ఇక ఏటా డీఎస్సీ
జనవరిలో పరీక్ష క్యాలెండర్ విడుదల
కొత్త పద్దతులలో 1.80లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
బాపట్ల, న్యూస్టుడే: ఇక ఏటా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా బాపట్లలో ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండ్రోజుల జాతీయ సెమినార్ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనవరిలో డీఎస్సీ పరీక్ష క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. మహాత్మాగాంధీ కలలు కన్న ‘విలువలతో కూడిన విద్య’ అందించేందుకు విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విద్యార్థులపై ఒత్తిడి రహితంగా సరికొత్త పద్ధతుల్లో బోధన చేసేలా 1.80 లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని మంత్రి ప్రకటించారు.

0 comments:
Post a comment