ఆదివాసులు ఎవరు?
ఆదివాసుల విలువలకు సరైన గుర్తింపు లేకపోవ డానికి, వెనుకబాటు తనానికి ముఖ్య అవరోధం వారి భాషకి లిపి లేకపోవడమే. ఈ లిపి లేని తనం వారి ఉనికికి, అస్తిత్వానికి పెద్ద దెబ్బ. వారి సంస్కృతులు, సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. అందువల్ల వారు భావితరాలకు వారి పూర్వ వివరాలను అందించ లేకపోతున్నారు. ఇది వారి మనుగడకే పెను సవాలుగా మారింది.
భారతదేశంలో 705 రకా ల ఆదివాసీ తెగలు వివిధ రాష్ట్రాలలో, వివిధ కేంద్ర పాలిత ప్రాంతలలో విస్తరించి ఉన్నారు. వారిలో చెప్పుకోదగిన కొన్ని ముఖ్యమైన తెగలు బిల్, గొండి, సంతాల్, ముండా, ఒరయున్, బైగా, ఇతరులు ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం పది కోట్ల నలబై రెండు లక్షల మంది, మొత్తం దేశ జనాభాలో 8.6 శాతంగా ఉన్నారు. 1951లో 5.36 శాతం ఉండగా, 2011వ సంవత్సరానికి 8.6 శాతానికి పెరిగారు. అందులో కొంతమంది భారత రాజ్యాం గంలో పొందు పరచిన ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉంటే, మరి కొంతమంది ఆరో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నారు. ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నవారు ఈశాన్య భారతంలో, ఆరో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న వారు మధ్య, దక్షిణ భారతంలో విస్తరించి ఉన్నారు.
చట్టబద్ధంగా వీరిని 'షెడ్యూల్ తెగలు' అని పేర్కొ నగా, వారిని నేడు దేశంలో వివిధ పేర్లతో ఆది వాసు లని, వనవాసులని, గిరిజనులని ఆటవికులని పిలుస్తు న్నారు. అయితే నిజానికి వీరు ఎవరు అనే విషయాన్ని చూస్తే మనం వారి పూర్వ పరపరాలు తెలుసుకోవాలి. ఆదివాసుల చరిత్రను పరిశీలించినట్లయితే బ్రిటిష్ కా లంలో కూడా వివిధ రకాలుగా చెప్పబడ్డారు. 1891వ సంవత్సరంలో సేకరించిన జనాభా వివరణలో వీరి మతం 'aborigines'అని, 1901, 1911వ సంవత్స రంలో 'animism' అని, 1921వ సంవత్సరంలో 'tribal religion' అని, 1931వ సంవత్సరంలో 'primitive tribes' అని, 1941వ సంవ త్సరం లో 'tribes' అని పేర్కొన్నారు. ఆ తర్వాత మొట్టమొద టిసారి స్వతంత్ర భారతదేశంలో 1951వ సంవత్సరం లో 'schedule tribes' అని పేర్కొన్నారు. అయితే నేటివరకు వీరిని అధికారికంగా 'schedule tribes' అని పిలుస్తున్నారు. 1956లో వచ్చిన 'the sc/st moditiation order'లో ఉత్తర భారతదేశంలో ఉన్న షెడ్యూల్డ్ తెగల కంటే దక్షిణ భారతదేశంలో ఉన్న షెడ్యూల్డ్ తెగల వారు పేదవారని, అల్పులని, తక్కువ దృఢమైన వారని, ఎక్కువ ఆదిమ లక్షణాలు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. కానీ నేటికి ఈ భేదాలలో మార్పు లేదనే విషయాన్నీ గమనించవచ్చు. తెలుగు రాష్ట్రాలలో చూసినట్లయితే ఇంతకు ముం దు చెప్పిన విధంగా ఆదివాసులు లేదా గిరిజనులని వీరిని పిలుస్తున్నారు. కాకపోతే రాజ్యాంగంలో గుర్తించి న షెడ్యూల్డ్ తెగల వారందరినీ 'ఆదివాసులని' అంటే కుదరదు అనే చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని తెగల వారు మైదాన ప్రాంతాలలో ఉంటూ అభివృద్ధికి దూరం గా ఉన్నారు. ఇటువంటి తెగల వారిని 'ఆదివాసులని' పిలవలేం. ఎవరైతే పూర్వం నుంచి నాగరిక (అభివృద్ధి) సమాజానికి దూరంగా అడవిలో జీవిస్తూ అడవి తల్లిని నమ్ముకొని బతికే తెగలను ఆదివాసులు అనవచ్చు.
ప్రస్తుత సమాజంలో వీరి మతం గురించిన విష యానికి వస్తే చాలమంది షెడ్యూల్డ్ తెగల వారు హిందువులుగానే చలామణి అవుతున్నారు కానీ నిజా నికి కొన్ని తెగల వారు ఏ మతానికి చెందరనే విషయం చాలమందికి తెలియకపోవచ్చు. చాలమంది మానవ శాస్త్రవేత్తలు ఎక్కువమంది షెడ్యూల్డ్ తెగల వారు తమకు తామే హిందువులుగా మారారని అభిప్రాయ పడ్డారు. అయితే ఈ వాదన నిజం కాదు. ఎందుకంటే చాల తెగల వారికీ 'మతం' అంటే ఏమిటో తెలియదు. అలాంటప్పుడు వారు హిందూమతంలోకి రావడం అనేది జరగదు. గతంలో జనాభా వివరాలు సేకరించే టప్పుడు మతం అంటే ఏమిటో తెలియక ఎటువంటి సమాధానం ఇవ్వని వారందరినీ హిందువులుగా నమో దు చేసారు. అదే నేటి వరకు వారికి అధికారిక మతం అయింది. అయితే నేడు ఆదివాసులు ఇక నుంచి జరిగే జనాభా లెక్కల్లో తమకు ఒక ప్రత్యేక 'special column' ఏర్పాటుచేసి తమ మతంగా 'గోండి ధర్మ (కోయపున్నెం)'ను పొందుపరచాలని గొండ్వాన భూ భాగానికి చెందిన వివిధ రాష్ట్రాల 'రాజ్గొండ్ సేవ సమితి' వారు తమ తమ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీన్ని గురించి గత మే లో హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సెమినార్ ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల ఆదివాసులు చర్చించారు. అత్యధికంగా ఆదివాసులు నివసిస్తున్న భూభా గాన్ని 'గొండ్వాన' ప్రాంతంగా పిలుస్తారు. ఆ ప్రాంతం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఉతరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలలో విస్తరించి ఉంది. ఈ భూభాగంలో ఉన్న కొన్ని తెగల వారు తాము హిందువులం కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ భూభాగంలోని ఈ తెగల వారిలో గోత్రాలు, ఆచార వ్యవహారాలు, సంప్ర దాయాలు ఒకే విధంగా ఉంటాయి. సంస్కృతి సంప్ర దాయాలలో ఎటువంటి తేడాలు కనిపించవు. వీరు ప్రకృతిని, పూర్వీకులను కొలుస్తారు. నేటి వర్ణ వ్యవస్థకు లోనుకాకుండా దూరంగా ఉన్నారు. కావున వీరు దేశంలో ఉన్న ఏ మతానికి చెందినవారు కాదు. అందువల్ల వీరిని ఆదివాసులు అని పిలుస్తారు.
ఆదివాసుల విలువలకు సరైన గుర్తింపు లేకపోవ డానికి, వెనుకబాటు తనానికి ముఖ్య అవరోధం వారి భాషకి లిపి లేకపోవడమే. ఈ లిపి లేని తనం వారి ఉనికికి, అస్తిత్వానికి పెద్ద దెబ్బ. వారి సంస్కృతులు, సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. అందువల్ల వారు భావితరాలకు వారి పూర్వ వివరాలను అందించ లేకపోతున్నారు. ఇది వారి మనుగడకే పెను సవాలుగా మారింది. ఈ ప్రమాదాన్ని గమనించిన కొంతమంది గొండ్వాన భూభాగ పరిధిలోని ఆదివాసీ మేధావులు తమ ఉనికిని కాపాడుకోవాలంటే ఆదివాసులకు ప్రత్యేక లిపి ఉండాలని గుర్తించారు. దేశంలో సుమారు కోటి 20 లక్షల మంది మాట్లాడే గోండి భాషకు లిపి ఉండాలని ఆదివాసులు సత్వరమే ఆ దిశగా అడుగులు వేసి గొండ్వాన డిక్షనరీ నిర్మాణానికి పునాదులు వేసారు. ఇప్పటివరకు ఎనిమిది గొండ్వాన డిక్షనరీ వర్క్ షాపులు నిర్వహించారు. ఈ డిక్షనరీ నిర్మాణంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల వారు పాలుపంచుకుంటున్నారు. ఇందులో భాగంగా మొదటి గోండి డిక్షనరీ వర్క్‌షాప్ 2014 జూలై నెలలో సెంట్రల్గోండ్వాన నెట్ (CG net) సహకారంతో ఢిల్లీలో జరిగింది. అదేవిధంగా రెండోది 2014 ఆగస్టులో కన్నడ యూనివర్సిటీ సహాయంతో హంపి (కర్ణాటక)లో, మూడోది 2014 అక్టోబర్‌లో ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ సహాయంతో అమర్కంటక్ (మధ్యప్రదేశ్)లో, నాల్గోది 2014 డిసెంబర్‌లో రాజ్ గోండ్ సేవ సమితి, గోండ్వాన పంచాయత్ రాజ్ సెంటర్స్ ఐఖీృఅ ఉట్నూర్ (ఆదిలాబాద్), సిజి నెట్ (బోపాల్) సహకారంతో ఉట్నూర్ (తెలంగాణా)లో, ఐదోది 2015 మార్చిలో ఆదివాసీ సంక్షేమ పరిషత్, కోయ్తొర్ బాట, ఐఖీృఅ భద్రాచలం వారి సహకారంతో భద్రాచలం (తెలంగాణ)లో, ఆరోది 2015 నవంబర్‌లో గోండ్వాన ట్రైబల్ ఎడ్యుకేషన్ సొసైటీ వారి సహకారంతో చంద్రపూర్(మహరాష్ట్ర)లో, ఏడోది 2017 జనవరిలో అఖిల భారత గోండ్వాన మహాసభ వారి సహకారంతో ట్రినిటీ బ్రిడ్జి (కర్ణాటక)లో, ఎనిమిదోది 2018 మార్చిలో సిజి నెట్, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆరట్స్ వారి సహకారంతో ఢిల్లీలో జరిగాయి. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆదివాసులకు యూనివర్సిటీ ఆఫ్ హైదరా బాద్ వారిచే రూపొందిన తెలుగు-గోండి డిక్షనరీ అందుబాటులో ఉంది.
ఈ విధంగా ఆదివాసులు ఇప్పటివరకు మూడు వేల పదాలతో గోండి డిక్షనరీని రూపొందించారు. ఈ లిపి నిర్మాణం పూర్తికాగానే ఆదివాసులు తమ భాషను భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో పొందు పరచి అధికారిక భాషగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసుల ఆకాంక్ష మేరకు భారత ప్రభుతం వారు ఆశించినట్లు ప్రత్యేక మతాన్ని కేటాయించి, వారి భాషను అధికారిక భాషగా గుర్తించాలి.
లక్ష్మణ్ కోయ
(పరిశోధక సహాయకులు)
(సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్)

0 Comments:
Post a Comment