Sigmund Freud born Sigismund Schlomo Freud; 6 May 1856 – 23 September 1939) was an Austrian neurologist and the founder of psychoanalysis, a clinical method for treating psychopathology through dialogue between a patient and a psychoanalyst.
సిగ్మండ్ ఫ్రాయిడ్ - జననం మే 6 1856, మరణం సెప్టెంబరు 23 1939. ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన మానసిక శాస్త్రవేత్త. ఇతను మానసిక శాస్త్ర పాఠశాలను స్థాపించాడు. ఫ్రాయిడ్ తన ప్రఖ్యాత పుస్తకం అన్‌కాన్షియస్ మైండ్ మరియు డిఫెన్స్ మెకానిజం ఆఫ్ రెప్రెషన్. మానసిక శరీరవైద్యశాస్త్రము మానసిక శాస్త్రవేత్త-రోగి మధ్య వార్తాలాపం ద్వారా మానసిక విశ్లేషణ (Psychoanalysis) చేసి రుగ్మతలను దూరం చేయుట కొరకు ప్రసిద్ధి గాంచాడు. ఫ్రాయిడ్ తన సిద్ధాంతం సెక్షువల్ డిజైర్ ద్వారా మానవ జీవిత ఉత్ప్రేరక శక్తిని వెలికి తీసే వివరణలు, చికిత్సలో మెళకువలు, ఫ్రే అసోషియేషన్ వాడుక, చికిత్స సంబంధిత ట్రాన్స్ఫరెన్స్ సిద్ధాంతము మరియు స్వప్నాలు నిగూఢ వాంఛలను అర్థం చేసుకోవటానికి సోపానాలు అని ప్రతిపాదించి ప్రసిద్ధి గాంచాడు.
సైకాలజీ అనగానే సిగ్మండ్ ఫ్రాయిడ్ గుర్తుకు రావడం సహజం. ''మనిషి మనస్సులో 'అ చేతనం' (అన్ కాన్షెసినెస్) అనేది ఉంటుంది. అది మన ప్రవర్తనను మనకు తెలియకుండానే ప్రభావితం చేస్తుంది''. అని ప్రతిపాదించిన మహా మేధావి ఫ్రాయిడ్.నేడు వైద్యం, కళలు, సాహిత్యం, విద్య, పిల్లల పెంపకం, నైతిక విలువలు, నియమాలు, రాజకీయాలు తదితర రంగాలను, మానవ ప్రవర్తనను ఇంతగా ప్రభావితం చేయడంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ విశ్లేషించిన మనస్తత్వ విశ్లేషణ తారకమంత్రమైంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ 1856, మే 6న జెకేస్లోవేకియాలోని ఫ్రీ బెర్గ్‌లో జన్మించారు. ఫ్రాయిడ్ తన తండ్రికి రెండవ కుటుంబంలో మొదటి సంతానం తన తల్లికి వున్న ఏడుగురు సంతానంలో ఫ్రాయిడ్ అంటే తల్లికి ఎంతో ఇష్టంగా వుండేది. తల్లి అభిమానం ప్రపంచ విజేతనన్న అభిప్రాయం కల్గించి, నిజమైన విజయానికి ప్రేరణ కల్గించింది. సిగ్మంట్ ఫ్రాయిడ్ తండ్రి ఊలు వ్యాపారంలో నష్టపోవడంతో 1860లో కుటుంబ మంతా వియన్నాకు తరలిపోయింది. పేదరికం వెంటాడుతున్నా గానీ తొమ్మిది నుంచి 14 ఏళ్ళ వరకు గ్రీస్, లాటిన్, గణితం, ప్రకృతిశాస్త్రాలు,చరిత్ర ఫ్రాయిడ్ బాగా చదువుకున్నాడు. మొదట న్యాయశాస్త్రం చదువుకోవడానికి ప్రయత్నించినప్పటికీ 1873లో వియన్నా విశ్వవిద్యాలయంలో వైద్యశాస్త్రంలో చేరాడు. అప్పట్లో అది వైద్యశాస్త్రంలో ప్రపంచ రాజధానిగా వుండేది. తర్వాత 1881లో ఎండి పట్టాపొందినప్పటికీ వైద్యంలోని శాస్త్రీయతను అధ్యయనం చేయడానికి అవసరమైన వ్యవధి కన్నా ఎక్కువ కాలం అధ్యయనం చేయడం విశేషం. 1876 నుంచి 1882 దాకా బర్కోస్ సైకాలజీ సంస్థలోని, జంతు శరీర నిర్మాణ శాస్త్ర ప్రయోగశాలల్లో అనుభవం గడించాడు. మానవ మెదడు నిర్మాణం, చేపలలోని నరాల వ్యవస్థలకు సంబంధించి అధ్యయనం చేశాడు. ఈ పరిశోధనలు అతని లక్ష్యానికి మంచిబాటలు వేశాయి. 1882 జులైనుంచి 1885 వరకు వియన్నా జనరల్ హస్పిటల్‌లో సేవలు అందించారు. మనిషి మెదడు నిర్మాణానికి సంబంధమైన పరిశోధన కొనసాగించి, మానసిక రుగ్మతులకు సరైన వైద్యం చేయాలంటే దోహదపడే క్లినికల్ న్యూరాలజీకి సంబంధించి చాలా రకాల అధ్యయనం చేశారు. ఈ కృషి విప్లవాత్మక ధోరణికి ఆహ్వానం పలికింది. న్యూరాలజీ, మెదడు పని చేసే విధానం గురించి అనేక పరిశోధక పత్రాలు ప్రచురించారు. దానితో చాలా గుర్తింపు ఫ్రాయిడ్‌కు వచ్చింది. జె.యం.చార్కొట్‌తో అధ్యయనం చేయాలని పారిస్ వెళ్ళాడు. హిస్టీరియాకు మానసిక కారణాలను చార్కొట్ చూపాడు. దానితో పాటు ఫ్రాయిడ్ మానసిక రుగ్మతులకు మానసిక విశ్లేషణ అనే భావనతో కొత్త పుంతలు తొక్కారు. పారిస్ నుంచి ఫ్రాయిడ్ వియన్నాకు వచ్చారు. హిప్నోసిస్ ద్వారా హిస్టీరియా రోగులకు వైద్యం చేయడం ప్రారంభించాడు. 1887లో ఫ్రాయిడ్ మార్తానుపెళ్ళి చేసుకొని, ఆరుగురు పిల్లలను కన్నారు. స్టడీస్ ఆన్ హిస్టీరియా అనే పుస్తకాన్ని తన మిత్రుడు జోసెఫ్ సాయంతో 1895లో వెలువరించాడు. 'సైకో అనాలసిస్' అన్న పదం వాడిందీ, ఆ అంశం ఒక సబ్జెక్టుగా అభివృద్ధి చేసిందీ ఫ్రాయిడ్. అంతే తన గురించి తాను విశ్లేషించుకోవడం ప్రారంభించాడు. దాంతో ఆయన పర్సనాలిటీయే మారింది. మనిషి మెదడును అర్థం చేసుకోవాలంటే కలలు చాలా దోహదపడతాయని ఫ్రాయిడ్ ప్రతిపాదించాడు. 1905లో ఫ్రాయిడ్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ సెక్యువాలిటీ అంశం మీద ప్రచురించబడిన మూడు వ్యాసాలు చాలా ప్రతిఘటన పాలయ్యాయి. దీన్ని చాలా ఘాటుగా ఎదుర్కొన్న తర్వాత అంతా ఫ్రాయిడ్ వాదనను అంగీకరించ నారంభించారు. దాదాపు అదే సమయం లో సైకో అనాలసిస్‌ను ఫ్రాయిడ్ ఒక థెరపీిగా ప్రతిపాదిస్తూ వ్యాసాలు రాశాడు. అప్పట్లో ప్రారంభమైన సైకో ఎనాల్‌టిక్స్ మూమెంట్‌కు మేథోపితగా ఫ్రాయిడ్‌ను గౌరవించారు.
1908లో అంతర్జాతీయ స్థాయిలో సైకాలజీ కాంగ్రెస్ జరిగింది. ఫ్రాయిడ్ కృషిని కొత్త సైన్స్‌గా గుర్తించి అమెరికాలోని క్లార్క్ విశ్వవిద్యాలయం ఉపన్యాసాలకు ఆహ్వానించింది. సైకో అనాలసిస్ మెడికల్ పాఠ్య ప్రణాళిక లో భాగమయింది. ఫ్రాయిడ్ అనుచరులు అర్థర్, అల్జెడ్, న్యూరోసిస్‌లో కామవాంఛల పాత్ర గురించి విభేదించారు. 1923లో ఫ్రాయిడ్‌కు దవడ క్యాన్సర్ సోకింది. అప్పటికి 336 ఆపరేషన్లు జరిగాయి. చివరకు 1939, సెప్టెంబరు 23న ఫ్రాయిడ్ శాశ్వతంగా కన్ను మూశారు. ఫ్రాయిడ్ వ్యక్తిగత జీవితం చాలా ఆసక్తికర మైంది. అవసరమై నప్పుడు ఎన్నో పరీక్షలు తన మీదనే చేసుకోవడం ఎంతో మందికి నేటికీ స్ఫూర్తినిస్తోంది. నాడీలముప్పురావడంతో 1936, 37 లలో ఫ్రాయిడ్ ఇతర దేశాలల్లో తలదాచు కున్నారు. ఏది ఏమైనా సైకియాట్రిక్ వైద్యం అభివృద్ధికి ఫ్రాయిడ్ పరిశోధనలు నేటి తరానికి కూడా స్ఫూర్తిగా నిలుస్తాయి.
-తలగాపు వెంకటరమణ

0 Comments:
Post a Comment