Anandavedika Daily programmes Date 05/9/2019 -ఆనంద వేదిక రోజు వారి కార్యక్రమాలు....తేదీ : 5/9/2019 గురువారం,1 నుంచి 10 తరగతుల కార్యక్రమాలు.
ఆనందవేదికకు స్వాగతం
Dr. ఉమాగాంధి గారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ అందుకుంటున్న శుభ సందర్భం లో వారికి శుభాకాంక్షలు....
**************************
తేది : 5 9.2019 గురువారము
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః
అందరికీ...గురుపూజోత్సవ శుభాకాంక్షలు
ఆనందవేదిక మాడ్యూల్సు..మన
పాఠశాలలకు ఈ..వారంలో...
అందనున్నాయి..అందువల్ల ఈరోజునుండి తరగతివారీ కథలను పరిచయం చేయడం జరిగింది.
ఆనందవేదిక గురువారం కార్యక్రమములో...
కథలో రెండవరోజుకు స్వాగతంతో...
1వ లెవెల్ కథ.. పూరీలు
************************
ఉద్దేశ్యము....విద్యార్థులలో పంచుకోవడం మరియు కృతఙ్ఞతాభావం పెంపొందించడం
2వ లెవెల్ కథ.. మాడిన రొట్టె.
***************************
ఉద్దేశ్యము..చేసే పనియొక్కవిలువ ఉద్దేశ్యము దాని ప్రాముఖ్యతను గమనించుట.
ఈరోజు 1-2- లెవెల్స్ వారు ఈక్రింది విధంగా కథ లో రెండవరోజు కార్యక్రమాన్ని అనుసరించాలి
ఏకాగ్రతసాధన:
************
3 నిమిషాలు చేయించాలి.
ఇందులో...
* కళ్ళుమూసుకుని కొన్ని సాధారణమైన శ్వాసలు తీసుకోమనాలి.
* అలాగే సాధారణ శ్వాసలు కొనసాగించ మనాలి.
* కొన్ని దీర్ఘ శ్వాసలు తీసుకోమనాలి.
* దీర్ఘ శ్వాసలు కొనసాగించమనాలి.
* తిరిగి సాధారణ శ్వాసను తీసుకొని పరిసరాలు గమనిస్తూ..కళ్ళు తెరవమనాలి.
తరువాత
1-2 లెవెల్స్ వారికి ముందురోజు ఉపాధ్యాయుడు మాడ్యూల్ లో కథను రెండవరోజు విద్యార్థులతో చెప్పించాలి...విద్యార్థులందరూ..
ఆరోజుచెప్పగలిగేవిధంగా..
ఉపాద్యాయుడు .సంసిద్ధం చేయాలి ఇందులో...అందరు విద్యార్థులు పాల్గొనేలా..చూడాలి.
సమయం 30 నిమిషాలు కేటాయించాలి
1-వ లెవెల్ అనగా"1మరియు 2వ తరగతులు ' పూరీలు "అనే కథను
2 వ లెవెల్ అనగా 3.4.మరియు 5వ తరగతి వారు "మాడిన రొట్టె" కథను విద్యార్థులు చెప్పాలి విద్యార్థులు తన సొంతమాటలలో..హావభావాలతో
మాడ్యూల్ లో ఉన్న కథలను చెప్పాలి
కథను చెప్పడం పూర్తి చేసాక.ఇంటి వద్ద విద్యార్థి కథ ద్వారా నేర్చుకున్న అంశాలు స్నేహితుల అభిప్రాయాలు
ముందురోజు జరిగిన చర్చ లోప్రశ్నలను..లేదా ఇంటి వద్ద కథపై చర్చించిన అభిప్రాయాలను తరగతిగదిలో ప్రస్తావించవచ్చు.
విద్యార్థులందరూ..ఇందులో పాల్గొనేలా.. .చూడాలి
చివరగా ...మౌన ప్రక్రియ:
విద్యార్థులందరిని .. 2 నిమిషాలు
కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పాలి
ధన్యవాదాలతో...
ఆనందవేదిక
0 Comments:
Post a Comment