భారత్‌తో తలపడనున్న విండీస్ బాహుబలి!
ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. టీమిండియా సిరీస్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వినిపిస్తున్న యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌కు జట్టులో చోటు దక్కలేదు. అయితే విండీస్ బోర్డు ఆల్‌రౌండర్ రకీం కార్న్‌వాల్ జట్టులో చోటు సంపాదించాడు. ఆంటిగ్వాకు చెందిన కార్న్‌వాల్‌ను అందరూ ‘మౌంటైన్ మ్యాన్’గా పిలుస్తారు. దానికి కారణం అతడి భారీకాయం. ఆరు అడుగుల ఆరు అంగుళాల ఎత్తు ఉన్న అతడి బరువు 140 కేజీలు. భారీకాయంతో ప్రత్యర్థులను వణికిస్తున్న కార్న్‌వాల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నాడు. 55 మ్యాచుల్లో 2224 పరుగులతో పాటు 260 వికెట్లు పడగొట్టాడు. 2017లో భారత్‌తో జరిగిన అనధికార టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టాడు. విరాట్ కోహ్లీ, పుజారా, అజింక్య రహానెను సైతం బోల్తా కొట్టించి అందరి ప్రశంసలు అందుకున్నాడు.
కార్న్‌వాల్ క్రికెట్‌లో రాణించలేడని అందరూ భావించారు. కానీ నిలకడగా ప్రదర్శన చేస్తూ అంతర్జాతీయ మ్యాచులకు అతడు ఎంపిక అయ్యాడు. అక్కడి స్థానిక క్రికెట్ పరిపాలన బోర్డు గత ఏడాది అతడిపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. అతడి బరువును తగ్గించేందుకు ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. మొత్తంగా టెస్టుల్లో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌తో జరిగే సిరీస్‌కు అతడు ఎంపిక అయ్యాడు. తుదిజట్టులో స్థానం దక్కించుకుంటే అత్యంత బరువు ఉన్న క్రికెటర్‌గా కార్న్‌వాల్ రికార్డు సృష్టిస్తాడు.
0 Comments:
Post a Comment