పొడుపు కథలు -1 - PODUPU KATHALU - USEFUL FOR NO SCHOOL BAG DAY
పొడుపు కథలకు ఉన్న గొప్ప సుగుణం ఏమిటంటే , ఇవి విన్నవెంటనే మనసుకి ఆలోచనలు కలిగించి, వివేచన పెంపొందించి వాటి విడుపు ఎలాగయినా విప్పాలి అనే జిగ్ఞాస పుట్టిస్తాయి.పొడుపుకథల చరిత్రకివస్తే వీటిలొ కొన్ని అతిప్రాచీనకాలం నుంచి, మన కావ్యాల్లో కథల్లో ఇమిడిపోయి ఉన్నాయి. ఉదాహరణకి కాశీమజిలీకథలే తీసుకోండి.అందులో మనకుకావలసినన్ని పొడుపు కథలు ఉన్నాయి.
మన తేటతెలుగులో లెక్కకు మిక్కిలిగా ఉన్న పొడుపుకథలు భాష, భావం ఒకదాని వెంట ఒక పోటీ పడి పరుగులు పెడుతున్నట్టుగా ప్రశ్నించే విషయాన్ని, బహుపసందుగా రూపకల్పన చేసి, కొసమెరుపుగా వాటి విడుపు తెలుపుతూ ఉంటాయి.
పొడుపు కథలకు ఉన్న గొప్ప సుగుణం ఏమిటంటే , ఇవి విన్నవెంటనే మనసుకి ఆలోచనలు కలిగించి, వివేచన పెంపొందించి వాటి విడుపు ఎలాగయినా విప్పాలి అనే జిగ్ఞాస పుట్టిస్తాయి.పొడుపుకథల చరిత్రకివస్తే వీటిలొ కొన్ని అతిప్రాచీనకాలం నుంచి, మన కావ్యాల్లో కథల్లో ఇమిడిపోయి ఉన్నాయి. ఉదాహరణకి కాశీమజిలీకథలే తీసుకోండి.అందులో మనకుకావలసినన్ని పొడుపు కథలు ఉన్నాయి.
మన తేటతెలుగులో లెక్కకు మిక్కిలిగా ఉన్న పొడుపుకథలు భాష, భావం ఒకదాని వెంట ఒక పోటీ పడి పరుగులు పెడుతున్నట్టుగా ప్రశ్నించే విషయాన్ని, బహుపసందుగా రూపకల్పన చేసి, కొసమెరుపుగా వాటి విడుపు తెలుపుతూ ఉంటాయి.
పొడుపు - విడుపు
- కిట కిట తలుపులు,కిటారి తలుపులు,ఎప్పుడు తీసిన చప్పుడు కావు,ఏమిటవి? (కనురెప్పలు)
- ఇంతింతాకు ఇస్తరాకు, రాజులు మెచ్చిన రత్నాలాకు (తమలపాకు)
- గోడమీద బొమ్మ -గొలుసుల బొమ్మ -వచ్చి పోయే వారికి-వడ్డించు బొమ్మ. (తేలు)
- రాజావారి తోటలో-రోజాపూలు-చూచేవారే గాని-కోసేవారే లేరు (నక్షత్రాలు)
- పచ్చని పెట్టెలో విచ్చుకోనుంది ,తెచ్చుకోపోతేనూ గుచ్చుకుంటుంది (మొగిలి పువ్వు)
- చారల చారల పాము-చక్క చక్కని పాము-నూతిలోని పాము-నున్ననైన పాము(పొట్లకాయ)
- చిక్కటి కారడవిలో చక్కని దారి (పాపిట)
- చిటారు కొమ్మన మిఠాయి పొట్లము (తేనె తుట్టె)
- చెయ్యని కుండ-పొయ్యని నీరు-వెయ్యని సున్నము-తియ్యగ నుండు (కొబ్బరికాయ)
- జోడు గుఱ్ఱాల మీద ఒకడే రాజు (పావుకోళ్ళు)
- ఇంటి వెనక ఇంగువ చెట్టు-ఎంత కోసినా గుప్పెడు కాదు( పొగ)
- చిన్న కంచం - పెద్ద కంచం-నూక బువ్వ - నూరు బొట్లు (చంద్రుడు - మబ్బు-నక్షత్రాలు - -వాన)
- సూర్యుడు చూడని గంగ-చాకలి ఉతకని మడుగు (కొబ్బరి కాయ నీళ్ళు)
- అంగుళం గదిలో అరవైమంది ( అగ్గిపెట్టె)
- చింపిరి చింపిరి గుడ్డలు-కానీ ముత్యాలవంటి బిడ్డలు(మొక్కజొన్నపొత్తి)
- పొంచినదెయ్యం-పోయినచోట ప్రత్యక్షం(నీడ)
- వేసింది ఏమిరా - తీసింది ఏమిరా-వేలుపెట్టి వాసన చూసింది ఏమిరా(వేసింది సానరా - తీసింది చెక్కరా-వేలుపెట్టి వాసన చూసింది గంధం రా)
- నాలుగు కాళ్ళ నటారి-తోక లేని తొటారి(మంచం)
- అంగట్లొ ఉంటాను-అంగీ ఇంట్లొ విప్పుతాను_ఎవరన్నా పట్టుకుంటే-నూతిలో దూకుతాను(అరటి పండు)
- అడవి లో మాను ఎంత కోసినా ఎదుగుతుంది(జుట్టు)
- అడ్డంగా కోస్తే చక్రం, నిలువుగా కోస్తే శంఖం(ఉల్లి పాయ)
- అడ్డగోడ మీద ముద్దపప్పు-అటు తోసినా పడదు. ఇటు తోసినా పడదు(ఎద్దు మూపురం)
- అంబులో పుట్టింది, జంబులో పెరిగింది-అరచెయ్యికొచ్చింది, అంతరించిపోయింది(పేను)
- ఆకు అలము కాదుకాని ఆకుపచ్చన-కాయసున్నం కాదుకాని నోరు ఎర్రన(చిలుక)
- ఆకాశం లో అరవై గదులు, గదికి ఒక సిపాయి(తేనె పట్టు)
- కానరాని అడవిలో నీళ్ళు లేని మడుగు-నీళ్ళు లేని మడుగులో కానరాని నిప్పు(ఆకలి)
- కిందొక పలక-పైనొక పలక-పలకల నడుమ-మెలికల పాము(నాలుక)
- తామరకమలం మీద కలువ పువ్వులు-కలువ పువ్వుల కింద సంపెంగ పువ్వు-సంపెంగపువ్వు కింద దొండపళ్ళు-దొండపళ్ళలో మల్లెమొగ్గలు(మొహము,కళ్ళు,ముక్కు,పెదవులు, పళ్ళు)
- పిల్లికి ముందు రెండు పిల్లులు-పిల్లికి వెనక రెండు పిల్లులు-పిల్లికి పిల్లికి మధ్య ఒక పిల్లి
- మొత్తం పిల్లులెన్ని ?(మూడు)
- ఓహోహో బాలమ్మా-ఒళ్ళంతా ముళ్ళమ్మా-కరకర కోస్తే-కడుపంతా తీపమ్మా(పనస పండు)
- కాయ మీద మాను, కడు రమ్యమై యుండు-మాను మీద లతలు మలయుచుండు-లతల మీద వ్రేళ్ళు లాస్యమాడుచునుండు-దీని భావమేమి తిరుమలేశ ! (వీణ)
- అడవిని పుట్టాను-నల్లగ మారాను-ఇంటికి వచ్చాను-ఎర్రగ మారాను-కుప్పలో పడ్డాను-తెల్లగ మారాను (బొగ్గు)
- అడవిలో పుట్టింది-అడవిలో పెరిగింది-చెంబులో నీళ్ళన్ని-చెడ త్రాగుతుంది(గంధపు చెక్క)
- ఇంటివెనక వెంపలి చెట్టు-యే కాయ కాయమంటే-ఆ కాయే కాస్తుంది(కుమ్మరి సారె)
- ఎక్కలేని మానుకు దిక్కులేని కాఫు (మిరప చెట్టు)
- కతకత కంగు-కామరాజు పింగు-తోలుతీసి మింగు (అరటి పండు)
- చక్కచక్కని చెంబు, చారల్ల చెంబు-ముంచితే మునగని ముత్యాల చెంబు (దోసకాయ)
- చాప చుట్టనూ లేము-చంక బెట్టనూ లేము (ఆకాశం)
- చుక్కల చుక్కల గుర్రాలెక్కి -సూటి కర్రా చేతా బట్టి -ఆకుల్లేని అరణ్యానికి -రాకుమారుడు వేటకు వెళ్ళె (చందమామ)
- దోసెడు నీళ్ళలో దొరసాని జలకాలాడుతోంది(వెన్న ముద్ద)
- నాగస్వరానికి లొంగని నాగేంద్రుడు-నిప్పంటుకుంటే బుస్సుమంటాడు(చిచ్చుబుడ్డి)
- పీస్ పీస్ పిట్ట-నేల కేసి కొట్ట (చీమిడి)
- పొడల పొడల బువ్వ, పొంకమయిన గువ్వ-బువ్వలోకి మొవ్వ, పురుగులు తినే అవ్వ-రాజులు పొడిచే చివ్వ, రాత్రి తెలిపే రవ్వ-నున్ననైన గువ్వ, నూకలు తినే తవ్వ(కోడిపుంజు)
- మంచం కింద మావయ్యా-ఊరికి పోదాం రావయ్యా(చెప్పులు)
- ముక్కు మీద కెక్కూ, ముందరి చెవులు నొక్కూ-టక్కుల నిక్కుల పొక్కూ, జారిందంటే పుటుక్కూ(కళ్ళజోడు)
- నూరుగురు అన్నదమ్ములకు ఒకటే మొలతాడు(చీపురు తాడు)
- బక్క కుక్కకు బండెడు పేగులు(మంచం)
- తోకాయగారికి కోపం వస్తే ఆకాశానికి పరుగులు తీస్తాడు(తారాజువ్వ)
- చిటపట చినుకులు చిటారి చినుకులు-ఎంత కురిసినా వరదలు రావు(కన్నీళ్ళు)
- ఇంటిలో మొగ్గ-వీధిలోపువ్వు(గొడుగు)
- ఆకువేసి అన్నం పెడితే ఆకు తీసి అన్నం తిన్నారు(కరివేపాకు)
- అందమైన సరస్సులో ఎర్రపిట్ట తోకతో నీళ్ళు తాగుతోంది(దీపపు వత్తి)
0 Comments:
Post a Comment