8 ప్రైవేటు ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజనం
కేంద్రీకృతభోజనంzగదుల నుంచి మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 8 ప్రైవేటు ఏజెన్సీలను నియమించామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొ న్నారు. సభ్యులు కత్తి నరసింహారెడ్డి, చిక్కాల రామచంద్ర రావు, విఠపు బాలసుబ్రహ్మణ్యం తదితరులు మధ్యాహ్న భోజనం పథకంలో నెలకొన్న పలు సమస్యలపై ప్రశ్నించారు. అక్షయపాత్ర సంస్థ అందజేస్తున్న భోజన రుచిగా లేదని, విద్యార్థులకు తాజా భోజనాన్ని అందజేయ ట్లేదని, ఏజెన్సీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ పిల్లలకు వారానికి ఐదు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉండగా, అక్షయపాత్ర ఆపని చేయట్లేదన్నారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి సురేష్ సమాధానమిస్తూ.. రాష్ట్రంలో అక్షయపాత్ర ఫౌండేషన్, ఇస్కాన్, నవప్రయాస్-ఢిల్లీ, ఏక్తాశక్తి-ఢిల్లీ, అల్లూరి సీతారామరాజు ఎడ్యుకేషనల్ సొసైటీ, బుద్దవరపు ట్రస్టు, గోదావరి విద్యా వికాస సొసైటీ, నారాయణ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యాన మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. వాటి ద్వారా మొత్తం 4,403 పాఠశాలలకు చెందిన 5,17,739 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్నామని చెప్పారు
0 Comments:
Post a Comment