Ananda vedika Daily programmes Date 7/9/2019 -ఆనంద వేదిక వేదిక కార్యక్రమాలు....తేదీ : 7/9/2019 , శనివారం, 1 నుంచి 10 తరగతుల కార్యక్రమాలు.
Ananda vedika Time table -ఆనంద వేదిక మొదటి పీరియడ్ లో టైం షెడ్యూల్ / టైం టేబుల్- ఆనంద వేదిక మాడ్యూల్స్ డౌన్లోడ్ చేసుకోండి.....IMP
Ananda vedika Time table -ఆనంద వేదిక మొదటి పీరియడ్ లో టైం షెడ్యూల్ / టైం టేబుల్- ఆనంద వేదిక మాడ్యూల్స్ డౌన్లోడ్ చేసుకోండి.....IMP
Level 1 (1/2 classes )and Level 2 (3/4/5 Classes)
ఆనంద వేదికకు స్వాగతం🙏🏼
*****************************
🎂 భావవ్యక్తీకరణ🎂
*****************************
1వ లెవెల్ -కృతజ్ఞతాభావం
2 వ లెవెల్-కృతజ్ఞతాభావం
****************************
శని వారం
తేదీ 7.9.2019
*********************
ముందుగా ..ఏకాగ్రత ప్రక్రియ.3 నిమిషాలు చేయించాలి.
* సాధారణ శ్వాస తీసుకోవాలి.
* సాధారణ శ్వాసలు కొనసాగించాలి.
* దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి.
* దీర్ఘ శ్వాసలు కొనసాగించాలి.
* తిరిగి సాధారణ శ్వాసకు రావాలి
పరిసరాలు గమనిస్తూ..
నెమ్మదిగా కళ్ళు తెరవాలి.
తదుపరి విద్యార్థులతో.. భావ వ్యక్తీకరణ చేయించాలి.
భావ వ్యక్తీకరణ: సూచనలు..
*****************
వారం లో చివరి రోజున(6వ రోజు కార్యక్రమం) విద్యార్థులు తమ భావాలను పూర్తిగా వ్యక్తీకరించేలా...విద్యార్థులను ప్రోత్సహించాలి.
అందరి విద్యార్థుల సమాధానాలను అంగీకరించాలి.
ఏ ఒక్కరి భావాన్ని వ్యతిరేకించకూడదు.
గెలుపు ఓటమిలను ప్రస్తావించకూడదు.
ఆటలంతా ఆనందంగా ...పాటలంత ఆహ్లాదంగా ఆనంద వేదిక జరిగేలా..ఉపాధ్యాయులు చూడాలి.
వ్యక్తీకరణ ఉద్దేశ్యం..
************
1 వ 2 వ లెవెల్స్ వారు తమపట్ల తాము కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరచుట.
***************
నిర్వహణా విధానము
*********************
1 వ లెవెల్ ..మౌఖిక వ్యక్తిగత వ్యక్తీకరణ
2 వలెవెల్ ..మోఖిక వ్యక్తిగతవ్యక్తీకరణ.
నిర్వహణాసోపానాలు:
*******************
1 వ లెవెల్..2 వ లెవెల్ విద్యార్థులు
వారి వారి కరదీపికననుసరించి భావవ్యక్తీకరణ చేయాలి విద్యార్థులనుండి కృతజ్ఞతకు సంబంధించిన వ్యక్తీకరణను రాబట్టాలి.
సూచనలు:
***********
* పిల్లలుస్వేచ్ఛగా. .. తమభావాలను చెప్పుకొనుటకు అవకాశం ఇవ్వాలి
* అవసరమైన చోట ఉపాధ్యాయుడు సహకరించాలి.
*విద్యార్థుల భావాలను వారి సొంత మాటల్లో..వ్యక్తీకరించడానికి ప్రాధాన్యతనివ్వాలి.
* విద్యార్థులు వారి భావాలను వ్యక్తీకరించడానికి ఇబ్బంది పడితే వారిని గుర్తించి ప్రోత్సహించి విద్యార్థి చేసే మంచి పనులు గొప్పవిషయాలను గుర్తు చేస్తూ వాటికి కృతజ్ఞత చెప్పేవిధంగా ఉపాధ్యాయుడు ప్రోత్సహించాలి.
ఉపయోగాలు,:
************
* దీనివల్ల పిల్లల్లో..సమాజం పట్ల గౌరవ భావం కృతజ్ఞతాభావం పెంచుకుంటారు.
* ఇతరుల పట్ల సమాజం పట్ల బాధ్యత పెరిగి మంచి వ్యక్తులుగా...తయారవుతారు.
* సమాజాన్ని ప్రేమించడం , ఆదరించడం సమాజ సభ్యునిగా ప్రతీ ఒక్కరు కర్తవ్యమని తెలుసుకుంటారు.
మౌన ప్రక్రియ : 2 నిమిషాలు విద్యార్థులందరిని కళ్ళు మూసుకొని కూర్చోమనాలి. కళ్ళు మూసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే కళ్ళు తెరచి కిందికి చూడమనాలి.
ధన్యవాదాలు....ఆనందవేదిక..
0 Comments:
Post a Comment