సెప్టెంబరులో 7వ విడత ఆర్థిక గణన
గ్రామ/ వార్డు స్థాయి నుంచి సంస్థల వివరాలు నమోదు
ఇంటింటికీ వెళ్లి సమాచార సేకరణ
రాష్ట్రంలో సెప్టెంబరు నుంచి ఏడో విడత ఆర్థిక గణన కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి గణకుల నియామకం, శిక్షణ కార్యక్రమాలు దశల వారీగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర గణాంక సంస్థల పర్యవేక్షణలో కామన్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో సర్వే చేపడుతున్నారు. మొత్తం 15 వేల మంది వరకు గణకులు, 7 వేల మంది వరకు పర్యవేక్షకులు పాల్గొంటారని కేంద్ర గణాంక విభాగం (విజయవాడ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆర్.కిరణ్‌కుమార్ తెలిపారు.
ఏమిటీ ఆర్థిక గణన?
దేశంలో మొదటి ఆర్థిక గణన 1977లో జరిగింది. తర్వాత 1980, 1990, 1998, 2005, 2013ల్లో నిర్వహించారు. ఆర్థిక గణనలో భాగంగా భారత భూభాగంలో ఏర్పాటైన అన్ని రకాల సంస్థలు, వాటి చిరునామా, యాజమాన్యాలు, అందులో పనిచేసే వారి వివరాలన్నీ సేకరిస్తారు. రంగాల వారీగా వ్యాపారం.. ఎంతమందికి ఉపాధి లభిస్తోంది? అసంఘటిత రంగంలో ఎంతమంది పని చేస్తున్నారు? దేశ స్థూల ఉత్పత్తి, జాతీయ ఆదాయంలో వీరి వాటాకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తారు.
ఇదీ ప్రయోజనం
ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగాలు.. వాటిలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, రుణాల మంజూరు, ప్రోత్సాహకాల అందజేత తదితర అంశాలను ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో విశ్లేషించి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతుంది.
మొబైల్ యాప్ ద్వారా
కాగితంతో పని లేకుండా పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో వివరాలుసేకరిస్తారు. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసే ఈ వివరాలు నేరుగా కేంద్ర గణాంక సంస్థ సర్వర్‌కు చేరతాయి.
మూడు విభాగాల్లో గణన
1. ఇంటింటి సర్వే- కుటుంబంలోని సభ్యులు ఎక్కడ, ఏ రంగంలోని సంస్థలో పని చేస్తున్నారు? వారి వేతనాలు, తదితర వివరాలు సేకరిస్తారు.
2. ఇంటి నుంచే పొందే ఉపాధి (కూరగాయల అమ్మకం, బడ్డీ కొట్లు, మిషన్ కుట్టడం, బ్యూటీపార్లర్, కొవ్వొత్తుల వంటివి తయారీ, ఆటోలు.. తదితర) వివరాలు
3. సంస్థలు- ఆ ప్రాంతంలో ఉన్న సంస్థలు, అందులో ఏం చేస్తారు? (వీటికి ఒక కోడ్ కేటాయిస్తారు)
ఆరు నెలల్లో పూర్తి
సర్వే ప్రారంభించిన నాటి నుంచి ఆరు నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. మూడున్నర నెలల్లో జిల్లాల వారీగా గణన పూర్తి చేస్తారు. తర్వాత రాష్ట్రస్థాయిలో విడుదల ప్రక్రియ ఉంటుంది.

0 Comments:
Post a Comment