పొడుపు కథలు -3 - PODUPU KATHALU - USEFUL FOR NO SCHOOL BAG DAY
పొడుపు కథలకు ఉన్న గొప్ప సుగుణం ఏమిటంటే , ఇవి విన్నవెంటనే మనసుకి ఆలోచనలు కలిగించి, వివేచన పెంపొందించి వాటి విడుపు ఎలాగయినా విప్పాలి అనే జిగ్ఞాస పుట్టిస్తాయి.పొడుపుకథల చరిత్రకివస్తే వీటిలొ కొన్ని అతిప్రాచీనకాలం నుంచి, మన కావ్యాల్లో కథల్లో ఇమిడిపోయి ఉన్నాయి. ఉదాహరణకి కాశీమజిలీకథలే తీసుకోండి.అందులో మనకుకావలసినన్ని పొడుపు కథలు ఉన్నాయి.
మన తేటతెలుగులో లెక్కకు మిక్కిలిగా ఉన్న పొడుపుకథలు భాష, భావం ఒకదాని వెంట ఒక పోటీ పడి పరుగులు పెడుతున్నట్టుగా ప్రశ్నించే విషయాన్ని, బహుపసందుగా రూపకల్పన చేసి, కొసమెరుపుగా వాటి విడుపు తెలుపుతూ ఉంటాయి.
పొడుపు కథలకు ఉన్న గొప్ప సుగుణం ఏమిటంటే , ఇవి విన్నవెంటనే మనసుకి ఆలోచనలు కలిగించి, వివేచన పెంపొందించి వాటి విడుపు ఎలాగయినా విప్పాలి అనే జిగ్ఞాస పుట్టిస్తాయి.పొడుపుకథల చరిత్రకివస్తే వీటిలొ కొన్ని అతిప్రాచీనకాలం నుంచి, మన కావ్యాల్లో కథల్లో ఇమిడిపోయి ఉన్నాయి. ఉదాహరణకి కాశీమజిలీకథలే తీసుకోండి.అందులో మనకుకావలసినన్ని పొడుపు కథలు ఉన్నాయి.
మన తేటతెలుగులో లెక్కకు మిక్కిలిగా ఉన్న పొడుపుకథలు భాష, భావం ఒకదాని వెంట ఒక పోటీ పడి పరుగులు పెడుతున్నట్టుగా ప్రశ్నించే విషయాన్ని, బహుపసందుగా రూపకల్పన చేసి, కొసమెరుపుగా వాటి విడుపు తెలుపుతూ ఉంటాయి.
పొడుపు - విడుపు
- చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది? (ఉల్లిపాయ)
- జాన కాని జాన, ఏమి జాన? (ఖజాన)
- తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది?(వేరుశెనగ కాయ)
- లాగి విడిస్తేనే బ్రతుకు? (ఊపిరి)
- పువ్వులో అందరికీ పనికి వొచ్చే పువ్వు? (పత్తి పువ్వు)
- పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే?(దీపం)
- పొద్దుటూరి చెట్లలో పొదిలింది చెళవాయి, చూసే వారే కాని పట్టే వారు లేరు?(సూర్యుడు)
- మూత తెరిస్తే, ముత్యాల పేరు? (దంతాలు)
- మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు? (తేనె పట్టు)
- మొగ్గ కాని మొగ్గ, ఏమి మొగ్గ? (లవంగ మొగ్గ)
- ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం?(తేనె పట్టు)
- రసం కాని రసం, ఏమి రసం? నీరసం)
- మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన? (పాలు, పెరుగు, నెయ్యి)
- మోదం కాని మోదం?(ఆమోదం)
- రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది?(ఉత్తరం)
- కొక లేదు, సీత కాదు! రామ చిలుక కానేకాదు!! అదేమిటి?(సీతాకోక చిలుక)
- రాజాధి రాజులు కూడా ఒకరిముందు తల వంచుకుంటారు?(మంగలి)
- రాజు నల్లన, ప్రధాని పచ్చన, పాలు పుల్లన?(తాటి చెట్టు)
- రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది?(ఎండ, వాన, చలి)
- రాళ్ల అడుగున విల్లు, విల్లు కోనలో ముళ్ళు?(తేలు)
- అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు త్రాగుతుంది.(దీపం వత్తి)
- కడుపు నిండా రాగాలు, వంటి నిండా గాయాలు?(మురళి)
- ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు?(ఉల్లి)
- సముద్రంలో పుట్టిపెరిగి ఊరిలో అరుస్తుంది, ఏమిటది?(శంఖం)
- చెట్టుకు కాయని కాయ కరకరలాడే కాయ?(కజ్జికాయ)
- వాలం ఉంది కాని కోతిని కాదు, నామముంటుంది కాని పూజారిని కాదు?(ఉడత)
- రంగం కాని రంగం, ఏమి రంగం?(వీరంగం)
- మత్తు కాని మత్తు, ఏమి మత్తు? (గమ్మత్తు)
- అందరినీ పైకి తీసుకుకెళ్తుంది, కాని తాను మాత్రం పైకి వెళ్ళదు? (నిచ్చెన)
- టూరు కాని టూరు, ఏమి టూరు? (గుంటూరు)
- టిక్కు టిక్కుల బండి, టిక్కులాడి బండి, అందరూ వాడే బండి, బ్రేకులు లేని బండి?(గడియారం)
- డ్రస్ కాని డ్రస్, ఏమి డ్రస్? (అడ్రెస్)
- తొడిమె లేని పండు! చాలా కాలం ఉండు!!? (విభూతి)
- జాబు కాని జాబు, ఏమి జాబు?(పంజాబు)
- తోక లేని పిట్ట 90 ఆమడలు పోతుంది? (పోస్ట్ కార్డు)
- జారు కాని జారు, ఏమి జారు?(బజారు)
- తిరిగే దీపము, గాలి-వానకు ఆగని దీపము, చమురులేని దీపము, పిట్టల దీపము(మిణుగురు పురుగు)
- తాళము కాని తాళము, ఏమి తాళము? (ఆది తాళము)
- తమ్ముడు కుంటుతూ కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరుగెత్తుతూ పన్నెండు మైళ్ళు నడుస్తాడు? (గడియారం ముళ్ళు)
- తాళి గాని తాళి, ఏమి తాళి? (ఎగతాళి)
- తెలిసి కుడుతుంది, తెలియక చస్తుంది? (చీమ, దోమ)
- ఎర్రని ముక్కు, తెల్లని వొళ్ళు, పొడుగ్గా పుట్టి పొట్టిగా పెరుగుతుంది? (క్రొవ్వొత్తి)
- దానము కాని దానము, ఏమి దానము? (మైదానము)
- తోలు నలుపు! తింటే పులుపు!! ఏమిటది? (చింతపండు)
- ధనము కాని ధనము, ఏమి ధనము? (ఇంధనము)
- చెప్పిందే చెప్పినా చిన్న పాప కాదు, ఎక్కడి పండ్లను తిన్నా దొంగ కాదు? (రామ చిలుక)
- నాలుగు కాళ్ళున్నాయి కాని జంతువుని కాను, శరీరమంతా రంధ్రాలున్నాయి కాని వలను కాను? (మంచము)
- పాలు కాని పాలు, ఏమి పాలు? (లోపాలు)
- నీరు తగిలితే గుప్పెడవుతుంది, ఎండ తగిలితే గంపెడవుతుంది? (దూది)
0 Comments:
Post a Comment