Ananda vedika Daily programmes Date 8/8/2019 -ఆనంద వేదిక వేదిక కార్యక్రమాలు....తేదీ : 8/8/2019 ,గురువారం 1 నుంచి 10 తరగతుల కార్యక్రమాలు.
ఆనంద వేదిక( గురువారం,తేదీ.8/8/2019)పూర్తి కృత్యము
(లెవెల్-1-2)1నుండి 5 తరగతులు( లెవెల్ ..3 )6నుండి 8 తరగతులు
Dr.మురహరరావు ఉమాగాంధీ
మనం చూసిన విన్న చదివిన దానికంటే కృత్యం ద్వారా లభించిన జ్ఞానం ఎల్లప్పుడూ..గుర్తుండి పోతుంది. విద్యార్థి తనకు తాను వ్యక్తిగా ఎదుగుతూ..తనపట్ల తాను అవగాహన ఏర్పరచుకుంటూ..
కుటుంబం పట్ల సమాజం పట్ల ప్రకృతి పట్ల ఒక సంపూర్ణావగాహన పెంచుకోవడమే..లక్ష్యం కావాలి.
కృత్య నిర్వహణ గురు శుక్రవారాలలో ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే.
నిన్న . విద్యార్థులు విన్నకథ లోని మౌళిక విలువల ఆధారంగా..కృత్యాల నిర్వహణ ఉంటుంది.ఆటలంత ఆనందంగా..
పాటలంత ఉత్సాహంగా .కృత్య నిర్వహణ జరిగేలా చూసే బాధ్యత ఉపాధ్యాయునిదే.
కృత్యము 1-2 లెవెల్( 1 నుండి5 తరగతులు)
***************************
సహకరించుకుందాం
**************************
ఉద్దేశ్యం; విద్యార్థులలో. . సహాయం సహకారం లక్షణాలను పెంపొందించడం.
*******************************
కృత్యం; 3వ లెవెల్; (6 నుండి 8 తరగతులు)
***************************** నాకు మీరు తెలుసు
****************************
ఉద్దేశ్యం;విద్యార్థుల మధ్య సంబంధాలను పెంపొందించడం.
ముందుగా ...
మైండ్ ఫుల్ యాక్టివిటీ (ధ్యాన ప్రక్రియ)
మూడు నిమిషాలు చేయించాలి
* సాధారణ శ్వాసలు
* వాటి కొనసాగింపు
* దీర్ఘ శ్వాసలు
* వాటి కొనసాగింపు
* తిరిగి సాధారణ శ్వాసలు
* నెమ్మదిగా. కళ్ళు తెరవడం
కృత్యం నిర్వహణ.
******************
రేపటినుండి పాఠశాలలకు వరుసగా సెలవులు గావున కృత్యం పూర్తిస్థాయిలో...
ఈరోజు నిర్వహించాలి.
కార్యాచరణ సోపానాలు:
*********************
కరపత్రిక లో...కృత్యం రెండు రోజులకి ఇవ్వబడింది. కానీ పాఠశాలలకు సెలవులు కారణంగా ..కృత్యం ఈరోజే పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఉపాధ్యాయుడు ఇచ్చే ఆదేశానుసారంగా
విద్యార్థులు ప్రతిస్పందించాలి
.విద్యార్థులతో ..వారి అభిరుచులపై...ఈకృత్యం వల్ల వచ్చే మార్పులపై కొన్ని ప్రశ్నలు
ఉపాధ్యాయుడు చర్చించాలి.
*విద్యార్థులందరూ..ఆనందవేదికలో పాల్గొనాలి.
ఉపాధ్యాయులకు సూచనలు:
**************************
ఇందులో...విద్యార్థులందరూ..పాల్గొన్నట్లు చూడాలి
* ఉపాధ్యాయుడు వీలైతే విద్యార్థులతో సహజంగా..స్వేచ్ఛగా..మాట్లాడేలా.. చేయాలి.
* తరగతి వాతావరణం ఉల్లాసంగా ఉండే లా.. చూడాలి.
మౌనప్రక్రియ:
************
విద్యార్థులందరినీ... రెండు నిమిషాలపాటు కళ్ళు మూసుకొని కూర్చోమనాలి. కళ్ళు మూసుకొని ఉంచలేనట్లయితే...కళ్ళు తెరచి కిందకి చూడమనవచ్చు.
* ఈ కృత్యాన్ని ఇంట్లో..తల్లి దండ్రులతోనూ...స్నేహితుల తోనూ చెప్పి వారితో కలసి ఉన్నప్పుడు వారికి సహకరించాలని విద్యార్థులకు తెలియజేయాలి
ధన్యవాదాలతో..
Dr. మురహరరావు.ఉమాగాంధి
(SRP)
ఆనందవేదిక
ఆనంద వేదిక 4 లెవల్ 9 /10 తరగతుల వారికి .....మాల్లారెడ్డి .శంకర ప్రసాద్.
రేపు ఎల్లుండి సెలవు. అదేవిధంగా వచ్చే వారంలో కూడా సోమవారం మరియు ఆగస్టు 15 సెలవు. కనుక ఈ ఈవారం నైపుణ్యం ఈరోజుతో పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో ఈరోజు రేపు ఎల్లుండి చేయాల్సిన కార్యక్రమాలు కలిసి ఉన్నాయి.
- శంకర్ ప్రసాద్
0 Comments:
Post a Comment