పొడుపు కథలు -4 - PODUPU KATHALU - USEFUL FOR NO SCHOOL BAG DAY
పొడుపు కథలకు ఉన్న గొప్ప సుగుణం ఏమిటంటే , ఇవి విన్నవెంటనే మనసుకి ఆలోచనలు కలిగించి, వివేచన పెంపొందించి వాటి విడుపు ఎలాగయినా విప్పాలి అనే జిగ్ఞాస పుట్టిస్తాయి.పొడుపుకథల చరిత్రకివస్తే వీటిలొ కొన్ని అతిప్రాచీనకాలం నుంచి, మన కావ్యాల్లో కథల్లో ఇమిడిపోయి ఉన్నాయి. ఉదాహరణకి కాశీమజిలీకథలే తీసుకోండి.అందులో మనకుకావలసినన్ని పొడుపు కథలు ఉన్నాయి.
మన తేటతెలుగులో లెక్కకు మిక్కిలిగా ఉన్న పొడుపుకథలు భాష, భావం ఒకదాని వెంట ఒక పోటీ పడి పరుగులు పెడుతున్నట్టుగా ప్రశ్నించే విషయాన్ని, బహుపసందుగా రూపకల్పన చేసి, కొసమెరుపుగా వాటి విడుపు తెలుపుతూ ఉంటాయి.
పొడుపు కథలకు ఉన్న గొప్ప సుగుణం ఏమిటంటే , ఇవి విన్నవెంటనే మనసుకి ఆలోచనలు కలిగించి, వివేచన పెంపొందించి వాటి విడుపు ఎలాగయినా విప్పాలి అనే జిగ్ఞాస పుట్టిస్తాయి.పొడుపుకథల చరిత్రకివస్తే వీటిలొ కొన్ని అతిప్రాచీనకాలం నుంచి, మన కావ్యాల్లో కథల్లో ఇమిడిపోయి ఉన్నాయి. ఉదాహరణకి కాశీమజిలీకథలే తీసుకోండి.అందులో మనకుకావలసినన్ని పొడుపు కథలు ఉన్నాయి.
మన తేటతెలుగులో లెక్కకు మిక్కిలిగా ఉన్న పొడుపుకథలు భాష, భావం ఒకదాని వెంట ఒక పోటీ పడి పరుగులు పెడుతున్నట్టుగా ప్రశ్నించే విషయాన్ని, బహుపసందుగా రూపకల్పన చేసి, కొసమెరుపుగా వాటి విడుపు తెలుపుతూ ఉంటాయి.
పొడుపు - విడుపు
- పురము కాని పురము, ఏమి పురము?(గోపురము)
- నీతో దెబ్బలు తిన్నాను, నిలువునా ఎండిపోయాను, నిప్పుల గుండము తొక్కాను, గుప్పెడు బూడిదనయ్యాను? (పిడక)
- ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? (నీడ)
- నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? (గుడి గంట)
- నారి కాని నారి, ఏమి నారి? (పిసినారి)
- నిప్పు నన్ను కాల్చలేదు, నీరు నన్ను తడపలేదు, సూర్యుడితో వొస్తాను, సూర్యుడితో పోతాను (నీడ)
- పేడ కాని పేడ, ఏమి పేడ? (దూద్ పేడ)
- నాది నాకు కనపడదు, నీది నీకు కనపడదు, ఏమిటది? (వీపు)
- సందు కాని సందు, ఏమి సందు? (పసందు)
- నీటి మీద తేలుతుంది కాని పడవ కాదు, చెప్పకుండా పోతుంది కాని జీవి కాదు, మెరుస్తుంది కాని మెరుపు కాదు? (నీటి బుడగ)
- నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది, పీక మీదకు కత్తిని తెస్తే కాని మళ్ళీ నడవదు? (పెన్సిల్)
- పండ్లున్నా నోరు లేనిది, ఏమిటది? (రంపం)
- రాయి కాని రాయి, ఏమి రాయి? (పావురాయి)
- ప్రాణం లేని చిన్న పాప అరిచి అరిచి పిలుస్తుంది, ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెపుతుంది? (టెలిఫోన్)
- పైన చుస్తే పండు, తెరిచి చూస్తే బొచ్చు, ఏమిటది?(పత్తికాయ)
- పుట్టినపుడు ఉండవు, పోయే టప్పుడు ఉండవు, ఏమిటవి?(బట్టలు)
- పుట్టినపుడు లేకుండా తరువాత వచ్చి ఆ తరువాత పోయేవి?(దంతములు)
- చక్కగా పెట్టడానికి వీలవుతుంది, తీయటానికి పోతే చెరిగి పోతుంది?(ముగ్గు)
- సాయి కాని సాయి, ఏమి సాయి?(కసాయి)
- మంచి సువాసన ఉన్నా, పూజకు పనికి రానిది, ఏమిటది? (మొగిలి పువ్వు)
- పేరు కాని పేరు, ఏమి పేరు? (కాసుల పేరు)
- కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది, కాళ్ళు లేకపోయినా నడుస్తుంది? (మేఘం)
- తల నుండి పొగ చిమ్ముతుంది కానీ భూతం కాదు, గొంతులో నిప్పులు దాచుకుంటుంది కానీ రాకాసి కాదు, పాకుతుంది కానీ పాము కాదు? (రైలు)
- తెలియకుండా పూవు పూస్తుంది, తెలిసి కాయ కాస్తుంది? (అత్తి చెట్టు)
- జానెడు ఇంటిలో, మూరెడు బెత్తం? (కుండ, గరిట)
- గడ్డి తినదు, కుడితి తాగదు, కానీ పాలు మాత్రం ఇస్తుంది? (తాటి చెట్టు)
- కొప్పు ఉన్నా జుట్టు లేదు, కళ్ళు ఉన్నా చూడలేదు? (టెంకాయ)
- ఐదుగురిలో బుడ్డోడు! పెళ్ళికి మాత్రం పెద్దోడు!! (చిటికెన వ్రేలు)
- గారు కాని గారు, ఏమిగారు? (కంగారు)
- అది లేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు? (ఆకలి)
- అందరూ నన్ను పట్టుకుంటారు కాని నేనే ఎవరిని పట్టుకొను, అందరూ నాతో మాట్లాడతారు కాని నేనే ఎవరితో మాట్లాడను? (టెలిఫోన్)
- గీత కాని గీత, ఏమి గీత? (భగవద్గీత)
- గోళము కాని గోళము, ఏమి గోళము? (గందర గోళము)
- అన్నం పెడితే ఎగురదు, పెట్టకపోతే ఎగురుతుంది? (విస్తరాకు)
- అడవిలో చిన్న గని, గనికి చాలా గదులు, గదికొక్క సిపాయి, సిపాయికొక్క తుపాకి?(తేనే పట్టు)
- అన్నదమ్ములు ముగ్గురు, తిరిగితే ముగ్గురూ తిరుగుతారు, మానితే ముగ్గురూ మానుతారు(ఫ్యాన్)
- అబ్బాయి గారి దొడ్లో పెద్ద పండు పడితే, పరుగెత్తలేక పది మంది చచ్చారు.(పిడుగు)
- ఆడవారికి ఉండనిది, మగవారికి ఉండేది? (మీసము)
- ఆడదానికి పుట్టినింట ఒకటి, మెట్టినింట ఒకటి? (ఇంటి పేరు)
- ఆడవారు తక్కువగా మాట్లాడే నెల? (ఫిబ్రవరి)
- ఇల్లంతా తిరిగి మూలకు కూర్చుంటుంది? (చీపురు_
- ఇళ్ళు లేని పట్నాలు, నీళ్లు లేని సముద్రాలు ఎక్కడ ఉంటాయి? (మ్యాపులో)
- ఇంటిలో ఉంటే ప్రమోదము, ఒంటిలో ఉంటే ప్రమాదము? (పంచదార)
- ఇక్కడ వత్తు! అక్కడ వెలుగు!!? (స్విచ్, బల్బ్)
0 Comments:
Post a Comment