Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Sunday, 15 September 2019

అనీ బిసెంట్‌…(అక్టోబరు 1, 1847- సెప్టెంబరు 20, 1933) -ప్రముఖ బ్రిటిష్‌ సామ్యవాది, బ్రహ్మ జ్ఞానవాది, మహిళాహక్కుల ఉద్యమవాది

Annie Besant was a British socialist, theosophist, women's rights activist, writer, orator, educationist, and philanthropist. Regarded as a champion of human freedom, she was an ardent supporter of both Irish and Indian self-rule. She was a prolific author with over three hundred books and pamphlets to her credit.As an educationist, her contributions included the founding of the Banaras Hindu University.

అనీ బిసెంట్‌… ప్రముఖ బ్రిటిష్‌ సామ్యవాది, బ్రహ్మ జ్ఞానవాది, మహిళాహక్కుల ఉద్యమవాది, రచయిత, వాక్పటిమ కలిగిన స్త్రీ. ఈమె భారతీయ, ఐరోపా స్వరాజ్యపోరాటానికి మద్దతు ఇచ్చింది. ఆమెకు తన 19వ సంవత్సరంలో ఫ్రాంక్‌ బిసెంటుతో వివాహం జరిగింది. అయినప్పటికీ ఆమెకు భర్తతో మతపరమైన విభేదాలు కలిగిన కారణంగా ఇరువురు విడిపోయారు. తరువాత ఆమె జాతీయ సామ్యవాద సంఘానికి ప్రముఖ ఉపన్యాసకురాలుగా వ్యవహరించింది. ఆమెకు చార్లెస్‌ బ్రాడ్‌ లాఫ్‌తో సన్నిహిత మైత్రి కుదిరింది.

1887లో వారిరువురు రచయిత చార్లెస్‌ నోల్టన్‌ పుస్తకం బర్త్‌ కంట్రోల్‌ ప్రచురణ విషయంలో విచారణను ఎదుర్కొన్నారు. ఈ అపకీర్తి వారికి ప్రాబల్యం కలిగించింది. 1880లో బ్రాడ్‌లాఫ్‌, నార్తాంప్టన్‌ నియోజకవర్గ పార్లమెంట్‌ సభ్యుడుగా ఎన్నికైయాడు. 1980లో అనీ బిసెంట్‌ హెలెనా బ్లావట్‌స్కీని కలుసుకున్న తరువాత ఆమె ఆసక్తి సామ్యవాదం నుండి దివ్యజ్ఞానం వైపు మళ్ళింది. ఆమె దివ్యజ్ఞానం సమాజంలో సభ్యత్వం స్వీకరించి, ఉపన్యాసకురాలిగా విజయం సాధించింది.

దివ్యజ్ఞాన సమాజం సభ్యురాలిగా బాధ్యతలలో భాగంగా ఆమె భారతదేశం వచ్చింది. 1898లో కేంద్రీయ హిందూ కళాశాల స్థాపనకు సహకరించింది. 1902లో అమె కో-ఫ్రీమసోంరీ లీ డ్రాయిట్‌ హ్య్జమన్ను ఇంగ్లాండులో స్థాపించింది. తరువాత కొద్ది సంత్సరాలలో ఈ తరహా నిర్మాణాలు బ్రిటన్‌ సామ్రాజ్యమంతటా ఆమె చేత స్థాపించబడ్డాయి. 1907లో ఆమె దివ్యజ్ఞానసమాజం అధ్యక్షురాలైంది. ఆమె భారతీయ రాజకీయాలలో కూడా ప్రవేశించి, భారతీయ జాతీయ కాంగ్రెస్‌లో సభ్యురాలైంది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయిన సమయంలో ఆమె హోం రూల్‌ లీగ్‌ స్వాతంత్రోద్యమానికి సహకరించింది. 1917లో ఆమె భారతీయ జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలైంది.

యుద్ధానంతరం ఆమె భారతీయ స్వాతంత్య్ర పోరాటం, దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమాలను 1933లో ఆమె మరణించే వరకు కొనసాగించింది. అనీ వుడ్‌ బిసెంట్‌… ఈమె ఒక ఐర్లాండ్‌ ఐరిష్‌ జాతి మహిళ. లండనులోని క్లఫామ్లో, అక్టోబరు 1, 1847న జన్మించింది. సెప్టెంబరు 20, 1933న తమిళనాడులోని అడయారులో మరణించింది. ఈమె దివ్యజ్ఞాన తత్వజ్ఞి, మహిళల హక్కుల ఉద్యమకారిణి, రచయిత, వక్త. ఈమె ఐర్లాండ్‌, భారతదేశపు స్వాతంత్య్రం, స్వయంపాలన కొరకు పోరాడినది. ఈమె స్వయం పాలన ఉద్యమం స్థాపించినది. తల్లి ధార్మిక స్వభావి. తండ్రి డాక్టర్‌ విలియం ఫేజ్‌ గొప్ప విద్వాంసుడు.

1867 డిసెంబరులో తన తల్లి కోరికమేరకు ఫాదర్‌ ఫ్రాంక్‌ బిసెంట్ని అనిబిసెంట్‌ వివాహమాడారు. అంతవరకూ అనీగా పిలవబడిన ఆమె వివాహంతో అనీ బిసెంట్గా మారింది. ఈమె 1874లో ఇంగ్లాడులోని నేషనల్‌ సెక్యులర్‌ సొసైటీ అనే సంస్థలో చేరింది. లా అండ్‌ రిపబ్లిక్‌ లీగ్ని స్థాపించి పోలీసు అత్యాచారాలకు బలైన కుటుంబాలకు సేవచేసింది. భారతదేశంలోని దివ్యజ్ఞాన సమాజం ఆహ్వానం మేరకు భారతదేశానికి వచ్చింది. మే యూనియన్ని స్థాపించి కార్మికులకోసం పోరాడింది. 1898 జులై 7న బనారస్లోని ఒక చిన్న ఇంట్లో తాను కలలుగన్న విద్యాసౌధాన్ని ప్రారంభించి, దానిని అలహాబాదు విశ్వవిద్యాలయపు సంస్థగా పేర్కొనినది. బాలగంగాధర తిలక్‌ 1895లో ప్రస్తావించిన స్వయంపాలనను 1914లో అనీ బిసెంట్‌ కార్యరూపంలో పెట్టేందుకు ప్రజల్ని సంసిద్ధులను చేయసాగింది.

దీనికి సంబంధించిన కామన్‌ వెల్త్‌ అనే వార పత్రికను ఆమె ప్రారంభించినది. 1915లో ఈమె హౌ ఇండియా ఫాట్‌ ఫర్‌ ఫ్రీడంఅనే పుస్తకాన్ని రాసింది. భారతదేశ స్వాతంత్య్రాన్ని గురించి వివరించినది. ఈమె రచించిన లెక్చర్‌ ఆన్‌ పొలిటికల్‌ సైన్స్‌ పుస్తకంలో పాశ్చాత్య, భారతీయ రాజకీయ వ్యవస్థల గురించి పరిష్కృతం కాగలిగే సూచనలను ఇచ్చినది. 1917లో అనీ బిసెంట్‌ ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియమించబడింది. ఎన్నోరకాల ప్రాతిపదికలతో జాతీయ విద్యా ప్రణాళికను రూపొందించించినది. న్యూ ఇండియా అనే దినపత్రిక ఈమెదే. ఇండియన్‌ బాయ్స్‌ స్కౌట్‌ అసోషియేషన్‌ ను స్థాపించినది. ఈమెకు 1921లో కాశీ హిందూవిశ్వవిద్యాలయం డాక్టర్‌ ఆఫ్‌ లెటర్స్‌ బిరుదునిచ్చి సత్కరించినది. 80సంవత్సరాల వయసులో బుడాపెస్ట్‌ యూరోపియన్‌ కాంగ్రెస్‌, చికాగో ప్రపంచ కాంగ్రెస్‌ కు అధ్యక్షత వహించినది.1933 సెప్టెంబర్‌ 20న ఆమె తుదిశ్వాస విడిచినది.

అనీ బిసెంట్‌ 1847లో లండన్‌లో ఐరోపా సంతతి వారైన ఒక మధ్యతరగతి దంపతులకు జన్మించింది. తన వారసత్వానికి గర్వించే ఆమె యువజీవితంలో ఐరోపా స్వతంత్ర రాజ్యానికి మద్దతు తెలియజేస్తుంది. ఆమెకు ఐదు సంవత్సరాల వయసులో ఆమె తండ్రి కుటుంబాన్ని పేదరికంలో వదిలి మరణించాడు. ఆమె తల్లి హారో స్కూల్‌ బాలల వసతిగృహం నిర్వహణ చేస్తూ, కుటుంబ పోషణ భారం వహించింది. అయినప్పటికీ ఆమె అనీ బిసెంట్‌కు సరైన సహకారం అందించ లేక ఆమె స్నేహితురాలైన మారియెట్‌కు ఆమె సంరక్షణ భారం అప్పగించింది. మారియెట్‌ అనీ బిసెంట్‌కు మంచి విద్యాభ్యాసం అందిస్తానని మాట ఇచ్చింది. ఆమె అనీ బిసెంట్‌కు సమాజం పట్ల బాధ్యత మరియు స్త్రీస్వాతంత్య్రత యొక్క అవశ్యకత పట్ల అవగాహన కల్పించింది. యువప్రాయంలోనే ఆమె ఐరోపా అంతా పర్యటించింది.

అక్కడ ఆమెకు రోమన్‌కాథలిక్కు మతం పట్ల కలిగిన అభిరుచి ఆమెను ఎప్పటికీ వదిలి పెట్టలేదు. 1867లో ఆమె క్లర్జీ కి చెందిన 26 సంవత్సరాల ఫ్రాంక్‌ బిసెంట్‌ను వివాహం చేసుకున్నది. ఆయన వాల్టర్‌ బిసెంట్‌ తమ్ముడు. ఆయన ఒక క్రైస్తవ మతవిశ్వాసి. అనీ బిసెంట్‌ ఆయనతో తన ఆలోచనలు పంచుకున్నది. వివాహం అయిన సాయంత్రం ఆమెనుకలుసుకున్న మిత్రులు ఆమె తీవ్రంగా రాజకీయాలలో పాల్గొనేలా చేసారు. నగరంలోని పేద సమాజానికి చెందిన ఆంగ్లేయులు మరియు ఐరోపా వారితో సంబంధాలు ఏర్పడడానికి ఆ మిత్రులే కారణం అయ్యారు. త్వరగానే ఫ్రాంక్‌ లింకన్‌ షైర్‌ లోని సిబ్సే ప్రీస్ట్‌ అయ్యాడు. అనీ తన భర్తతో సిబ్సే కు మకాం మార్చుకున్నది. తరువాత కొంత కాలానికి వారికి ఆర్తర్‌ మరియు మాబెల్‌ అనే పిల్లలు పుట్టారు. ఏది ఏమైనా వివాహ జీవితం భగ్నమైంది.

మొదటి వివాదం ధనం మరియు అనీ స్వాతంత్య్రం విషయంలో మొదలయింది. అనీ పిల్లల కోసం చిన్న కథలు, పుస్తకాలు మరియు వ్యాసాలు రచించింది. వివాహిత అయిన స్త్రీకి చట్టరీత్యా ధనం మీద అధికారం లేదు కనుక అన్నీ సంపాదించిన ధనాన్ని ఫ్రాంక్‌ తీసుకున్నాడు. దంపతులను రాజకీయాలు మరింత వేరు చేసాయి. అనీ, సంఘాలుగా ఏర్పడి పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి పోరాటం సాగిస్తున్న తోటపనివారికి అండగా నిలిచింది. ట్రాయ్‌ సభ్యుడైన ఫ్రాంక్‌ భూస్వాముల వైపు నిలిచాడు. వివాదాలు తారస్థాయికి చేరుకోగానే అనీ, భర్తను తిరిగి కలుసుకోవడానికి నిరాకరించింది.

1873 నాటికి ఆమె భర్తను విడిచి లండనుకు తిరిగివెళ్ళింది. చట్టరీత్యా వారు విడిపోగానే అనీ తన కుమార్తె బాధ్యతను తీసుకున్నది. బిసెంట్‌ ఆమె విశ్వాసాన్ని తనకుతానే ప్రశ్నించుకుంది. ఆమె ఇంగ్లండ్‌ చర్చి కాథలిక్‌ శాఖ నాయకుడైన ఏడ్వర్డ్‌ బివరీ పుసె ని కలుసుకుని సలహా అడిగింది. ఆమె తన ప్రశ్నకు సమాధానం తెలియజేయగల పుస్తకాలను చెప్పమని ఆయనను అడిగినప్పుడు ఆయన ఇప్పటికే నీవు చాలా చదివావు అని చెప్పాడట. ఆమె చివరిసారిగా ఫ్రాంకును కలుసుకుని చివరిసారిగా వివాహ జీవితం చక్కదిద్దడానికి విఫలప్రయత్నం చేసి చివరికి లండను విడిచి పెట్టింది. అనీ బిసెంట్‌ బ్రిక్‌బెక్‌ లిటరరీ అండ్‌ సైటిఫిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ పార్ట్‌-టైం విద్యాభ్యాసం ఆరంభించింది.

అక్కడ ఆమె మతవిశ్వాసం మరియు రాజకీయాలు రేపిన అలజడి కారణంగా ఇన్‌స్టిట్యూషన్‌ గవర్నర్‌ ఆమె పరిక్షా ఫలితాలను ఇవ్వడానికి నిరస్కరించింది. అనీ బిసెంట్‌ తన ఆలోచనలు సరిఅయినవని విశ్వసించి, వాటి కొరకు పోరాటం సాగించింది. ఆలోచనా స్వాతంత్య్రం, స్త్రీహక్కులు, సామ్యవాదం, సంతాన నిరోధం, ఫాబియన్‌ సోషలిజం మరియు శ్రామికుల హక్కుల కొరకు పోరాటం కొనసాగించింది. ఫ్రాంక్‌ వివాహరద్దును తేలికగా తీసుకోలేక పోయాడు. ఆ కాలంలో వివాహరద్దు అన్నది మధ్యతరగతి జీవితాలను అంతగా చేరుకోలేదు. అన్నీ తన మిగిలిన జీవితంలో బిసెంట్‌ గానే మిగిలి పోయింది. ప్రారంభంలో ఆమె తన ఇద్దరు పిల్లలతో సత్సంబంధాలను కలిగి ఉంది. మాబెల్‌ ఆమెతోనే ఉంది. ఆమెకు భర్త నుండి స్వల్పంగా భరణం అందుతూ వచ్చింది.

అనిబిసెంట్‌ రచించిన ' లెక్చర్‌ ఆన్‌ పొలిటికల్‌ సైన్స్‌ 'పుస్తకంలో పాశ్చాత్య, భారతీయ రాజకీయ వ్యవస్థల గురించి పరిష్క తం కాగలిగే సూచనలను ఇచ్చారు. ఎన్నోరకాల ప్రాతిపదికలతో జాతీయ విద్యా ప్రణాళికను రూపొందించారు. ఇండియన్‌ బార్సు స్కౌట్‌ అసోషియేషన్‌ స్థాపించారు. 1921లో కాశీ హిందూవిశ్వవిద్యాలయం డాక్టర్‌ ఆఫ్‌ లెటర్స్‌ బిరుదునిచ్చి సత్కరించింది. 80సంవత్సరాల వయసులో బుడాపెస్ట్‌ యూరోపియన్‌ కాంగ్రెస్‌, చికాగో ప్రపంచ కాంగ్రెస్‌ కు అధ్యక్షత వహించారు. 1933 సెప్టెంబర్‌ 20న తమిళనాడు లోని అడియార్‌లో ఆమె మరణించారు

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top