కరెన్సీ నోట్లనుగుర్తించేందుకు యాప్!
★ దృష్టిలోపాలున్న వారు కరెన్సీ నోట్లను గుర్తు పట్టేందుకు వీలుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
★ మొబైల్ కెమెరా ముందు మహాత్మా గాంధీ సిరీస్, మహాత్మా గాంధీ న్యూ సిరీస్ కరెన్సీ నోటుని ఉంచి ఫొటో తీస్తే ఆడియో రూపంలో ఆ కరెన్సీ విలువ ఎంతో అది తెలుపుతుంది.
★ ఒకవేళ ఫొటో సరిగ్గా తీయకపోతే ‘మరోసారి ప్రయత్నించండి’ అని చెబుతుంది.
★ ఈ యాప్‌ను అభివృద్ధి చేయడం కోసం సాంకేతిక సంస్థల నుంచి ఆర్బీఐ బిడ్‌లను ఆహ్వానించింది.
★ ప్రస్తుతం రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నాయి. మరోవైపు రూ.1 నోటు కూడా ఉంది.
★ దృష్టిలోపాలున్న వారు గుర్తుపట్టడానికి ప్రస్తుతం రూ.100 ఆపై విలువ గల నోట్లపై ఇంటాగ్లియో ప్రింటింగ్ ఆధారిత గుర్తులు ఉన్నాయి.
★ ‘‘దృష్టి లోపాలు ఉన్న వారు భారతీయ నోట్లతో కొనుగోలు, విక్రయ వ్యవహారాలు జరిపేటప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్లను తీర్చేందుకు మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయాలని వెండర్లకు ఆర్బీఐ సూచన.
★ ప్రస్తుతం దేశంలో దృష్టిలోపం ఉన్నవారు 80 లక్షల మంది ఉన్నారు.
★ ఈ మొబైల్ యాప్ అభివృద్ధి కోసం టెక్నాలజీ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది.
★వంద రూపాయలకు అంతకుమించిన విలువైన నోట్ల గుర్తింపు కోసం ఇప్పటికే ఇంటాగ్లియో ప్రింటింగ్ ఆధారిత గుర్తింపు చిహ్నాలను (నోటు చివర లైన్లు) కరెన్సీలపై ఆర్బీఐ ఏర్పాటు చేసింది.
★ మరింత పారదర్శకత కోసం ఈ మొబైల్ యాప్ సహాయపడుతుందని ఆర్బీఐ నమ్ముతోంది. గత ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 18 లక్షల కోట్లు విలువ చేసే 102 బిలియన్ నోట్లు దేశంలో చలామణిలో ఉన్నాయి.
0 Comments:
Post a Comment