Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Friday, 9 August 2019

World tribal day - Details - ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ అంతర్జాతీయ దినోత్సవం - వివరాలు...విశేషాలుThe International Day of the World's Indigenous Peoples is observed on 9 August each year to frontup and protect the rights of the world's indigenous population. This event also recognizes the achievements and contributions that indigenous people make to improve world issues such as environmental protection.

ప్రపంచ ఆదివాసీ జనాభా హక్కుల పరిరక్షణ, పురోగతి కోసం ప్రతి ఏడాది ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుతున్నారు. పర్యావరణ పరిరక్షణ వంటి అంతర్జాతీయ అంశాల మెరుగుదల కోసం ఆదివాసీలు చేస్తున్న సేవలు, చేస్తున్న కృషికి గుర్తింపుగా కూడా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఆదివాసీల గురించి ఐక్యరాజ్యసమితి సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు ఈ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనేందుకు వివిధ దేశాల ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. ఆదివాసీల గురించి అవగాహనను పెంచుకునేందుకు, వారిని గుర్తించేందుకు విద్యాసంస్థలు, తరగతి గదుల్లో కార్యకలాపాలను నిర్వహించాలి. ఈ కార్యక్రమాల్లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి, ఇతర కీలక నాయకుల సందేశాలు, ఆదివాసీ కళాకారుల కృషి, పాత్ర గురించి ఉండాలి. వారితో మంచి సంబంభాలపై బృంద చర్చలు జరగాలి.

ప్రపంచ ఆదివాసీ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినోత్సవం ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా మాత్రమే జరుపుతున్నారు, ఇది సెలవు దినం కాదు.

ఆదివాసీ జనాభాపై 1982లో జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి తొలి వర్కింగ్‌ గ్రూపు సమావేశానికి గుర్తింపుగా ప్రతి ఏటా ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ జనాభా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆదివాసీ జనాభా అంతర్జాతీయ దశాబ్ధంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలని 1994, డిసెంబరు 23వ తేదీన ఐక్యరాజ్యసమితి సార్వత్రిక సభ నిర్ణయించింది.

2005-2014ను ప్రపంచ ఆదివాసీల రెండో అంతర్జాతీయ దశాబ్ధంగా సార్వత్రిక సభ 2004లో ప్రకటించింది. ఈ రెండో దశాబ్ధంలో ప్రతి సంవత్సరం ఆదివాసీల అంతర్జాతీయ దినోత్సవాన్ని కొనసాగించాలని కూడా సార్వత్రిక సభ నిర్ణయించింది. సంస్కృతి, విద్య, ఆరోగ్యం, మానవ హక్కులు, పర్యావరణం, సామాజిక, ఆర్థిక అభివృద్ధి వంటి అంశాల్లో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అంతర్జాతీయ సహకారాన్ని మరింత పటిష్టం చేయడం ఈ దశాబ్ధపు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆర్థిక, సామాజిక మండలి ఆమోదించిన ఆదివాసీల సమస్యలపై ఐక్యరాజ్యసమితి శాశ్వత ఫోరంను ఏర్పాటు చేయాలని మానవ హక్కుల కమిషన్‌ 2000, ఏప్రిల్‌లో తీర్మానాన్ని చేసింది. సంస్కృతి, ఆర్థిక, సామాజిక అభివృద్ధి, విద్య, పర్యావరణం, ఆరోగ్యం, మానవ హక్కులకు సంబంధించిన ఆదివాసీల సమస్యలపై చర్చించడం ఫోరం విధి.

భారతదేశ మానస పుత్రులుగా పేర్కొనే వివిధ జాతులు, తెగల సమాహారమే 'ఆదివాసీ'లు. వారి మూలాల ఆధారంగా ఈ తెగలను ఆదివాసీలు, జాతులుగా పిలుస్తూ ఉంటారు. వనవాసి, జనజాతి, గిరిజనులు అని కూడా వారిని పిలుస్తారు. అసలైన, స్థానిక ఆదివాసీలకు ప్రాంతీయ తెగలుగా విస్తృతస్థాయిలో ఉన్న వర్గం నుండి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విభిన్నమైన చరిత్ర, సామాజిక నేపథ్యం, భాష, తెగ, మతం, సంస్కృతి, గుర్తింపుతో వారిదైన ప్రత్యేకత వారికి ఉంటుంది. ప్రపంచ జనాభాలో 5 శాతం ఆదివాసీలు ఉన్నారు. 300 నుంచి 370 మిలియన్లు ఉన్న గిరిజన తెగలు 400 భాషలను

ఉపయోగిస్తున్నారు అని ఆదివాసీలపై ఐక్యరాజ్యసమితి శాశ్వత ఫోరం (యుఎన్‌పిఎఫ్‌ఐఐ) తెలియజేసింది. 70 దేశాల్లో 5 వేల రకాల తెగలకు చెందిన ఆదివాసీలు జీవిస్తున్నారని, వీరిలో 70 శాతం మంది ఆసియాలోనే ఉన్నారని వ్యవసాయాభివృద్ధి అంతర్జాతీయ నిధి (ఐఎఫ్‌ఎడి) సమాచారం. తమ హక్కులకు మరింత ఊతమిచ్చేందుకు, వారి కృషి, సేవలను గుర్తించేందుకు ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఆదివాసీలు పాటిస్తున్నారు. ''ఆదివాసీలు సహజ వనరుల సంరక్షకులుగా, నిర్వాహకులుగా

ఉన్నారు'' అని గిరిజన తెగల సమస్యలపై ఐఎఫ్‌ఎడి సమన్వయకర్తగా ఉన్న ఆంటోనెల్లా కార్డోన్‌ అన్నారు. భారతీయ గిరిజనులు భారతదేశ సాంస్కృతిక వారసత్వం, జానపదాన్ని వందేళ్ళుగా ఎలాంటి స్క్రిప్ట్‌ లేకుండా పరిరక్షిస్తున్నారు, సంరక్షిస్తున్నారు. జాతీయతా వాదనంలో ఇదొక కలికితురాయి. ప్రపంచంలో అతి ఎక్కువగా ఆదివాసీ తెగలు ఉన్న దేశం ఇదే. భారత్‌లోని అన్ని రాష్ట్రాల్లో 100 మిలియన్ల మంది గిరిజన జనాభా

ఉన్నారు. భారత్‌లో ఆదివాసీల జనాభా ఆస్ట్రేలియాలో జనాభా కంటే నాలుగు రెట్లు ఎక్కువ.

ఆదివాసీల సామాజిక, ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా, విచారకరంగా ఉంది. దేశంలో వారు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. అతి బీదలుగా పేదరికంలో మగ్గుతున్నారు. వారికి సరైన భూమి,

ఉపాధి లేదు. వారి జీవనానికి ఎలాంటి ఆదాయ మార్గం లేదు. కట్టుబానిసలైన కార్మికులుగా పనిచేస్తున్నారు. జీవనభృతి కోసం కొన్ని కుటుంబాలు లిక్కర్‌ తయారీని ఎంచుకుంటున్నారు. కొన్ని తెగలకు చెందిన కుటుంబాలు తమ సొంత పిల్లలనే విక్రయిస్తున్నారు. కొంతమంది మహిళలు 'కిరాయి' తల్లులుగా ఉంటున్నారు. పందులు, కుక్కలు వంటి జంతువుల మీద జరగాల్సిన వైద్యపరమైన కొత్త ఔషధ ప్రయోగాలకు అమాయక ఆదివాసీ తెగల కుటుంబాలు బలవుతున్నాయి. సహజ వనరులను ఆదివాసీ తెగలు సంరక్షిస్తుంటే, నాయకులు, మధ్య దళారులు బినామీ పేర్లతో వాటిని దోచుకుంటున్నారు. ఇన్ని సమస్యలు ఆదివాసీలను పీడిస్తున్నాయి. ఇంకా వారు తమ ఆరోగ్య సంరక్షణ కోసం అనాదిగా ఆచరిస్తున్న సంప్రదాయ ఔషధ మొక్కల పైనే ఆధారపడు తున్నారు. ఆ ఔషధ మొక్కలను సంరక్షిస్తున్నారు.

ఆదివాసీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం భూమి లేని కుటుంబాలకు భూమిని అందజేస్తోంది. విద్యావంతులైన యువతకు ఉపాధి, బాలికల పట్ల ప్రత్యేక శ్రద్ధతో అందరికీ విద్య, గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంది. గ్రామ పంచాయతీల్లో 500 మంది ఆదివాసీ తెగల జనాభా ఉన్నట్లు గుర్తించారు. అంటే వీరంతా ఇంకా ప్రధాన స్రవంతిలో భాగం కావలసి ఉంది.
వ్యాసం ..ప్రొఫెసర్‌ ఎ. సీతారాం నాయక్‌

☘World tribal day - Details - ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ అంతర్జాతీయ దినోత్సవం - వివరాలు...విశేషాలు

➖➖➖
* దేశం లోని ముఖ్యమైన ఆదివాసీ తెగలు..ఆదివాసీ ప్రముఖులు*

➖➖➖

☘Analysis on Indian tribes - ఆదివాసులు ఎవరు?-  భారతదేశంలో 705 రకాల ఆదివాసీ తెగలు - 2011 లెక్కల ప్రకారం పది కోట్ల నలబై రెండు లక్షల మంది, మొత్తం దేశ జనాభాలో 8.6శాతం ...వివరాలు

➖➖➖
*🏹The Hidden Island- Sentinel Island - Story on Sentinelese🏹
*సెంటినెలిస్*
 *దాదాపు 60,000 సంవత్సరాల నుంచీ ఈ అండమాన్ దీవుల్లో నివసిస్తున్న  ఆదిమ వాసులు*
*అండమాన్ ఆదిమానవుల గురించి భయంకర నిజాలు....

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top