బడ్జెట్ అనంతరం బంగారం ధరలు ఒక్కసారిగా ఎగిసాయి. ముఖ్యంగా బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకం 2.5 శాతం పెంపు పసిడి ప్రేమికులకు శరాఘాతంగా మారింది. బంగారం ధర చూస్తే 24 కేరట్ల 999 ప్యూరిటీ బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.40 వేలు దాటింది. అయితే బంగారం భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇక బంగారం ధర పెరగడానికి గల కారణాలు చూస్తే.. మన దేశంలో బంగారంలో సింహభాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాము. అయతే బంగారం కొనుగోలు చేసేందుకు విదేశీ మారక ద్రవ్యంలోని డాలర్ల రూపంలో చెల్లిస్తున్నాం. ఎప్పుడైదే డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలహీనపడుతుందో, అప్పుడు దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరుగుతాయి. రూపాయి బలపడితే బంగారం ధరలు తగ్గుతాయి. అయితే రూపాయి విలువ తగ్గితే బంగారం ధరలు కూడా పెరుగుతాయి. అంతర్జాతీయంగా అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధంతో పసిడి ధరలు ఒక్కసారిగా ఎగిసాయి. వాణిజ్య యుద్ధం నేపథ్యంలో మదుపరులు తమ సంపదను బంగారంపై పెట్టుబడి పెట్టడమే సురక్షితంగా భావిస్తున్నారు. దీంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి.
అయితే భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందా అంటే మాత్రం, సమీప భవిష్యత్తులో మాత్రం అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకంటే, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులకే ఇందుకు కారణం, భవిష్యత్తులో బ్రెగ్జిట్ అంశం మార్కెట్లను కలవరపరచడం, దేశీయంగా డిమాండ్ పెరగడం, మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో బంగారం అంతకంతకు ధర పెరుగుతుందే తప్ప దిగే సూచనలు కనిపించడం లేదు. అలాగే రూపాయి మరింత బలపడే అవకాశాలు సైతం తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో బంగారం ధరలు పెరగవచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరో ఆరు నెలల్లో బంగారం ఊహకు అందనంత రేంజిలో పెరిగిన ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అయితే దీర్ఘకాలంలో అంతర్జాతీయ పరిస్థితులను కచ్చితంగా అంచనా వేయలేని నేపథ్యంలో బంగారం పెట్టుబడులపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ధరలో హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు తప్పకుండా ఫిజికల్ బంగారం కొనుగోలు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ముఖ్యంగా భారతీయులకు బంగారంతో విడదీయరాని బంధం ఉంది. పెళ్లిల్లు, పర్వదినాల్లో బంగారం కొనుగోలు చేయడం అనేది సంప్రదాయం. అందుకే బంగారం కొనుగోలు అత్యవసరం అనుకుంటే మాత్రం ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

0 Comments:
Post a Comment