Special Story On World Traveller Indian Marco Polo - Dr Machavarapu Adinarayana ~ MANNAMweb.com

Search This Blog

Friday, 5 July 2019

Special Story On World Traveller Indian Marco Polo - Dr Machavarapu Adinarayana

Special Story On World Traveller Indian Marco Polo -  Dr Machavarapu Adinarayana

Special Story On World Traveller Indian Marco Polo -  Dr Machavarapu Adinarayana  

ప్రకాశం జిల్లా వాసి.
అమ్మనబ్రోలు పొరుగున చవటపాలెం.
నిరుపేద కుటుంబం నుంచి
స్కాలర్ జిప్సీగా ఎదగడం.
ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేయడం.
గ్లోబులోని ఏడు ఖండాల్లోని 30కి పైగా దేశాల్లో 30 వేల కిలోమీటర్లు నడవడం.
మా ప్రకాశం జిల్లా మోటుపల్లి రేవుకి
అప్పట్లో ఇటలీ యాత్రికుడు
మార్కోపోలో వచ్చాడు.
ఇదుగో..
ఇప్పుడు ఈ ఆదినారాయణ
ఇండియన్ మార్కోపోలో అనుకుంటాను.
తెలుగులోనే కాదు
దేశంలోనే 'యాత్రా సాహిత్యాని'కి
అమ్మా, నాయినా అయిన వాడు.
ఇప్పుడు
ఇతడి గురించి రష్యాలో పత్రికలు కథనాలను రాశాయి.



సముద్రం జ్ఞానమైతే ఒక వెన్నెల రాత్రి పడవ మీద ప్రయాణించగలగటం ఒక మధురానుభూతి. జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి’ అనే డాక్టర్‌ మాచవరపు ఆదినారాయణ ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలుకు సమీపంలోని చవటపాలెం గ్రామ నివాసి. ఒంగోలు సీఎస్‌ఆర్‌ శర్మా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఆదినారాయణ ఆ తర్వాత విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఫైన్‌ ఆర్ట్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా చేసి ఇటీవలే రిటైర్‌ అయ్యారు. ‘ఇండియన్‌ ట్రావెలర్‌ ఇన్‌ రష్యా’ అనే పేరుతో రష్యన్‌ పత్రికలు డాక్టర్‌ ఆదినారాయణ గురించి వ్యాసాలు రాశాయి.
జీవిత విశేషాలు 
డాక్టర్‌ ఆదినారాయణ ప్రయాణానుభవాలకి, ఆయన మైండ్‌ సెట్‌కీ ఒక కలయిక ఉంటుంది. ‘ఎగుడుదిగుడు కాలిబాటలు నా స్వర్గద్వారాలు’ అంటూ తన జీవిత లక్ష్యాన్ని చాటిచెప్పారాయన. ‘ఎన్ని దేశాలు తిరిగినా, కొత్త ప్రదేశం అంటూ ఏదీ అనిపించలేదు. విదేశం అంటూ ఏదీ లేదు. దూరంగా ఉన్న స్వదేశాలే అన్నీ. ప్రపంచమంతా ఒక గుండ్రని గ్రామం’ అంటారు. విశ్వమానవీయతను చాటే డాక్టర్‌ ఆదినారాయణ ప్రపంచానికి పక్కా లోకల్‌గా అనిపిస్తాడు. ఆయన స్వయంగా శిల్పి, చిత్రకారుడు. కొండలు, పర్వతాలు అధిరోహించటం, వాగులు, వంకలు, లోయల్లో ప్రయాణించడం, గ్రామీణ జీవితంలో లీనం కావడం, అక్కడి వనరుల్లోనే సర్దుకుపోవడం ఆయన తన ప్రయాణాల్లో నేర్చుకున్న అంశాలు. ఇప్పటి వరకు 7 ఖండాల్లో 30కి పైగా దేశాల్లో ఆయన పాదయాత్రలు చేశారు. ఈ క్రమంలో 30 వేల కిలోమీటర్లకు పైగా నడిచారు.
ఆయన నడిచినంతమేరా ఆయా ప్రాంతాల భౌగోళిక విశేషాలు, కళ, సంస్కృతి, మతం, సారస్వతం, ఆహారం, ఆహార్యం, గృహ నిర్మాణం, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, కుటుంబ జీవిత నిర్మాణం, జీవన శైలి, వృత్తులు, విరామ సమయాల కాలక్షేపాలు పరిశీలిస్తారు. తన పరిశీలనలోకి వచ్చిన విషయాలను అక్షరీకరించి పుస్తకాలు రాస్తారు. ‘కదిలే పంజరం లాంటి ఈ శరీరంలో స్థిరంగా ఉండలేక, బంధాల్ని తెగ్టొట్టుకుని బయటికి వచ్చిన ప్రయాణాల పక్షిని నేను’ అన్న సొంత విచక్షణ కలిగిన డాక్టర్‌ ఆదినారాయణ కాలినడకతో ప్రపంచాన్ని చుట్టివచ్చారు. తన మీద ప్రభావం చూపిన వ్యక్తుల గురించి చెబుతూ.. ‘‘మా తాతయ్య వైకుంఠ పెరుమాళ్లు మాదిరిగా పాటలు పాడుకుంటూ, ప్రకృతిని పూజించుకుంటూ పూర్తిస్థాయి దేశదిమ్మరిగా మారిపోదాం’ అనేవారు. డిగ్రీ చదువుకునే రోజుల్లో లోకసంచారిగా ఉండాలని తీర్మానించుకున్నా. ‘ఒరే చిన్న గాలోడా’ అని చిన్నప్పుడు మా అమ్మ పిలిచేది. ఆ పిలుపును సార్థకం చేసుకున్నా’’ అని చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకున్నారు.


ఆయన ప్రయాణాల్లో కొన్ని..
ఆసియా ఖండంలోని నేపాల్‌(2009), భూటాన్‌(2010), ఇరాన్‌(2011), చైనా(2013), ఐరోపాలోని స్వీడన్‌(2012), నార్వే(2014), ఇటలీ(2014), బ్రిటన్‌(2015), స్కాట్లాండ్‌(2015), ఉత్తర అమెరికాలోని మెక్సికో(2014), దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌(2016), ఆఫ్రికాలోని నైజీరియా(2013), ఆస్ట్రేలియాలోని తాస్మానియా(2015)లో ఆయన చేసిన ప్రయాణాల తాలూకు విశేషాలను ఆయన రాసిన ‘భూభ్రమణ కాంక్ష’లో పొందుపరిచారు. ఇటీవల రష్యా పత్రికల్లో ఆయన ప్రముఖంగా నిలిచారు. రష్యన్‌ కాలమిస్టు దిమిత్రో త్యికోటిన్‌ ‘వెలుగు–విజయం’ పేరుతో రాసిన వ్యాసం సాహిత్య లోకంలో చర్చనీయాంశమైంది. ఏ దేశం వెళితే ఆ దేశ భాష నేర్చుకునే స్కాలర్‌ జిప్సీ, ఇండియన్‌ మార్కోపోలోగా పేరు గడించిన డాక్టర్‌ ఎం.ఆదినారాయణ మన జిల్లా వాసి కావడం విశేషం.

‘తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది’ – డాక్టర్‌ మాచవరపు ఆదినారాయణ

దేశ‌దిమ్మ‌రి కాదు విశ్వ‌సంచారి

పక్కనే మెట్లు కన్పిస్తున్నాగానీ.. అదేదో భారమనుకుని లిఫ్ట్‌ కోసం ఎంతసేపైనా ఆగుతాం. చేతిలో బైక్‌ ఉంటేగానీ పక్క వీధిలోకి కూడా అడుగుపెట్టని రోజులివి. రోజంతా కారు దిగక, తమ బైక్‌ని వదలక భారీగా పెరిగిపోయిన శరీరాన్ని తగ్గించుకోవడానికి మార్నింగ్‌ వాక్‌లతో ఆపసోపాలు పడతాం. నడక అరుదైపోతున్న ఈ యాంత్రిక యుగంలో కాలినడకతోనే ఆయన భూగోళమంతా చుట్టేశారు. ఆ నిరంతర ప్రపంచ సంచారిపేరు డాక్టర్‌ మాచవరపు ఆదినారాయణ. ఆయన సన్నిహితులంతా ఆయన్ని ''నడకల నారాయణ'' అంటారు. విశాఖపట్నంలోని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో లలితకళల విభాగంలో ఆచార్యునిగా సేవలందిస్తున్నారు. ఇప్పటికి 35 వేల కిలోమీటర్లు దేశదిమ్మరిలా సంచరించిన ఆయన గురించి....
ఆదినారాయణకు బాల్యం నుంచే ''భ్రమణకాంక్ష'' అంకురించింది. ఆయన స్వస్థలం ఒంగోలు సమీపంలోని చవటపాలెం గ్రామం. పక్క ఊరు అమ్మనబ్రోలు హైస్కూల్‌లో ఆదినారాయణ చదువు సాగింది. ఆ ఊరి రైెలు కట్ట వెంట అతని స్నేహితులతో కలిసి వెళ్లేవారు. రైలులో నుంచి ప్రయాణీకులు విసిరేసిన వస్తువుల్ని ఆదినారాయణ ఆసక్తిగా ఏరుకుంటూ వెళ్లేవారట! ఆయన ఏరిన వ్యర్థాల్లో సిపాయి మార్కు అగ్గిపెట్టె ఒకటి. దానిమీద 'జిప్సీ ప్రిన్స్‌' అని ఉండే బొమ్మను చూసి, ఆదినారాయణకు కూడా సంచారం పైకి మనసు మళ్లింది. ఆయన పదో ఏట ఏదో విషయం మీద ఇంట్లో వాళ్లపై అలిగి, ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఒంగోలు చేరారు. అలా ఆ రోజు నడకలో లభించిన ఆనందం.. తన వెంట ఇప్పటికీ నడుస్తూనే వస్తుందని ఆదినారాయణ ఆనందంగా చెబుతుంటారు.
ఇండియన్‌ మార్కోపోలోగా
విదేశీ మిత్రులు ఆదినారాయణ పేరు చెప్పగానే ''ఇండియన్‌ మార్కోపోలోనా?'' అంటారు. మార్కోపోలోతో కూడా ఆదినారాయణకు చిన్నవయసులోనే పరిచయం ఏర్పడిపోయింది. వారి ఊరు దగర్లోనే కడవకుదురు గ్రామం పక్కనున్న మోటుపల్లి సముద్ర తీరంలో ఒకప్పటి ఓడరేవు ఉండేది. ఇటలీ దేశపు ప్రఖ్యాత యాత్రీకుడు మార్కోపోలో, చైనాకు చెందిన కుబ్లయిఖాన్‌.. వీరిద్దరూ పర్షియా మీదుగా వెనీస్‌ పోయే సమయంలో మోటుపల్లి ఓడరేవులో ఆగి, కాకతీయుల పరిపాలన గురించి వివరాలు సేకరించినట్టుగా చారిత్రక ఆధారాలున్నాయి. అక్కడికి వెళ్లిన ప్రతిసారీ ఆదినారాయణ కూడా మార్కోపోలో మాదిరిగా యాత్రలు చేయాలనుకునేవారు. 
ప్రకృతి- ప్రపంచమే నేస్తాలు
ఒంటరితనం ఆయనకు ప్రపంచాన్ని చేరువ చేసింది. తన యవ్వనంలో ఉన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు. కొన్నాళ్లకు తోబుట్టువులైన ఇద్దరన్నదమ్ములు, సోదరి ఆయనని ఒంటరిని చేసి, ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. ఈయన పెళ్లి కూడా చేసుకోలేదు. ''జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది'' అనే సినీ గీతానికి అచ్చమైన నిర్వచనంలా ఆదినారాయణ మనకు కన్పిస్తారు. చూడగానే ఆకట్టుకునే ప్రత్యేక రూపం.. పసితనం ఉట్టిపడే మాట.. పెద్ద గెడ్డం, మెడకో సంచి.. ఇదే ఆయన ఆహార్యం. కొందరు యూనివర్సిటీ ప్రొఫెసర్లకుండే సహజ భేషజాలు ఈయనకు తెలియవనే చెప్పాలి. 
తొలియాత్ర మొదలైందిలా
ఆదినారాయణ 26 ఏళ్ల కిందటే తన తొలియాత్రకు శ్రీకారం చుట్టారు. 1990లో హిమాలయ గ్రామసీమల్లో 20 రోజులపాటు 300 కిలోమీటర్ల పర్యటనతో పాదయాత్రికుడిగా ప్రస్థానం ప్రారంభించారు. అలా వివిధ సందర్భాలలో ఈ దేశంలోని వివిధ రాష్ట్రాలలో 23 వేల కిలోమీటర్లు తిరిగారు. అప్పటికి ఆయనకి 35 ఏళ్లు. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండటంతో ఆర్థికంగా ఎటువంటి సమస్యలూ ఆయనకు ఎదురుకాలేదు. ఈ దేశంలోని ముఖ్యమైన ప్రాంతాలన్నీ చుట్టేశాక, ఆయనకి ప్రపంచయాత్ర చేయాలనిపించింది.
జగమంతా మానవ కుటుంబమే
తన వసుధైక కుటుంబ భావనకు ఆలంబనగా విదేశాలలో ఆరేళ్ల కిందట తన నడక యాత్రను ప్రారంభించారు. తన తొలి విదేశీ పర్యటనలో నేపాల్‌, భూటాన్‌, చైనా, ఇరాన్‌ దేశాల్లో సంచారం చేశారు. తర్వాత నార్వే, స్వీడన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, బ్రిటన్‌, స్కాట్లాండ్‌ దేశాల్లో పర్యటించారు. అనంతరం మెక్సికో, దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌, ఆఫ్రికాలోని నైజీరియా, ఆస్టేల్రియాలోని టాస్మానియా, ఐల్యాండ్‌లలో విజయవంతంగా నడకయాత్ర పూర్తి చేశారు. గత మార్చిలో బ్రెజిల్‌లో పర్యటించారు. ఈ యేడాదిలో జర్మనీ యాత్రకు వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారు. 

పక్కా ప్రణాళికతో యాత్ర
ఆదినారాయణ ప్రయాణాలేవీ అప్పటికప్పుడు నిర్ణయించుకుని చేసేవి కాదు. అందుకు నాలుగు నెలల ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. తాను పర్యటించబోయే దేశాన్ని నిర్ణయించుకుని, ఇంటర్నెట్‌ సాయంతో వీసా, తదితర సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ఏ దేశంలో ఎవరింటికి వెళ్లినా.. ఎన్నాళ్లు అక్కడ ఉన్నా.. వారికి చేదోడు వాదోడుగా ఆయన ఉంటారు. ఊరికే కూర్చొని తినడం ఆయనకు నచ్చదు. ఇన్నేళ్ల యాత్రలలో ఆయన సొంత సొమ్ము ఖర్చు చేసింది కేవలం మూడు లక్షల రూపాయలే. యాత్ర ముగియగానే ఆ అనుభవాలకు అక్షరరూపం ఇవ్వడం ఆదినారాయణకు ఉన్న మంచి అలవాటు. ''డెకొరేటివ్‌ ఆర్ట్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియన్‌ టెంపుల్స్‌, భ్రమణకాంక్ష, జిప్సీలు, స్త్రీ యాత్రీకులు, మహా యాత్రీకులు, తెలుగువారి ప్రయాణాలు'' ఇలా ఆరు పుస్తకాలు రచించారు. త్వరలో ''భూ భ్రమణకాంక్ష '' అనే పుస్తకాన్ని తీసుకురానున్నారు. 
నిరాడంబర జీవనం
మత్స్యకార జీవన నేపథ్యాన్ని తన కుంచెలో సొగసుగా దాచుకున్న ఈ సంచారి తన నివాసం కూడా బెస్తవాడలోనే. ప్రముఖ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌ అయినా సొంత కారు, బైకు, కనీసం సైకిల్‌ కూడా లేని ఆదినారాయణ ఎంత దూరమైనా కాలినడకనే ఎక్కువగా అధిగమిస్తుంటారు. కమ్యూనిస్ట్‌ భావజాలంతో, ప్రజలతో మమేకమయ్యే సుగుణం ఆయనది. ఆదినారాయణ మాటల్లో రాహుల్‌ సాంకృత్యాయన్‌, ఏనుగుల వీరాస్వామి, వెన్నెలకంటి సుబ్బారావు, వై.వి.లక్ష్మయ్య వంటి వారి పేర్లు నిత్యం ప్రస్తావనకు వస్తూనే ఉంటాయి. పాదయాత్రలు, రచనలు చేయడం మాత్రమే కాదు. చిత్రలేఖనం, శిల్పాలు చెక్కటం కూడా ఆయన ప్రధాన వ్యాపకాలు కావడం మరో విశేషం. 
గమనమే గమ్యం
''ఇప్పటివరకూ నేను చేసిన యాత్రల వలన నేను గుర్తించినదేమంటే.. నేను ఎంచుకున్న లక్ష్యం చాలా చిన్నదిగా అన్పిస్తోంది. కేవలం నలభైవేల కిలోమీటర్ల చుట్టుకొలత కలిగిన ఈ భూగోళంలో నాకు ఇంకా కేవలం ఐదు వేల కిలోమీటర్లే మిగిలాయి. అందుకే నా లక్ష్యం సాధించాలంటే విశ్వయాత్ర చేయాలి. ఒకప్పుడు ప్రపంచమంతా పాదయాత్ర చేస్తానంటే మిత్రులు, తెలిసినవాళ్లు పిచ్చోడన్నారు. వర్సిటీ పరువు తీస్తున్నావని ఇంకొందరు అన్నారు. అదే నోటితో నా యాత్రలను ప్రశంసించినవాళ్లూ ఉన్నారు. ఎవరేమన్నా గమనమే నా గమ్యం. తుదిశ్వాస వరకూ నడుస్తూనే ఉండాలన్నది నా ఆకాంక్ష.!'' 
- డాక్టర్‌ మాచవరపు ఆదినారాయణ

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top