షణ ఇవ్వనున్నారు.

★ అక్టోబర్‌ 2న అభ్యర్థులు విధుల్లో చేరనున్నారు.

★ పరీక్ష ఫలితాలను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా చూడవచ్చు

Click here to get AP Grama, ward Sachivalayam recruitment results 2019

http://gramasachivalayam.ap.gov.in/

http://vsws.ap.gov.in/

http://wardsachivalayam.ap.gov.in/

https://www.rtgs.ap.gov.in/


డిస్ట్రిక్ట్ టాపర్లు ....లిస్ట్....మార్కులు....

అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. కేవలం 10 రోజుల్లో ఫలితాలు విడుదల చేశారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ మొదటి వారంలో ఎగ్జామ్స్ నిర్వహించారు. 19 రకాల పోస్టులకు 14 పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1, 26, 728 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. 21.5లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 19.74 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ.15వేల చొప్పున జీతం ఇవ్వనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 30, అక్టోబర్‌ 1న శిక్షణ ఇవ్వనున్నారు. అక్టోబర్‌ 2న అభ్యర్థులు విధుల్లో చేరనున్నారు.

అభ్యర్ధులను ఎంపిక చేయటానికి కనీస ఉత్తీర్ణతా మార్కులు

• ఓపెన్ కేటగిరీ అభ్యర్ధులకు 40%
• వెనుక బడిన తరగతులకు చెఇన్దిన వారికి 35%
• ఎస్.సి /ఎస్.టి /వికలాంగులకు 30%

హాజరు అయిన 19,50,630 మంది అభ్యర్ధులలో 1,26,728ఉద్యోగాలకు 198164 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణులయ్యారు

• ఓపెన్ కేటగిరిలో 24583
• బి. సి. కేటగిరిలో 100494
• ఎస్ .సి కేటగిరిలో 63629
• ఎస్. టి .కేటగిరిలో 9458
• వీరిలో పురుషుల 131327. స్త్రీలు 66835 ఉత్తీర్ణులు అయ్యారు

జరిగిన 14 పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్ధులు సాధించిన మార్కులు
• ఓపెన్ కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు
• బి. సి. కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు
• ఎస్.సి కేటగిరిలో అత్యధికంగా 114 మార్కులు సాధించారు
• ఎస్.టి. కేటగిరిలో అత్యధికంగా 108 మార్కులు సాధించారు

మహిళా అభ్యర్దులల్లో గరిష్టంగా 112.5 మార్కులు
పురుష అభ్యర్ధుల్లో గరిష్టంగా 122.5 మార్కులు
ఇన్ సర్వీస్ అభ్యర్ధులకు 10% వెయిటేజ్ మార్కులు విడిగా కలపబడతాయి

పరీక్ష ఫలితాలను ఈ దిగువ సూచించిన గ్రామ సచివాలయము/ఆర్ టి జి.ఎస్ వెబ్ సైట్ నందు అభ్యర్థి హాల్ టికెట్ నెంబరు మరియు పుట్టిన తేది ఆధారంగా తెలుసుకొనవచ్చును.


http://gramasachivalayam.ap.gov.in/

http://vsws.ap.gov.in/

http://wardsachivalayam.ap.gov.in/

https://www.rtgs.ap.gov.in/

ఫలితాల ప్రకటన అనంతరం, అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్‌లను వెబ్ సైట్ నందు అప్లోడ్ చేయవలెను. తరువాత జిల్లా యంత్రాంగం ద్వారా తెలుపబడిన తేదీలలో నిర్ణీత ప్రదేశములకు వెళ్లి వారి సర్టిఫికేట్‌లను తనిఖి చేయించుకోవలెను.

వెరిఫికేషన్ షెడ్యూలు :

•  ఫలితాల విడుదల 19.09.2019
•  సర్టిఫికేట్‌ లను వెబ్ సైట్ నందు అప్లోడ్ 21.09.2019 నుండి
•  కాల్ లెటర్ పంపిణి 21.09.2019 – 22.09.2019
•  తనిఖీ జరిగే తేదీలు 23- 25 సెప్టెంబర్ 2019
•  నియామక ఉత్తర్వుల జారి 27.09.2019
•  అవగాహనా కార్యక్రమం 1&2 అక్టోబర్ 2019
•  గ్రామ/వార్డు సచివాలయ ప్రారంభం 02.10.2019

4 comments:

 1. I am working in SSA since 8 years this service is consider or not plz help me no contact available to contact apsc

  ReplyDelete
 2. Dear sir
  did not provided job chart for Ward education & Data processing secretary

  ReplyDelete
 3. can you provide job chart for Ward education & Data Processing secretary

  ReplyDelete

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top