క్రమం తప్పకుండా తనిఖీలు చేయండి : సీఎం జగన్
★ సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహణ.
★ రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో క్వాలిటీ ఉండాలని, కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలని ఆదేశం.
★ స్కూళ్లకు సంబంధించి తొమ్మిది రకాల సౌకర్యాలు ఏర్పాటుచేయడానికి ఒక ప్రణాళిక రూపొందించినట్లు మూడు దశల్లో ఈ సౌకర్యాలను కల్పిస్తున్నామని వెల్లడి.
★ రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టల్స్‌లో కూడా చేపట్టాల్సిన పనులపై ఒక ప్రణాళిక తయారుచేయాలని జగన్ ఆదేశించారు.
★ డిమాండు ఉన్నచోట కొత్త హాస్టళ్ల కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని, హాస్టళ్ళకు నిధుల మంజూరు విషయమై జగన్ ఈ సందర్భంగా ఆరా తీశారు.
★ టాయిలెట్స్‌ను ప్రతి హాస్టల్‌లో వెంటనే ఏర్పాటు చేయాలని, ప్రయార్టీ ప్రకారం చేయాలని సీఎం ఆదేశించారు.
★ 309 హాస్టళ్లలో వంట మనుషులు, వాచ్‌మన్లు సహా ఖాళీగా ఉన్న 927 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, ఆమేరకుప్రతిపాదనలు సిద్ధంచేయాలని ఆదేశించారు.
★ వచ్చే ఏడాది నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూలు తెరిచే సమయానికి యూనిఫారమ్స్, పుస్తకాలు అందాలని, ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేయాలని ఆదేశించారు.
0 Comments:
Post a Comment