Kartar Singh Sarabha- (24 May 1896 -November 17 1915 )కర్తార్ సింగ్ సరాభా..ది గ్రేట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ "- చరిత్ర లో కనిపించని త్యాగం.... ~ MANNAMweb.com

Search This Blog

Latest Posts ⚡ లేటెస్ట్ పోస్ట్స్

MORE TO VIEW

Friday 16 August 2019

Kartar Singh Sarabha- (24 May 1896 -November 17 1915 )కర్తార్ సింగ్ సరాభా..ది గ్రేట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ "- చరిత్ర లో కనిపించని త్యాగం....

Kartar Singh Sarabha was a revolutionary who was among the most famous and reputed martyrs of Punjab. He was 17 years old when he became a member of Ghadar Party, then came up as a leading luminary member and started fight for an independent India. He was one of the most active members of the movement.

"1915 నవంబర్ ..అప్పుడే వస్తున్న నూనూగుమీసాలతో చాలా అమాయకంగా,ఎంతో తేజోవంతమైన ముఖంతో ఫిరోజ్ పూర్ కోర్టు బోనులో నిలబడివున్నాడో యువకుడు. చురుకైన చూపులతోనూ,పెదాలపై చక్కని చిరునవ్వుతో కనిపిస్తున్న ఆ యువకుడి వంక ఒకనిమిషం తదేకంగా చూసాడు జడ్జిగారు. గొంతుసవరించుకుంటూ  నీవు విప్లవకారులతో కలిసి కంటోన్మెంట్ పై బాంబులతో దాడికి పథకం రచించావా? అని అడిగాడు జడ్జి. అవును స్థిరంగా బదులిచ్చాడాయువకుడు. అతని సమాధానం విని ఆశ్చర్యపోయాడు జడ్జి. ఆ యువకుడికి శిక్షవేయాలంటే మనసురావడంలేదతనికి. చేసినది తప్పు అని క్షమాపణ అడుగు,శిక్షతగ్గించి వదిలేస్తానన్నాడాజడ్జి. చిన్నగా నవ్వాడాయువకుడు.నేను ఆంగ్లేయదోపిడీ మీద దాడి చేసాను.వారినే క్షమాపణ అడుగుతానా?? మీరు నాకు ఉరిశిక్షవేయండి.మళ్ళీ జన్మ అంటుా వుంటే మళ్ళీ ఇదేగడ్డమీదపుట్టి మళ్ళీ మీతో పోరాడాలని కోరుకుంటానన్నాడాయువకుడు. ఆ మాటలకు కోపంతో ఊగిపోయాడాజడ్జి..ఆ యువకుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పుచెప్పి గబగబ లేసి వెళ్ళిపోయాడు.
Kartar Singh Sarabha was a revolutionary who was among the most famous and reputed martyrs of Punjab. He was 17 years old when he became a member of Ghadar Party, then came up as a leading luminary member and started fight for an independent India. He was one of the most active members of the movement.  "1915 నవంబర్ ..అప్పుడే వస్తున్న నూనూగుమీసాలతో చాలా అమాయకంగా,ఎంతో తేజోవంతమైన ముఖంతో ఫిరోజ్ పూర్ కోర్టు బోనులో నిలబడివున్నాడో యువకుడు. చురుకైన చూపులతోనూ,పెదాలపై చక్కని చిరునవ్వుతో కనిపిస్తున్న ఆ యువకుడి వంక ఒకనిమిషం తదేకంగా చూసాడు జడ్జిగారు. గొంతుసవరించుకుంటూ నీవు విప్లవకారులతో కలిసి కంటోన్మెంట్ పై బాంబులతో దాడికి పథకం రచించావా? అని అడిగాడు జడ్జి. అవును స్థిరంగా బదులిచ్చాడాయువకుడు. అతని సమాధానం విని ఆశ్చర్యపోయాడు జడ్జి. ఆ యువకుడికి శిక్షవేయాలంటే మనసురావడంలేదతనికి. చేసినది తప్పు అని క్షమాపణ అడుగు,శిక్షతగ్గించి వదిలేస్తానన్నాడాజడ్జి. చిన్నగా నవ్వాడాయువకుడు.నేను ఆంగ్లేయదోపిడీ మీద దాడి చేసాను.వారినే క్షమాపణ అడుగుతానా?? మీరు నాకు ఉరిశిక్షవేయండి.మళ్ళీ జన్మ అంటుా వుంటే మళ్ళీ ఇదేగడ్డమీదపుట్టి మళ్ళీ మీతో పోరాడాలని కోరుకుంటానన్నాడాయువకుడు. ఆ మాటలకు కోపంతో ఊగిపోయాడాజడ్జి..ఆ యువకుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పుచెప్పి గబగబ లేసి వెళ్ళిపోయాడు.   1915 నవంబరు 17 ఆ యువకుడిని ఉరితీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతనిని చూడటానికి వచ్చాడు అతని తాత బదన్ సింగ్ . మనవడిని చూడగానే వలవలా ఏడ్చాడతను. ఏడుస్తున్న తాతను ఓదార్చుతూ..తాతా..ఎందుకు ఏడుస్తున్నావు?? నేనేమీ మీరు తలదించుకొనే పనిచేయలేదు. ఒక పోరాటవీరునిగా ఆత్మార్పణ చేస్తున్నాను..మీరు ఏడిస్తే నాకు ప్రాణం మీద తీపిరావచ్చు..బతకాలనే కోరికరావచ్చు.జడ్జిని క్షమాపణకోరవచ్చు..కోరమంటావా తాత అని అన్నాడు.అంతే టక్కన కన్నీళ్ళు తుడుచుకొని ,తన చేతులతో మనవుడి మొహాన్ని దగ్గర తీసుకొని నుదిటిన ముద్దు పెట్టుకొని,అక్కడ నుండి వడివడివెళ్ళిపోయాడా తాత.    ఇద్దరు సిపాయలు వచ్చి పెడరెక్కలు పట్టుకోబోగా..వారిని వారించి తనే నడుచుకుంటుా ఉరికొయ్య దగ్గరకు వచ్చి ..వందేమాతరం..వందేమాతరం నినాదాలిస్తుా...చిరునవ్వుతో ఉరితాడు మెడకు తగిలించుకొన్నాడు.వణుకుతున్న చేతులతో తలారి అతని కాళ్ళక్రిదవున్న చెక్కను తొలిగించడం..గిలగిలాకొట్టుకుంటూ అతను అనంతలోకాలకు వెళ్ళడం జరిగింది.    ఇంతకీ ఆ యువకుని పేరేమిటో తెలుసా?? కర్తార్ సింగ్ సరాభా..ది గ్రేట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ " 1896 మే 24 న పుట్టిన కర్తార్ సింగ్ నాలుగేళ్ళకే తండ్రిపోగొట్టుకున్నాడు. తాత దగ్గరే పెరిగాడు. 1912 లో చదువుల కొరకై అమెరికా వెళ్ళాడు. అక్కడ గద్దర్ పార్టీలో చేరాడు. బాంబులు తయారుచేయడం ,ప్రయోగించడం నేర్చుకున్నాడు. అత్యంత చురుకైన కార్యకర్తగా పేరు సంపాదించుకున్నాడు. ఆయుధపోరాటం ద్వారానే స్వాతంత్రం సంపాదించాలనే ఆశయంతో 1915 ఫిబ్రవరి 21 న 20 వేలమంది విప్లవకారులతో ఫిరోజ్ పూర్ కంటోన్మెంట్ పై దాడి ద్వారా సమరం మొదలుపెడుదామనుకున్నాడు.కానీ "కృపాల్ సింగ్ అనే నమ్మకద్రోహివల్ల కర్తార్ సింగ్ తో పాటు 80 మందిని పోలీసులు అరెష్ట్ చేసారు.   " కర్తార్ సింగ్ పేరు స్వాతంత్రసంగ్రామచరిత్రలో కనిపించదు.కనీసం మన పాఠ్యపుస్తకాలలోనూ వినిపించదు...కానీ 19 యేండ్లకే ఈ దేశస్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన యోధుడు అతడు!! వ్యాసకర్త వడిచెర్ల రవీంద్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు గూడూరు ,నెల్లూరు జిల్లా

1915 నవంబరు 17 ఆ యువకుడిని ఉరితీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతనిని చూడటానికి వచ్చాడు అతని తాత బదన్ సింగ్ . మనవడిని చూడగానే వలవలా ఏడ్చాడతను. ఏడుస్తున్న తాతను ఓదార్చుతూ..తాతా..ఎందుకు ఏడుస్తున్నావు?? నేనేమీ మీరు తలదించుకొనే పనిచేయలేదు. ఒక పోరాటవీరునిగా ఆత్మార్పణ చేస్తున్నాను..మీరు ఏడిస్తే నాకు ప్రాణం మీద తీపిరావచ్చు..బతకాలనే కోరికరావచ్చు.జడ్జిని క్షమాపణకోరవచ్చు..కోరమంటావా తాత అని అన్నాడు.అంతే టక్కన కన్నీళ్ళు తుడుచుకొని ,తన చేతులతో మనవుడి మొహాన్ని దగ్గర తీసుకొని నుదిటిన ముద్దు పెట్టుకొని,అక్కడ నుండి వడివడివెళ్ళిపోయాడా తాత.
      ఇద్దరు సిపాయలు వచ్చి పెడరెక్కలు పట్టుకోబోగా..వారిని వారించి తనే నడుచుకుంటుా ఉరికొయ్య దగ్గరకు వచ్చి ..వందేమాతరం..వందేమాతరం నినాదాలిస్తుా...చిరునవ్వుతో ఉరితాడు మెడకు తగిలించుకొన్నాడు.వణుకుతున్న చేతులతో తలారి అతని కాళ్ళక్రిదవున్న చెక్కను తొలిగించడం..గిలగిలాకొట్టుకుంటూ అతను అనంతలోకాలకు వెళ్ళడం జరిగింది.
      ఇంతకీ ఆ యువకుని పేరేమిటో తెలుసా?? కర్తార్ సింగ్ సరాభా..ది గ్రేట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ "
1896 మే 24 న పుట్టిన కర్తార్ సింగ్ నాలుగేళ్ళకే తండ్రిపోగొట్టుకున్నాడు. తాత దగ్గరే పెరిగాడు. 1912 లో చదువుల కొరకై అమెరికా వెళ్ళాడు. అక్కడ గద్దర్ పార్టీలో చేరాడు. బాంబులు తయారుచేయడం ,ప్రయోగించడం నేర్చుకున్నాడు. అత్యంత చురుకైన కార్యకర్తగా పేరు సంపాదించుకున్నాడు. ఆయుధపోరాటం ద్వారానే స్వాతంత్రం సంపాదించాలనే ఆశయంతో 1915 ఫిబ్రవరి 21 న 20 వేలమంది విప్లవకారులతో ఫిరోజ్ పూర్ కంటోన్మెంట్ పై దాడి ద్వారా సమరం మొదలుపెడుదామనుకున్నాడు.కానీ "కృపాల్ సింగ్ అనే నమ్మకద్రోహివల్ల కర్తార్ సింగ్ తో పాటు 80 మందిని పోలీసులు అరెష్ట్ చేసారు.
    " కర్తార్ సింగ్ పేరు స్వాతంత్రసంగ్రామచరిత్రలో కనిపించదు.కనీసం మన పాఠ్యపుస్తకాలలోనూ వినిపించదు...కానీ 19 యేండ్లకే ఈ దేశస్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన యోధుడు అతడు!!
వ్యాసకర్త
వడిచెర్ల రవీంద్ర
ప్రభుత్వ ఉపాధ్యాయులు
గూడూరు ,నెల్లూరు జిల్లా

0 Comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top