కొటారి వలసయ్య, ఆ ఉపాధ్యాయుడు పలువురికి ఆదర్శం స్వచ్ఛందంగా స్కూల్, రహదారి నిర్మాణం
ఆయన వృత్తి ధర్మానికి వన్నెతెచ్చారు. వృత్తి కోసం ఎంతకష్టమైనా అహర్నశలు కష్టపడ్డాడు. గ్రామస్తుల సహకారం తీసుకుని స్కూల్ కోసం రేకుల షెడ్, రహదారిని నిర్మించి, పలువురికి ఆదర్శంగా నిలిచారు. పాఠశాల దూరమైనా కాలిబాటన క్రమం తప్పకుండా వెళ్లి విద్యార్థులకు విద్యను బోధిస్తున్నారు. ఆయనే జి.మాడుగుల మండలం కోరాపల్లి పంచాయతీ కిటుముల గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కొటారి వలసయ్య.
విద్యాభ్యాసం
జి.మాడుగుల మండలంలోని వలసయ్య 1 నుంచి 2 కిటుముల గ్రామంలో చదివాడు. 3 నుండి 5 వరకు గాంధీనగర్ స్కూల్, 6 నుండి 10 వరకు పాడేరు మండలం తలారిసింగ్‌లో సిఎహెచ్ స్కూల్, ఇంటర్మీడియట్ కొయ్యూరు గురుకులం పాఠశాల, డైట్ ప్రకాశం జిల్లా గిద్దలూరు, 2014లో డిఎస్సీలో ర్యాంకు సాధించాడు. 2016లో జాయిన్ అయ్యారు.
విధుల పట్ల మక్కువ
జి.మాడుగుల మండలం వంతాల పంచాయితీ వంట్లమామిడి ఎంపిపి పాఠశాల ఉపాధ్యాయుడు కొటారి వలసయ్య తన విధులను సక్రమంగా నిర్వహించడంలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. వలసయ్య 2016 జూన్‌లో వంట్లమామిడి పాఠశాలలో ఉపాధ్యాయుడుగా చేరాడు. ఈ గ్రామానికి వెళ్లడానికి ఎటువంటి రహదారి సౌకర్యమూ లేదు. జి.మాడుగుల నుండి సొలభం వరకు ప్రైవేటు జీపులో వెళ్లి, అక్కడ నుండి వంతలకు ఆటోలో వెళ్లి పెదవలస గ్రామం నుండి గంటన్నర కాలిబాటన పర్వతాలు, అటవీ ప్రాంతం నుండి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి విద్యనందిస్తున్నారు. సెలవు దినాల్లో మినహా ఎప్పుడూ విద్యార్థులకు అందుబాటులో ఉంటారు. ఐటిడిఎ పిఒ రవిప్రకాష్ పట్టన్‌శెట్టి ఈ గ్రామానికి వచ్చినప్పుడు కూడా ఈ ఉపాధ్యాయుడ్ని అభినందించారు. ఈ విధంగా నాలుగు సంవత్సరాలు విధులు నిర్వహించారు.
శ్రమదానంతో రోడ్డు సౌకర్యం
టీచర్, గ్రామస్తుల సహకారంతో ద్విచక్ర వాహనం రావడానికి సరిపడా రహదారిని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. శ్రమదానంతో రోడ్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ రోడ్డు గుండా టీచరు మరింత ఉత్సాహంతో నిర్ణీత సమయానికి పాఠశాలకు వెళ్తున్నారు. ఈ గ్రామానికి ఇప్పటి వరకు రోడ్డు సౌకర్యం లేదు. ఈ గ్రామంలో ఆదిమ జాతి గిరిజనులు నివాసం ఉంటున్నారు.
విద్యార్థులకు సలహాలు, సూచనలు
ఈ ఏడాది 30 నుండి 40 మంది విద్యార్థులు చదువుతున్నారు. కూడా ఉపాధ్యాయుడు విద్యతోపాటు అక్కడ చదివిన విద్యార్థులను జి.మాడుగుల ఎపిఆర్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో చేర్పించారు. ఆయన స్వగ్రామంలో విద్యార్థులను ఉన్నత చదువులు ఎక్కడ చదవాలో సలహా ఇవ్వడంతోపాటు ఇచ్చి చేర్పిస్తున్నారు.
సొంత నిధులతో షెడ్ నిర్మాణం
ఎంపిపి పాఠశాల అయినప్పటికీ రోడ్డు సౌకర్యం లేక భవనం నిర్మించలేదు. ఒక ఇంటిని అద్దెకు తీసుకొని విద్య చెబుతూ ఉండేవారు. అయితే, ఈ ఉపాధ్యాయుడు వచ్చిన తర్వాత సొంత డబ్బులతో గ్రామస్తులతో కలిసి ఇటుకు, మట్టి కలిపి ఒక పాకలాగా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది పాఠశాల అభివృద్ధి కోసం రూ.12,500తో సిమెంట్ రేకులు కొనుగోలు చేయడానికి కేటాయించి పైకప్పు వేశారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్పుతున్నారు. ఈ టీచర్ వచ్చినప్పుటి నుండి విద్యార్థులు బాగా చదువుతున్నారని గ్రామస్తులు తెలుపుతున్నారు. పిల్లల్లో వెలుగులు నింపడానికి టీచర్ వచ్చారని స్థానికులు అంటున్నారు. పాఠశాల నిర్మించడానికి గతంలో నిధులు ఖర్చు చేసినా పునాదులు స్థాయికి వచ్చి ఆగిపోయాయి. పక్కా భవనం ఉంటే విద్యార్థులు బాగా చదవడానికి ఉత్సాహం చూపుతారని గ్రామస్తులు అంటున్నారు.
పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన
పిల్లలకు పరిశుభ్రతపై ఎప్పుకప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పిల్లలతో పాటు గ్రామస్తులకు చైతన్యం చేస్తున్నారు. వంతల పంచాయతీలో ఆదిమ జాతి గిరిజన గ్రామాలలో అన్నిటికంటే ఈ గ్రామంలో ఎక్కువ మంది పిల్లలు చదువు పట్ల ఆసక్తి తెలివితేటలు కనబరుస్తున్నారు.
విధుల పట్ల ఆనందం
పోస్టింగ్ వచ్చినవెంటనే వంట్లమామిడి గ్రామానికి వెళ్లి విధులు నిర్వహించడం కష్టంగా ఉండేది. తాము తీసుకుంటున్న డబ్బులకు తమ గిరిజనులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కష్టమైనప్పటికీ విధులు నిర్వహించాలని నిశ్చయించుకున్నాను. ఈ విధులు కష్టమైనప్పటికీ ఆనందాన్ని కలగజేస్తుంది. ఇదీ నా బాధ్యత కూడా. భవిష్యత్తులో ఎక్కడ పనిచేసినా క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తాను.
- కొటారి వలసయ్య, ఉపాధ్యాయుడు,
చదువుపై పిల్లలు ఆసక్తి
గ్రామానికి టీచరు వచ్చినప్పటి నుండి పిల్లలు పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. ప్రతిరోజు పాఠశాలకు నిర్ణీత సమయంలో టీచరు వచ్చి పిల్లలకు చదువు బాగా చెబుతున్నాడు. టీచరును ఇక్కడ నుండి బదిలీ చేస్తే ఊరుకోం.
-మర్రి దేవుళ్లు, వంట్లమామిడి గ్రామం,.
పిల్లలకు అర్థమయ్యేలా బోధన
తమ పిల్లలు ఆదిమ జాతి గిరిజనులు అయినప్పటికీ అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. టీచరు పిల్లలకు అర్థమయ్యే విధంగా పాఠాలు చెబుతున్నారు. పిల్లలందరూ చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు
- మర్రి భాస్కర్, కొండబాబు,వంట్లమామిడి గ్రామస్తులు,
మిడ్డేమీల్స్ సరుకుల కోసం గుర్రం
విద్యార్థులకు మిడ్డేమీల్స్ కోసం ఓ గుర్రాన్ని కొనుగులు చేసి, డిఆర్‌డిపో నుంచి పాఠశాల నుంచి సరుకులు తీసుకొస్తాం. గ్రామస్తులు, తాను కలిసి కుర్రాన్ని కొనుగోలు చేశాం.
-చంటి, విద్యా కమిటీ చైర్మన్,.
🏇 ఉపాధ్యాయ ధీర - గంపరాయి వెంకట రమణ....కొండల్లో స్కూల్ - మాస్టారు కోసం గుర్రం కొనిచ్చిన గ్రామస్తులు... రోజు స్కూల్ కి గుర్రం పైనే....వివరాలు.... *వీడియో తో సహా.....
0 Comments:
Post a Comment