వాట్సాప్‌లో త్వరలోనే మరో రెండు సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఒకటి- ఆడియో సందేశాలను నేరుగా పంపించడం కాకుండా.. రికార్డు చేసిన ఆడియోను పరిశీలించుకునే ఆప్షన్‌ను వాట్సాప్ తీసుకురానుంది. రెండోది- గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్, అమెజాన్ పేమెంట్ సర్వీస్‌ల వలెనే వాట్సాప్ కూడా పేమెంట్ సర్వీసులో
అడుగుపెట్టనుంది. ముఖ్యంగా ఆడియో సందేశాల్లో తప్పులు దొర్లకుండా ఉండేందుకు ఆడియో సందేశాలను పరిశీలించుకునే అవకాశాన్ని తీసుకురానుంది. వాట్సాప్‌లో టెక్ట్స్, వీడియో మెసేజ్‌లు పంపించే ముందు పరిశీలించుకునే అవకాశం ఉంది. ఒక్క ఆడియో మెసేజ్‌లకు మాత్రమే ఇప్పటివరకు ఆ అవకాశం లేదు. పోటీ ప్రపంచంలో తనకు తానే సాటి అని నిరూపించుకునే క్రమంలో వాట్సాప్ ఈ ఫీచర్‌పై దృష్టి పెట్టింది
సాధారణంగా వాట్సాప్ నుంచి వచ్చే మెసేజ్‌లు సెల్‌ఫోన్ స్క్రీన్‌పై కనిపించే సంగతి తెలిసిందే. మెసేజ్‌కు సంబంధించిన మొదటి లైన్‌లో కొంతభాగం స్క్రీన్‌పై కనిపిస్తుంది. అదే తరహాలో వాయిస్ మెసేజ్‌లకూ ఫీచర్‌ను డెవలప్ చేసే పనిలో ఉంది. ప్రస్తుతం IOS బీటా దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
అలాగే... గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలతో పనిలేదు. అన్నీ వాట్సాప్ నుండే గట్టిగా చెబుతోంది. ఈ పేమెంట్ సర్వీస్‌ల వలెనే ఇప్పుడు కొత్తగా వాట్సాప్ కూడా పేమెంట్ సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఈ మేరకు కావాల్సిన అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నది. అయితే ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్న వాట్సాప్ పేమెంట్‌ను... కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల అది నిలిపేశారు. రిజర్వ్‌బ్యాంక్ పర్మిషన్ ఇచ్చిన వెంటనే ఈ వాట్సాప్ పేమెంట్ సేవలు ప్రారంభమవుతాయని చెబుతున్నారు
0 Comments:
Post a Comment