Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Saturday, 14 September 2019

Burgula Ramakrishna Rao( March 13 1899 -sep 14,1967)-బూర్గుల రామకృష్ణారావు-స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి.

Burgula Ramakrishna Rao(  March 13 1899 -sep 14,1967)
Dr. Burgula Ramakrishna Rao was the first elected Chief Minister of the erstwhile Hyderabad State. Prior to the independence of India and the political integration of the princely states into the Union, he was among the Telugu-speaking leaders to resist the Nizam in the princely state of Hyderabad
బూర్గుల రామకృష్ణారావు 1899 మార్చి 13వ తేదీన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి తాలూకాలో ఉన్న పడకల్లు గ్రామంలో అమ్మమ్మ గారింట్లో పుట్టారు. వీరి ఇంటి పేరు 'పుల్లంరాజు'. వీరి స్వగ్రామం బూర్గుల, నేటి షాద్‌నగర్‌. అయితే వీరు మహారాష్ట్రలో చదువుకొనే రోజులలో అక్కడి ఆచారం మేరకు ఊరు పేరు ఇంటిపేరుగా పెట్టుకోవడం వల్ల బూర్గుల అన్నది వారి ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. ప్రాథమిక విద్య ముగియగానే హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి ధర్మవంత్‌ పాఠశాలలో, ఎక్సెల్షియల్‌ స్కూల్‌లో చేరి ఉన్నత పాఠశాల విద్యను కొనసాగించారు. 1915లో బొంబాయి విశ్వవిద్యాలయం మెట్రిక్‌ పరీక్ష పాసై, హైదరాబాద్‌ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తరువాత పూణెలోని ఫెర్గూసన్‌ కాలేజీలో బీఏ ఆనర్సు చదివి, దానిలో కూడా మొదటి శ్రేణి తెచ్చుకొన్నాడు. ఆ పిదప బొంబాయి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందాడు. అనంతరం బారిష్టర్‌ ఆస్గర్‌ దగ్గర జూనియర్‌గా చేరి 1925లో న్యాయవాద వృత్తి చేపట్టాడు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, పారసీ, మరాఠీ, కన్నడ భాషలలో ప్రావీణ్యం గడించి, అష్టభాషా విశారదుడు అనిపించుకున్నారు. అందువల్లనేనేమో కొంతకాలం 'అంజుమాన్‌ ఇస్లామియా హైస్కూల్‌'లో పర్షియన్‌ అధ్యాపకుడిగా పని చేశాడు.
న్యాయవాద వృత్తిని చేపట్టిన తరువాత సివిల్‌, క్రిమినల్‌ కేసులను వాదించి సమర్థుడైన న్యాయవాదిగా అనతికాలంలోనే పేరు సంపాధించుకున్నాడు. ఆనాటి హైదరాబాద్‌ సంస్థానంలో అధికార భాష ఉర్దూ అయినందువల్ల న్యాయస్థానాల్లో వకీళ్లు ఉర్దూ భాషలోనే వాదించవలసి ఉండేది. ఇటు బ్రిటిషు ప్రభుత్వ పరిధిలోని సికింద్రాబాద్‌, బ్రిటిషు రెసిడెంట్‌ నివాస ప్రాంతమైన సుల్తాన్‌బజార్‌, కోఠి ప్రాంతాలలోని బ్రిటిషు వారి కోర్టులలో వాదనలు ఇంగ్లీషులో కొనసాగేవి. బూర్గుల వారికి ఉర్దూ, ఇంగ్లీషు భాషలపై మంచి పట్టు ఉండడం వల్ల ఇటు నిజాం కోర్టులలో, అటు బ్రిటిషు కోర్టులలో ఆయా భాషలలో వాదించడంలో దిట్ట అనిపించుకున్నాడు. ప్రజాసేవా రంగంలో పనిచేసే సామాజిక కార్యకర్తలపై ప్రభుత్వం కక్షతో తప్పుడు కేసులు బనాయించి, కోర్టులకు లాగితే బూర్గుల వారు వారికి మద్దతుగా నిలిచి, వాదించి గెలిపించే వాడు. రామకృష్ణారావు మక్తేదారు జమీందారీ కుటుంబానికి చెందినవాడు. హైదరాబాద్‌ సంస్థానంలో జాగీర్దారులు, మక్తేదారులు, దేశముఖులు, దేశపాండ్యాలు గ్రామాలను, పొలాలను ఆక్రమించుకొని నైజాం నవాబుకు కొంత రుసుం చెల్లిస్తూ, తమ తమ ప్రాంతాలలో సర్వాధికారాలు చెలాయిస్తుండేవారు. అభ్యుదయ భావాలు గల బూర్గుల వారికి జమీందారీ పెత్తనాలు నచ్చలేదు. ప్రజాస్వామిక పద్ధతుల వైపు ఆకర్షితులైన ఆయన తొలినాళ్లలో ఆనాటి రాజకీయాలలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1916లోనే కొందరు యువకులతో కలిసి 'హైద్రాబాద్‌ యంగ్‌ మెన్స్‌ యూనియన్‌' స్థాపించి, దానికి కార్యదర్శిగా పని చేశారు. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభలో పాల్గొన్న జాతీయ నాయకుల ప్రసంగాలను బూర్గులవారు తెలుగులోకి అనువాదం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సమావేశంలో ఒక శాసనంపై వాదోపవాదాలు జరిగాయి. దాని మీద బూర్గుల వారు ఒక తీర్మానం రాసి సరోజినీనాయుడుకు పంపాడు. దీనిని పైస్థాయి వారు పరిశీలించి ఏకగ్రీవంగా ఆమోదించారు. దీనితో ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. హైదరాబాద్‌లో అఖిల భారత కాంగ్రెసు శాఖ ఉండేది. ఖద్దరు ప్రచారం, అస్పృశ్యతా నివారణ, సంఘ సామరస్యం వంటి అంశాలతో ఇది పని చేస్తూ ఉండేది. 1924లో జరిగిన నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమం, గ్రంధాలయోద్యమం, స్వదేశీ సంస్థానాల ప్రజల సమాఖ్యలలో బూర్గుల వారు ముఖ్యపాత్ర పోషించారు.

1931లో దేవరకొండలో జరిగిన ఆంధ్ర మహాసభకు ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆంధ్ర మహాసభ పరోక్షంగా రాజకీయ సభయే. బూర్గుల వారు ఆనాటి కాంగ్రెసు సిద్ధాంతాలను నమ్మినవారు. అందుకే ఆయన ఖద్దరు వస్త్రధారి అయ్యారు. 1930-40ల మధ్య నిజాం రాష్ట్రంలో తలెత్తిన ముల్కీ ఉద్యమ సమయంలో స్థానికులైన హిందూ, ముస్లింలు కలిసి బయటి నుంచి వచ్చిన వారి ఆధిపత్యాన్ని తిప్పికొట్టడానికి 'అంజుమనే జమీయత్‌ నిజాం' అన్న సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి బూర్గుల వారు కార్యదర్శిగా పనిచేశారు. 1937లో రాజ్యాంగ సంస్కరణల స్వరూపాన్ని సూచించడానికి 'హైదరాబాద్‌ ప్రజా పక్ష పరిషత్‌' ఏర్పడింది. దీనికి బూర్గుల వారు కార్యదర్శిగా ఉన్నారు. 1938లో హైదరాబాద్‌ సంస్థానంలోకి ప్రవేశించరాదని జయప్రకాష్‌ నారాయణ్‌ రాకను నిజాం ప్రభుత్వం నిషేధించింది. ఆ తరుణంలో ప్రభుత్వ ఆంక్షలను ధిక్కరించి రామకృష్ణారావు జైలుకు వెళ్లారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినా హైదరాబాద్‌లోని రజాకారు ప్రభుత్వం భారతదేశంలో విలీనం కావడానికి ఇష్టపడలేదు. ఆ సమయంలో హైదరాబాద్‌లోని బేగంబజారు ప్రాంతంలో జరిగిన ఒక రాజకీయ సభలో ప్రసంగించినందుకు గాను బూర్గుల వారికి కారాగార శిక్ష పడింది. జైలు నుంచి బయటికి రాగానే ఆయన మద్రాసు వెళ్లి అక్కడ కాంగ్రెసు ప్రచార కార్యక్రమాలలో విరివిగా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సంగ్రామ కాలంలో నిజాం ప్రభుత్వం బూర్గుల వారికి హైకోర్టు జడ్జి పదవి కానీ, న్యాయశాఖ మంత్రి పదవి కానీ ఇవ్వజూపింది. కానీ అవి ప్రజా ప్రభుత్వ పదవులు కానందువల్ల ఆయన స్వీకరించలేదు.

1950 జూన్‌లో వెల్లోడి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులలో బూర్గుల వారు ఒకరు. వీరు ఆ కాలంలో రెవెన్యూ శాఖామంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. కౌలుదారుల శాసనం, భూకమాతాల గరిష్ట శాసనం వంటివి తీసుకొచ్చారు. 1951-52 ఎన్నికల తరువాత రాష్ట్రంలో తొలిసారిగా ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పుడు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. పూర్వం నుంచే బూర్గుల వారిపై నెహ్రూ, సర్దార్‌ వల్లభారుపటేళ్ల అభిమానం ఉన్నది. ముఖ్యమంత్రిగా నాలుగేండ్లు పరిపాలనా బాధ్యతను సక్రమంగా నిర్వహించారు. 150 ఏండ్లు ఇక్కడ ఉర్దూ అధికార భాషగా ఏలుతుంటే బూర్గులవారు ఒక్క కలం పోటుతో సెకండరీ విద్యాస్థాయిలో తెలుగు, మరాఠీ, కన్నడ భాషలను, విశ్వవిద్యాలయ స్థాయిలో ఇంగ్లీషును బోధనా భాషగా ప్రవేశపెట్టారు. అందుకు అనాడు ఎక్కడా వ్యతిరేకత తలెత్తలేదు. ఆయన ఎంతటి రాజకీయ దురంధరులో అంతటి సాహిత్య కోవిదులు. సనాతన విలువల పట్ల ఎంతటి గౌరవమో, ఆధునిక భావాల పట్ల అంతే ఆధరణ కనబరిచే అభ్యుదయవాది. అనాడు సంప్రదాయ వాదులంతా 'ఎంకి' పాటల పట్ల దుమారం రేపుతుంటే బూర్గులవారు నండూరి వారికి అండగా నిలిచారు.
సాహిత్య సదస్సులలో అత్యంత ఆసక్తితో పాల్గొనేవారు. కవి సమ్మేళనాలు, సారస్వత సమావేశాలు, ముషాయిరాలు నిర్వహించి కవి పండితులను సత్కరించేవారు. ఈనాటి రాజ్‌భవన్‌ ఆనాటి వారి అధికార నివాసంగా ఉండేది. అక్కడి సభా మందిరంలో ఆనాడు డా|| సి.నారాయణరెడ్డి రచించిన 'నాగార్జున సాగరం' కావ్యగాన సభ జరిపించారు. వారు స్వయంగా కవి పండితులు. ఆయన రాసిన వ్యాసాలలో 'కాకునూరి అప్పన్న కవి జన్మస్థానం, రెడ్డి రాజుల కాలపు సంస్కృతులు అన్న వ్యాసాలు ముఖ్యమైనవి. సూఫీ కవులపై ఆయన అనేక వ్యాసాలు రచించారు. ఆ పద్యాలు ఆనాటి 'భారతి' పత్రికలో ప్రచురితమై ఆయనకు విశేష ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టాయి. 'సారస్వత వ్యాస ముక్తావళి', 'ఉర్దూ భాషా సారస్వతములు', 'పండిత రాజ పంచామృతం', 'కృష్ణ శతకం', 'వేంకటేశ్వర సుప్రభాతం' (తెలుగు, సంస్కృతం), 'ఉమర్‌ఖయ్యాం' (పర్షియన్‌ నుంచి తెలుగు అనువాదం), 'సూఫీ సర్మద్‌' (పర్షియన్‌, తెలుగు), 'కనక ధారాస్తవం', 'సౌందర్య లహరి' వంటి రచనలు వీరి కలం నుంచి జాలువారినవే. దాశరథి తన 'మహాబోధి' కావ్యాన్ని వీరికి అంకితం చేశారు. ఆయన పూనిక వహించి 1926లో 'శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం' రజతోత్సవాలు, 1951లో స్వర్ణోత్సవాలు ఘనంగా జరిపించారు. ఆయన విమర్శలను, ప్రశంసలను సమంగా స్వీకరించే స్థితప్రజ్ఞుడు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత ఆయన ఆరు సంవత్సరాలు ఉత్తరప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల గవర్నరుగా, 1966లో నాలుగేండ్లు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఇంకా ఆయన అనేక సాహితి, సాంస్కృతిక సంస్థలకు అధ్యక్షులుగా సేవలందించారు. 1964లో భారతీయ విద్యాభవన్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ప్రజ్ఞాధురీణతకు ప్రశంసగా ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశాయి. తమ బహుభాషా వైదుష్యం చేత శాసనసభలో ఎవరు ఏ భాషలో మాట్లాడినా వారికి ఆ భాషలోనే సమాధానం ఇచ్చేవారట. బూర్గుల రామకృష్ణారావు 1967 సెప్టెంబర్‌ 14న కన్నుమూశారు. ఆయన సేవానిరతి, సాహితీ ప్రగతి చరిత్రలో నిలిచిపోయింది.

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top